అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇప్పుడు దీపావళి సందర్భంగా మరిన్ని ఆఫర్లను ప్రకటించింది.
Photo Credit: Lenovo
అమెజాన్ సేల్ 2025: లెనోవా 27-అంగుళాల QHD i9 32GB/1TB AiO ని రూ. 1,05,990 కి కొనుగోలు చేయవచ్చు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సోమవారం నుంచి ‘దీపావళి స్పెషల్' ఫేజ్‌లోకి వచ్చేసింది. దసరా సందర్భంగా ఇన్ని రోజులు అన్ని వస్తువులపై మంచి ఆఫర్లు లభించాయి. ఇక ఇప్పుడు దీపావళి సందర్భంగా మరికొన్ని ప్రొడక్ట్స్‌పై అత్యంత తగ్గింపుని ప్రకటించారు. సెప్టెంబర్ 23న దేశంలో విస్తృతంగా ఈ వార్షిక సేల్ ఈవెంట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పుడు మొదలైన ఈ సేల్ దీపావళి వరకు కొనసాగనుంది. వినియోగదారులకు మరిన్ని ఆఫర్లను ప్రకటించబోతోన్నారు.ఈ సేల్ ఆకర్షణీయమైన డీల్‌లను అందిస్తుందని అందరూ భావిస్తున్నారు. వినియోగదారులు ముఖ్యంగా ఆల్-ఇన్-వన్ మోడల్‌లతో సహా PCలపై డిస్కౌంట్‌లను చూస్తున్నారు. అయితే ఈ సేల్ రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ టీవీలు వంటి గృహోపకరణాలతో పాటు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఇతర ఎలక్ట్రానిక్‌లను కూడా కవర్ చేస్తుంది.
అర్హత కలిగిన బ్యాంక్ కార్డులను ఉపయోగించడం ద్వారా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్ సమయంలో వినియోగదారులు తమ పొదుపులను పెంచుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్, బాబ్‌కార్డ్, IDFC ఫస్ట్ బ్యాంక్, RBL బ్యాంక్ నుండి క్రెడిట్ కార్డ్‌లు కస్టమర్‌లకు అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపు, బోనస్ డీల్‌లతో పాటు, మొత్తం ప్రయోజనాలు రూ. 65,000 వరకు ఉంటాయి.
ఈ ప్రయోజనాలు అక్టోబర్ 12న రాత్రి 11:59 గంటల వరకు చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. కస్టమర్లు ఎక్స్ఛేంజ్ డీల్స్, EMI ఎంపికలు, ప్రత్యేకమైన కూపన్లను కూడా పొందవచ్చు. సేల్ సమయంలో ఆదా చేయడానికి బహుళ మార్గాలను అందిస్తుంది.
గతంలో, AI ఉత్పాదకత ల్యాప్‌టాప్‌లపై ఉత్తమ డీల్‌లు లేదా విద్యార్థులకు ఉత్తమ ల్యాప్‌టాప్ డీల్‌ల గురించి మేము మీకు చెప్పాము. వినియోగదారులకు కొన్ని ఉత్తమ గేమింగ్ ల్యాప్‌టాప్‌ల డీల్‌లను, అలాగే రూ. 1 లక్ష లోపు గేమింగ్ ల్యాప్‌టాప్‌లను కూడా మీకోసం తెలియజేస్తున్నాం. కొనసాగుతున్న అమెజాన్ సేల్ ముగిసే ముందు మీరు తనిఖీ చేయవలసిన ఆల్-ఇన్-వన్ PC లపై మంచి డీల్‌లను కింద పొందుపర్చాం..
ASUS A3202 21.45" FHD Celeron 8GB/256GB AiO ఒరిజినల్ ధర రూ. 47, 990 కాగా.. రూ. 24, 990లకే రానుంది. HP All-in-One 24" FHD Ryzen 3 8GB/512GB AiO మోడల్ ధర రూ. 51, 848 కాగా.. ఈ సేల్‌లో రూ. 36, 990కే రానుంది. Asus V440 23.8" FHD i3 8GB/512GB AiO ధర రూ. 59, 990 కాగా.. రూ. 39, 990కే లభిస్తోంది. HP 27" FHD i3 8GB/512GB AiO with IR Camera మోడల్ ధర రూ. 65, 374 కాగా.. రూ. 48, 990కే వస్తుంది. Asus A3402 23.8" FHD i5 8GB/512GB AiO మోడల్ ఒరిజినల్ ధర రూ. 79, 990 కాగా.. రూ. 54, 990లకే ఈ ఆఫర్లో రానుంది.
HP 27" FHD i5 16GB/1TB AiO ధర రూ. 93, 552 కాగా.. రూ. 69, 990లకే రానుంది. HP 27" FHD Core Ultra 5 16GB/1TB AiO ధర రూ. 93, 552 అయితే.. ఈ సేల్‌లో రూ. 75, 990కే రానుంది. Lenovo 27" FHD i7 16GB/1TB AiO with IR Camera ధర రూ. 98, 960 కాగా.. రూ. 81, 990కే వస్తుంది. Lenovo 27" QHD i9 32GB/1TB AiO ధర రూ. 1, 31, 190 కాగా.. ఈ సేల్‌లో మాత్రం రూ. 1, 05, 990లకే రానుంది.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
Salliyargal Now Streaming Online: Where to Watch Karunaas and Sathyadevi Starrer Online?
NASA’s Chandra Observatory Reveals 22 Years of Cosmic X-Ray Recordings
Space Gen: Chandrayaan Now Streaming on JioHotstar: What You Need to Know About Nakuul Mehta and Shriya Saran Starrer
NASA Evaluates Early Liftoff for SpaceX Crew-12 Following Rare ISS Medical Evacuation