ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) హెడ్‌సెట్‌లు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, హోమ్ అప్లయెన్సెస్, ల్యాప్‌టాప్‌లు, పీసీలు తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు భారీ తగ్గింపులతో లభిస్తున్నాయి.
Photo Credit: Flipkart
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 1,500 వరకు తగ్గింపును అందిస్తుంది
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 ఈ నెల 23న ప్రారంభమై ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతోంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన అధికారిక మైక్రోసైట్ ప్రకారం, ఈ భారీ సేల్ వచ్చే నెల ప్రారంభంలో, అంటే అక్టోబర్ 2న ముగియనుంది. సాధారణ కస్టమర్ల కంటే ఒక రోజు ముందుగానే ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మరియు VIP సభ్యులు ఆఫర్లను ఆస్వాదించే అవకాశం పొందారు.ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) హెడ్‌సెట్‌లు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, హోమ్ అప్లయెన్సెస్, ల్యాప్‌టాప్‌లు, పీసీలు తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు భారీ తగ్గింపులతో లభిస్తున్నాయి. అదనంగా, కస్టమర్లు ఎక్స్చేంజ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, అలాగే క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లపై ప్రత్యేక రాయితీలు పొందగలరు.
ఆక్సిస్ బ్యాంక్ మరియు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందుతుంది. అదనంగా, క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్లపై గరిష్ఠంగా రూ. 1,500 వరకు, నాన్-EMI ట్రాన్సాక్షన్లపై రూ. 1,000 వరకు సేవ్ చేసుకునే అవకాశం ఉంది.
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16, ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ S25+, పోకో F7 5G వంటి ఫోన్లు ప్రత్యేక ధరలతో అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులు ఐఫోన్ 16 ప్రో (128GB) మోడల్‌ను కేవలం రూ. 85,999కే పొందవచ్చు. దీనిపై అదనంగా ఐసీఐసీఐ లేదా ఆక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే మరో రూ. 5,000 తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధరను కంపెనీ రూ. 94,900కి తగ్గించింది.
అలాగే, ఐఫోన్ 14 బేస్ వెరియంట్ రూ. 39,999కి, ఐఫోన్ 16 రూ. 51,999కి లభిస్తోంది. ఇంకా పోకో ఫోన్లపై కూడా అద్భుతమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచి డీల్‌గా మారనుంది. కొత్తగా మొబైల్స్ కొనాలనుకున్నవారు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనాలి అనుకుంటున్నారు ఈ సేల్ పూర్తయిలోపు ఈ బంపర్ ఆఫర్ ను మిస్ కాకండి. ఈ సెల్ మొదలైన దగ్గర నుండి లక్షల మంది ఫ్లిప్‌కార్ట్ లో తమకు నచ్చిన ప్రోడక్ట్లను కొనుగోలు చేశారు. వాటిని వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే చాలామందికి ప్రోడక్ట్లు డెలివరీ అవ్వడం కూడా పూర్తయింది.
ప్రకటన
ప్రకటన