దేశీయ మార్కెట్‌లోకి M4 చిప్‌తోపాటు Apple ఇంటిలిజెన్స్‌తో Mac Mini అడుగుపెట్టింది

ఈ కొత్త Mac Mini M4, M4 Pro రెండు ప్రాసెస‌ర్‌లుగా అందుబాటులోకి రానుంది. రెండో వేరియంట్‌ను కంపెనీ కొత్తగా తీసుకువ‌చ్చింది

దేశీయ మార్కెట్‌లోకి M4 చిప్‌తోపాటు Apple ఇంటిలిజెన్స్‌తో Mac Mini అడుగుపెట్టింది

Photo Credit: Apple

The new Mac Mini with M4 chip comes in a much smaller 5x5 inches form factor

ముఖ్యాంశాలు
  • రెండు మోడళ్లలోనూ గిగాబిట్ ఈథర్నెట్, థండర్ బోల్ట్ పోర్ట్‌లు ఉన్నాయి
  • ఇది తమ మొదటి కార్బన్-న్యూట్రల్ Mac మోడల్ అని ఆపిల్ ప్ర‌క‌టించింది
  • M1 మోడల్‌పై 1.8 రెట్లు CPU, 2.2 రెట్లు GPU మెరుగైన ప‌నితీరు చూపిస్తుంది
ప్రకటన

Apple కంపెనీ Mac Mini రిఫ్రెష్ వెర్షన్‌ను మార్కెట్‌కు ప‌రిచ‌యం చేసింది. దీని కాంపాక్ట్ డెస్క్‌టాప్ కంప్యూటర్‌ 24-అంగుళాల iMac M4ని ఇంత‌కు ముందే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త Mac Mini M4, M4 Pro రెండు ప్రాసెస‌ర్‌లుగా అందుబాటులోకి రానుంది. రెండో వేరియంట్‌ను కంపెనీ కొత్తగా తీసుకువ‌చ్చింది. ఇక M4 వేరియంట్ Mac Mini M1 కంటే 1.7 రెట్లు వేగవంతమైన పనితీరును అందిస్తుందని కంపెనీ ప్ర‌క‌టించింది.

వేరియంట్‌ల ధ‌ర ఇలా..

మ‌న‌దేశంలో ఈ M4 చిప్‌తో కూడిన Mac Mini 10-కోర్ CPU, 10-కోర్ GPU, 16GB యూనిఫైడ్ మెమరీ, 256GB ఆన్‌బోర్డ్ SSD స్టోరేజీతో వచ్చే బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 59,900గా ఉంది. M4 ప్రో చిప్‌తో కూడిన Mac Mini 12-కోర్ CPU, 16-కోర్ GPU, 24GB యునిఫైన్డ్‌ మెమరీ, 512GB ఆన్‌బోర్డ్ SSD స్టోరేజీ ధర రూ. 1,49,900. Mac Miniని Apple స్టోర్‌లు, Apple అధికారిక‌ రిటైలర్‌ల నుండి ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. దీని షిప్పింగ్ నవంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది.

యూనిఫైడ్ మెమరీతో..

M4 చిప్‌ Mac Mini 10-కోర్ CPU, 10-కోర్ GPU, 24GB వరకు యూనిఫైడ్ మెమరీ, 512GB వరకు ఆన్‌బోర్డ్ SSD స్టోరేజీని కలిగి ఉంది. ఇది M1 మోడల్‌పై 1.8 రెట్లు CPU, 2.2 రెట్లు GPU పనితీరు మెరుగుదలలను అందజేస్తుందని Apple చెబుతోంది. 5x5 అంగుళాల వద్ద, రిఫ్రెష్ చేయబడిన Mac Mini మునుపటి జ‌న‌రేష‌న్‌తో పోలిస్తే చాలా చిన్న ఫారమ్ ఫ్యాక్టర్‌లో వస్తుంది. మ్యాక్‌విస్పర్‌లో 2 రెట్లు వేగంగా ఆన్-డివైస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్పీచ్-టు-టెక్స్ట్‌ను అందిస్తుంది.

మోషన్ గ్రాఫిక్‌లు..

Apple Mac Mini మరింత శక్తివంతమైన వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. ఇది హుడ్ కింద సరికొత్త M4 ప్రో ప్రాసెస‌ర్‌తో వ‌స్తుంది. 14-కోర్ CPU, 20-కోర్ GPU, 64GB వరకు యూనిఫైడ్‌ మెమరీ, 8TB వరకు SSD స్టోరేజీని కలిగి ఉంటుంది. M2 Pro Mac Miniతో పోల్చినప్పుడు ఈ మోడల్ మోషన్‌లో 2 రెట్లు వేగంగా RAMకి మోషన్ గ్రాఫిక్‌లను అందించగలదని ధృవీకరించ‌బ‌డింది.

Apple ఇంటెలిజెన్స్‌..

ఇవి Apple ఇంటెలిజెన్స్‌ సపోర్ట్‌తో వస్తాయి. USB 3 స్పీడ్‌తో రెండు USB టైప్-C పోర్ట్‌లు, ముందు భాగంలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. వెనుకవైపు, Mac Mini M4లో మూడు Thunderbolt 4 పోర్ట్‌లు ఉండ‌గా, M4 Pro వేరియంట్‌లో మూడు Thunderbolt 5 పోర్ట్‌లు ఉన్నాయి. Apple తన మొట్టమొదటి కార్బన్-న్యూట్రల్ మ్యాక్ మినీని 50 శాతం రీసైకిల్ చేసిన కంటెంట్‌తో తయారు చేసిందని, ఇందులో 100 శాతం రీసైకిల్ అల్యూమినియం, యాపిల్ డిజైన్ చేసిన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌లలో 100 శాతం రీసైకిల్ గోల్డ్ ప్లేటింగ్, 100 శాతం రీసైకిల్ చేసిన అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఇకపోతే, Two-Step Verification కూడా ఈ మోడ్‌లో ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అవుతుంది.
  2. ఈ ఫోన్‌ ముఖ్య ఆకర్షణగా నిలిచింది దాని 7,000mAh భారీ బ్యాటరీ.
  3. దీనికి అదనంగా ఫ్రీ హోం రీప్లేస్మెంట్ సర్వీస్ కూడా అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.
  4. కళ్లు చెదిరే ధర, స్పెసిఫికేషన్లతో మోటరోలా ఎడ్జ్ 70.. ఈ మోడల్ ప్రత్యేకతలివే
  5. 16జీబీ ర్యామ్‌తో వన్ ప్లస్ ఏస్ 6.. ఇంకా ఇతర ఫీచర్స్ ఇవే
  6. మార్కెట్లోకి రానున్న సామ్ సంగ్ గెలాక్సీ ఏ57.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే
  7. ప్రాసెసర్గా MediaTek Dimensity 6300 చిప్సెట్ను ఈ ఫోన్లో ఉపయోగించారు.
  8. కెమెరా విభాగంలో ఈ సిరీస్ భారీ అప్గ్రేడ్తో రానుందని సమాచారం
  9. అదిరే ఫీచర్స్‌తో పోకో ఎఫ్8 అల్ట్రా, ఎఫ్8 ప్రో.. ఈ విశేషాలు మీకు తెలుసా?
  10. Realme C85 Pro 4G వెర్షన్ కూడా అదే 6.8 అంగుళాల స్క్రీన్తో వస్తుంది.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »