Photo Credit: Samsung
భారతదేశంలో Samsung Galaxy Buds 3 Pro రూ. 19,999 కు లాంచ్ అయింది
త్వరలో జరగనున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 లో వివిధ బ్రాండ్లకు సంబంధించిన గ్యాడ్జెట్స్ భారీ డిస్కౌంట్ తో లభించనున్నాయి. ఈ సేల్లో శాంసంగ్ బ్రాండ్ నుండి బడ్స్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. శాంసంగ్ తన గెలాక్సీ బడ్స్ 3 మరియు గెలాక్సీ బడ్స్ 3 ప్రో వేరియంట్లను 2024 జూలైలో భారత మార్కెట్లోకి విడుదల చేసింది. విడుదల సమయంలో గెలాక్సీ బడ్స్ 3 ధర రూ. 14,999గా ఉండగా, గెలాక్సీ బడ్స్ 3 ప్రో ధర రూ. 19,999గా ఉంది. అయితే, త్వరలో ప్రారంభంకానున్న అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ సందర్భంగా గెలాక్సీ బడ్స్ 3 ప్రోపై భారీ డిస్కౌంట్ లభించనుంది.
అమెజాన్ తాజా ప్రకటన ప్రకారం, గెలాక్సీ బడ్స్ 3 ప్రో ను ప్రైమ్ డే సేల్ సమయంలో కేవలం రూ. 10, 999కే పొందవచ్చు. ఇది అసలు ధరతో పోలిస్తే ఏకంగా రూ. 9,000 తగ్గింపుకి లభిస్తుంది. ఈ ప్రత్యేక ధర బ్యాంక్ ఆఫర్లు కలిపి లభించే ఎఫెక్టివ్ ధర. ఎస్బిఐ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుదారులకు 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే హెచ్.ఎస్.బి.సి, హెచ్.డి.ఎఫ్.సి ఫెడరల్ బ్యాంక్, వన్ కార్డ్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు రూ. 1500 వరకు అదనపు తగ్గింపు లభించే అవకాశముంది.
కస్టమర్లు కూపన్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ఆప్షన్లు వంటి ప్రయోజనాలను కూడా వినియోగించుకోవచ్చు. ఈ బడ్స్ ప్రస్తుతం సిల్వర్ మరియు వైట్ కలర్ వేరియంట్లలో మాత్రమే లభించనున్నాయి.
గెలాక్సీ బడ్స్ 3 ప్రో మోడల్లో 10.5mm డైనమిక్ డ్రైవర్ మరియు 6.1mm ప్లానార్ డ్రైవర్ వంటి రెండు రకాల ఆడియో డ్రైవర్లు ఉన్నాయి. ఇవి AI ఆధారిత యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌తో వస్తాయి. అంతేకాకుండా, యాంబియంట్ సౌండ్ మోడ్, వాయిస్ డిటెక్ట్, సైరన్ డిటెక్ట్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. మూడు మైక్రోఫోన్ల సిస్టంతో కూడిన ఈ బడ్స్, కాల్ సమయంలో నాయిస్ తగ్గించి క్లియర్ వాయిస్‌ను అందిస్తాయి.
ఈ బడ్స్‌లో బ్లూటూత్ 5.4, డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ, ఆటో స్విచ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే, IP57 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ పొందాయి. గెలాక్సీ AI ఫీచర్లలో భాగంగా AI ఇంటర్ప్రిటర్, AI వాయిస్ కమాండ్ వంటి ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఛార్జింగ్ కేస్‌కి 515mAh బ్యాటరీ, ఒక్కో బడ్కీ 53mAh బ్యాటరీ బ్యాకప్ లభించునుంది. ANC ఆపివేస్తే, ఒక్కసారి ఛార్జ్‌తో బడ్స్ మరియు కేస్ కలిపి 30 గంటల వరకు బ్యాకప్ ఇవ్వగలవు. ఒక రోజంతా పాటలు వినేవారికి, ఫోన్ మాట్లాడే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక్కో బడ్ బరువు 5.4 గ్రాములు కాగా, మొత్తం కేసుతో కలిపి బరువు 46.5 గ్రాములు ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 ప్రో పై ఇంత భారీ డిస్కౌంట్ ఇవ్వడం సాధారణంగా జరగదు. అయితే, ప్రైమ్ డే 2025 సేల్ సమయంలో తక్కువ ధరకే హై-ఎండ్ ఫీచర్లతో కూడిన ఈ ప్రీమియం బడ్స్‌ను పొందాలనుకునే వారికి ఇది ఒక అద్భుత అవకాశమని చెప్పవచ్చు. సేల్ జూలై 12 నుంచి జూలై 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ప్రకటన
ప్రకటన