Starlink మద్దతు గల కంపెనీలు ఇండియాలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యను 10 మిలియన్‌ల వరకూ పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నాయి
Photo Credit: Starlink
స్పేస్‌ఎక్స్ మారుమూల ప్రాంతాలలో కూడా స్టార్‌లింక్ ఉపగ్రహ కనెక్షన్‌ను అనుమతించే రిసీవర్ కిట్‌ను అందిస్తుంది
మన దేశంలో Starlink తమ శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక నివేదిక ద్వారా దీని ప్రమోషనల్ ధర నెలకు $10 ( మన కరెన్సీ ప్రకారం, సుమారు రూ. 850) కంటే తక్కువ ఉంటుందని సమాచారం. అంతే కాదు, లాంఛ్ సమయంలో ప్రమోషనల్ ఆఫర్లలో భాగంగా అపరిమిత డేటా ప్లాన్‌ను వినియోగదారులకు అందించే అవకాశాలు ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. Starlink మద్దతు గల కంపెనీలు ఇండియాలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యను 10 మిలియన్‌ల వరకూ పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నాయి.ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం,భారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులను లాంఛ్ చేసేందుకు ఈ నెల మొదట్లోనే Starlink ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ రూపంలో అనుమతులు పొందింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (TRAI) పట్టన ప్రాంతంలో సర్వీసులు అందిస్తే, వినియోగదారులు అదనంగా రూ. 500 నెలకు చెల్లించాలని సూచించినట్లు సమాచారం.
మన దేశంలో కమర్షియల్ సర్వీసులను అందించేందుకు 8 శాతం లైసెన్సింగ్ ఛార్జ్ తోపాటు, Starlink తోసహా అన్ని కంపెనీలు కూడా ప్రభుత్వానికి వారి వార్షిక ఆదాయంలో నాలుగు శాతం వాటాగా ఇవ్వాల్సి ఉంటుందని TRAI సూచించింది. ఇవి ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద పరిశీలనలోనే ఉన్నాయి. ప్రస్తుతం Starlink తక్కువ ధరలతో ఆఫర్‌లను ప్రకటించి, వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగానే నెల ప్లాన్ దర కేవలం రూ. 850 గా నిర్ణయించినట్లు సమాచారం. ఇదే నిజమైతే, ఇండియాలో Starlink ప్లాన్ ప్రపంచంలోనే అతి చౌకైన ప్లాన్‌గా పరిచయం కానుంది.
Starlink కంపెనీ ప్రపంచ కుభేరుడు Elon Musk కు చెందిన ప్రయివేట్ స్పెస్ కంపెనీ SpaceX డెవలప్ చేసిన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్. ఇది శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి మూరుమూల ప్రాంతాలకు సైతం హై స్పీడ్, low-latency బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్‌ను వినియోగదారులకు చేరువచేయనుంది. భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో ఉండే తక్కువ భూమి కక్ష్య లేదా ఎల్ఈఓ శాటిలైట్ constellationకి చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తోంది.
ఈ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీసుల కోసం వినియోగదారులు నెలకు $80 (దాదాపు రూ. 6,800) చెల్లిస్తున్నారు. ఇందు కోసం వారు Starlink స్టాండర్డ్ కిట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర $349 ( సమారు రూ. 29,700)గా ఉంది. అలాగే, ఎక్కువగా ప్రయాణాలు చేసేవారి కోసం కంపెనీ రోమ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 50జీబీతో వచ్చే ఈ రోమ్ 50 ప్లాన్ ధర $50 (సుమారు రూ. 4,200) నుంచి మొదలవుతుంది. దీని కోసం స్టార్‌లింక్ మినీ కిట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర $299 (దాదాపు రూ. 25,400) గా ఉంది.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
iQOO Z11 Turbo Selfie Camera Details Teased Ahead of January 15 Launch
CMF Headphone Pro Launched in India With 40mm Drivers, Energy Slider and 100-Hour Battery Life