అమెజాన్ ఈ సేల్ కోసం ICICI బ్యాంక్, SBI బ్యాంక్ లతో టైఅప్ అయింది. ఈ రెండు బ్యాంకుల క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై గరిష్ఠంగా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.
Photo Credit: Amazon
అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకమైనది
అమెజాన్ ప్రైమ్ డే 2025 ఇండియాలో జూలై 12 నుంచి జూలై 14 వరకు జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ స్పెషల్ సేల్ కోసం అమెజాన్ ఇప్పటికే కొన్ని ఆఫర్లను ప్రకటిస్తుంది. ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీస్‌లపై గరిష్ఠంగా 40 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. అంతేకాదు, టీవీలు, గృహోపకరణాలు, అమెజాన్ ప్రోడక్ట్స్, హోమ్ & కిచెన్ ఐటమ్స్, ఫర్నిచర్, ఫ్యాషన్ ఐటెమ్స్ వంటి విభాగాల్లో కూడా భారీ తగ్గింపులు ఉండనున్నాయి. ఇవే కాకుండా స్మార్ట్‌ఫోన్లు మరియు వాటి యాక్సెసరీస్‌పైన కూడా గరిష్ఠంగా 40% వరకు తగ్గింపు లభించనుంది. ఇప్పటికే అమెజాన్ తన వెబ్‌సైట్‌లో సేల్‌కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు, బ్యాంక్ ఆఫర్లను ఉంచింది
ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, వన్ ప్లస్13s, ఐకు నియో 10R వంటి హై-ఎండ్ మోడల్స్‌పై స్పెషల్ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి.
మూడు రోజుల పాటు జరిగే ఈ సేల్లో పలు బ్రాండ్‌ల నూతన మోడళ్లను కూడా అమ్మకానికి ఉంచనున్నారు. అందులో శాంసంగ్ గెలాక్సీ M36 5G, వన్ ప్లస్ నార్డ్ 5, వన్ ప్లస్ నార్డ్ CE 5, ఐకు Z10 లైట్ 5G, రియల్ మీ నార్జో 80 లైట్ 5G, హానర్ X9c, ఒప్పో రెనో 14 సిరీస్, లావా స్ట్రోమ్ లైట్ 5G మొదలైన మోడల్లు ఉన్నాయి.
అమెజాన్ ఈ సేల్ కోసం ICICI బ్యాంక్, SBI బ్యాంక్ లతో టైఅప్ అయింది. ఈ రెండు బ్యాంకుల క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై గరిష్ఠంగా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. అంతేకాకుండా, ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్ వినియోగదారులకు కూడా తగ్గింపు అందించనున్నారు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై నో-కాస్ట్ EMI ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అమెజాన్ పే ద్వారా పేమెంట్ చేసే వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఇస్తున్నారు.
అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అదనంగా ఎక్కువ తగ్గింపులు లభిస్తాయి. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, స్పీకర్లు, వేరబుల్స్ పై గరిష్ఠంగా 40% డిస్కౌంట్ వస్తుంది. ట్యాబ్లెట్లు, స్పీకర్లపై గరిష్ఠంగా 60% డిస్కౌంట్ దొరుకుతుంది. ఇతర వేరబుల్స్, కెమెరాలు, ఇతర గ్యాడ్జెట్లపై 50% డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
టీవీలు, హోం అప్లయాన్సెస్ పై 65% డిస్కౌంట్ ఇస్తున్నారు. సోనీ, శాంసంగ్, LG , TCL, షియోమీ, ఉత్పత్తులపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. హోం అప్లయాన్సెస్ పై కూడా ఇదే రేంజ్‌లో ఆఫర్లు ఉంటాయి. శాంసంగ్ 43 ఇంచ్ క్రిస్టల్ 4K విస్టా ప్రో అల్ట్రా HD టీవీ అసలు ధర రూ.46,900 కాగా, ప్రైమ్ డే సమయంలో ఇది రూ.26,999 కే లభిస్తుంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 ప్రో TWS ఈయర్‌బడ్స్ కూడా తగ్గింపు ధరతో అమ్మకానికి వస్తున్నాయి.
ప్రైమ్ డే 2025లో అమెజాన్ సొంత బ్రాండ్లైన ఎకో స్పీకర్లు, ఫైర్ టీవీ డివైసులు, కిండిల్ వంటి ఉత్పత్తులపై గరిష్ఠంగా 50% వరకు డిస్కౌంట్ లభించనుంది.
ప్రైమ్ డే ఆఫర్లను పొందాలనుకునే యూసర్లు కచ్చితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కలిగి ఉండాలి. ఒకవేళ మీకు ప్రైమ్ మెంబర్షిప్ లేకపోతే సేల్ సమయంలో 30 రోజుల ఫ్రీ ట్రయల్ ప్రారంభించి కూడా ఆఫర్లను యాక్సెస్ చేయవచ్చు. వార్షిక ప్రైమ్ మెంబర్‌షిప్ ధర ప్రస్తుతం రూ.1,499 గా ఉంది. ఇక ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ మెంబర్‌షిప్ ధర రూ.399కి పొందవచ్చు.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
iQOO Z11 Turbo Selfie Camera Details Teased Ahead of January 15 Launch
CMF Headphone Pro Launched in India With 40mm Drivers, Energy Slider and 100-Hour Battery Life