Photo Credit: Flipkart
ఈ ఏడాది భారత్‌లో పండగ సీజన్‌ను Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024తో మరింత ఆనందంగా జరుపుకోవచ్చు. ఈ సేల్ సెప్టెంబర్ 27న ప్రారంభం కానుందనే విషయం మనందరికీ తెలిసిందే. Flipkart ప్లస్ సభ్యులు సెప్టెంబర్ 26న అంటే, 24 గంటల ముందే సేల్‌కి ముందస్తు యాక్సెస్‌ను పొందుతారు. ఈ సేల్ సమయంలో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలతోపాటు అనేక రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. మరీ ముఖ్యంగా.. ఈ సేల్‌లో Google Pixel 8, Samsung Galaxy S23 హ్యాండ్‌సెట్‌లు సరసమైన ధరలకు లభించబోతున్నాయి.
ఈ-కామర్స్ దిగ్గజం Flipkart మొబైల్ యాప్‌లో ఇప్పటికే డిస్కౌంట్‌తో లభించే కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల ఆన్-సేల్ ధరలను రీవిల్ చేయడం ప్రారంభించింది. ఉదాహరణకు 8GB RAM, 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజీతో Google Pixel 8 రూ. 75,999కి సాధారణ ధర అందుబాటులో ఉంటుంది. అయితే, దీని ధర రూ. 40,000లకే ఉన్నట్లు చూపిస్తోంది. Samsung Galaxy S23 8GB RAM, 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజీతో లభించే మొబైల్ ధర రూ. 89,999 కాగా, ఇది కూడా రూ. 40,000లకే చూపిస్తోంది. అయితే, ఇప్పటి వరకూ ఏ స్మార్ట్‌ఫోన్‌ల ఆఫర్ ధరలను అదికారికంగా వెల్లడించలేదు.
అదనంగా, Samsung Galaxy S23 FE బేస్ మోడల్ ధర సాధారణంగా వెబ్‌సైట్‌లో రూ. 79,999కాగా, దీని ధర రూ. 30,000 లోపు అందుబాటులో ఉంటుందని టీజ్ చేయబడింది. అలాగే, Poco X6 Pro 5G కూడా రూ. 20,000 లోపు అందుబాటులో ఉంటుందని కంపెనీ టీజ్ చేసింది. ఇతర స్మార్ట్‌ఫోన్‌ల విక్రయ ధరలు ఇంకా వెల్లడి కానప్పటికీ, CMF ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2a, Poco M6 ప్లస్, Vivo T3X, Infinix Note 40 Pro వంటి ఫోన్‌లు మంచి తగ్గింపు ధరలకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది. ఈ ఒక్క ప్రకటనతో బిగ్ సెల్‌పై కొనుగోలుదారుల్లో మరింత ఆసక్తి నెలకొందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మరీ ముఖ్యంగా ఈ బిగ్‌సేల్‌లో ఆఫర్లతోపాటు కొనుగోలుదారులు అదనపు డిస్కౌంట్‌లను బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా పొందే అవకాశం కూడా ఉంటుంది. HDFC బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా కొనుగోలుదారులు వారి కొనుగోళ్లపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందుతారు. ఇంకా, Flipkart UPIతో లావాదేవీలు చేస్తే వినియోగదారులకు రూ. 50 తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ కూడా కస్టమర్‌లు క్రెడిట్ పొందవచ్చని పేర్కొంది. Flipkart పే లేటర్ చెల్లింపుల ద్వారా రూ. లక్ష వరకూ క్రెడిట్ పొందవచ్చని పేర్కొంది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడంపై నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా అందుబాటులో ఉంటాయి. మరి.. Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 కోసం సిద్ధంగా ఉన్నారా?!
ప్రకటన
ప్రకటన