వన్‌ప్లస్ లవర్స్‌కు పండగే.. కాంపాక్ట్ సైజులో 'బీస్ట్' లాంటి పర్ఫార్మెన్స్.. లాంచ్ డేట్ ఫిక్స్!

వన్ ప్లస్ ఇప్పుడు ఒక పవర్ ప్యాక్డ్ 'కాంపాక్ట్ మిడ్-ఫ్లాగ్‌షిప్' మొబైల్‌ను మన ముందుకు తీసుకురావడానికి రెడీ అయిపోయింది. అదే వన్ ప్లస్ 15T.

వన్‌ప్లస్ లవర్స్‌కు పండగే.. కాంపాక్ట్ సైజులో 'బీస్ట్' లాంటి పర్ఫార్మెన్స్.. లాంచ్ డేట్ ఫిక్స్!

Photo Credit: OnePlus

The three colourways of the OnePlus 15T (pictured)

ముఖ్యాంశాలు
  • వన్‌ప్లస్ లవర్స్‌కు పండగే
  • కాంపాక్ట్ సైజులో 'బీస్ట్' లాంటి పర్ఫార్మెన్స్
  • వచ్చే వారం చైనాలో ఈ హ్యాండ్‌సెట్‌ను గ్రాండ్‌గా లాంచ్
ప్రకటన

వన్ ప్లస్ లవర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఆ అప్డేట్ రానే వచ్చేసింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎప్పుడూ తనదైన స్టైల్‌లో ట్రెండ్ సెట్ చేసే వన్ ప్లస్, ఇప్పుడు ఒక పవర్ ప్యాక్డ్ 'కాంపాక్ట్ మిడ్-ఫ్లాగ్‌షిప్' మొబైల్‌ను మన ముందుకు తీసుకురావడానికి రెడీ అయిపోయింది. అదే వన్ ప్లస్ 15T. గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లీక్స్‌కు ఎండ్ కార్డ్ వేస్తూ, వచ్చే వారం చైనాలో ఈ హ్యాండ్‌సెట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ మోడల్ కేవలం ఫీచర్ల పరంగానే కాకుండా, లుక్ పరంగా కూడా టెక్ ఫ్రీక్స్‌ను తెగ అట్రాక్ట్ చేస్తోంది.

ఈ మోస్ట్ అవైటెడ్ స్మార్ట్‌ఫోన్ మార్చి 24న సాయంత్రం 7 గంటలకు (బీజింగ్ టైమ్) చైనాలో లాంచ్ కాబోతోంది. ఒకవేళ మీరు ఇండియాలో ఉండి దీని కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటే, మన టైమింగ్స్ ప్రకారం ఆ రోజు సాయంత్రం 4:30 గంటలకు ఈ లాంచ్ ఈవెంట్‌ను చూడొచ్చు. ఇప్పటికే అక్కడ ఈ ఫోన్ కోసం ప్రీ-బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఒప్పో షాప్ వెబ్‌సైట్ ద్వారా ఎవరైతే ముందుగా ఈ ఫోన్‌ను బుక్ చేసుకుంటారో, వారికి దాదాపు నాలుగు వేల రూపాయల విలువ చేసే వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను వన్ ప్లస్ గిఫ్ట్‌గా ఇస్తోంది. మనకు కూడా ఇలాంటి ఆఫర్స్ ఉంటే భలే ఉంటుంది కదా అనిపిస్తోంది కదూ.

ఇక స్టోరేజ్ విషయానికి వస్తే వన్ ప్లస్ అస్సలు తగ్గలేదు. యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా ఏకంగా ఐదు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. బేసిక్ 12GB + 256GB నుండి మొదలుకొని ఏకంగా 16GB + 1TB వరకు భారీ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ కలర్ నేమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ప్యూర్ కోకో, రిలాక్సింగ్ మాచా,  హీలింగ్ వైట్ చాక్లెట్ అనే మూడు డిఫరెంట్ షేడ్స్‌లో ఇది లభిస్తుంది. ముఖ్యంగా ఆ వైట్ చాక్లెట్ వెర్షన్ గురించి టెక్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే దానికి ఒక స్పెషల్ ఫినిషింగ్ ఇచ్చారని టాక్ నడుస్తోంది.

డిజైన్ పరంగా చూస్తే ప్యూర్ కోకో, రిలాక్సింగ్ మాచా వేరియంట్స్ వెనుక వైపు 'AG ఫ్రాస్టెడ్ గ్లాస్' ప్యానల్‌ను కలిగి ఉంటాయి. దీనివల్ల ఫోన్ వాడుతున్నప్పుడు వేలిముద్రలు పడకుండా చాలా నీట్‌గా, మ్యాట్ ఫినిషింగ్‌తో క్లాసీగా కనిపిస్తుంది. ఇక హీలింగ్ వైట్ చాక్లెట్ వెరియంట్ కోసం కంపెనీ ఒక కొత్త 'మైక్రో-ఆర్క్ ఆక్సిడేషన్' ప్రాసెస్‌ను వాడిందట. దీనివల్ల ఫోన్ మెటల్ ఫ్రేమ్ , బ్యాక్ గ్లాస్ ప్యానల్ రెండూ ఒకే రకమైన యూనిఫామ్ వైట్ కలర్‌లో మెరిసిపోతూ కనిపిస్తాయి. చూడటానికి ఇది చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

పవర్, పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే వన్ ప్లస్ 15T ఒక బీస్ట్ అని చెప్పాలి. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను వాడుతున్నారు, ఇది రీసెంట్‌గా వచ్చిన వన్ ప్లస్ 15 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో కూడా ఉంది. గేమర్స్ కోసం ఇందులో నెక్స్ట్ జనరేషన్ గేమింగ్ ఇంజిన్‌ను సెట్ చేశారు, ఇది ఏకంగా 165fps వరకు గేమ్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఇందులో ఉన్న 'ట్రై-చిప్' సిస్టమ్ ఫోన్ పర్ఫార్మెన్స్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తుంది. 6.32 ఇంచుల ఫ్లాట్ డిస్ప్లేతో పాటు 165Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

చివరిగా దీని కెమెరా, బ్యాటరీ విషయాలు చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇందులో 'LUMO' ఇమేజింగ్ సిస్టమ్‌తో పాటు 3.5x ఆప్టికల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక 7,500mAh భారీ బ్యాటరీని ఈ చిన్న ఫోన్‌లో ఎలా సెట్ చేశారో అని టెక్ ఎక్స్‌పర్ట్స్ ఆశ్చర్యపోతున్నారు. దీనికి తోడు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే వాటర్ , డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ రేటింగ్స్ కూడా టాప్ క్లాస్‌లో ఇచ్చారు. మొత్తానికి కాంపాక్ట్ సైజులో ఒక పవర్‌ఫుల్ ఫోన్ కావాలనుకునే వారికి వన్ ప్లస్ 15T ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. శామ్‌సంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! త్వరలో గెలాక్సీ A57, A37 5G సందడి.. ధర ఎంతంటే..?
  2. వన్‌ప్లస్ లవర్స్‌కు పండగే.. కాంపాక్ట్ సైజులో 'బీస్ట్' లాంటి పర్ఫార్మెన్స్.. లాంచ్ డేట్ ఫిక్స్!
  3. జియో అదిరిపోయే ఆఫర్.. విదేశాల్లో ఉన్నా ఉచితంగా SMSలు.. రోమింగ్ ప్యాక్ అక్కర్లేదు..!
  4. పవర్‌ఫుల్ ఎంట్రీ.. 9,000mAh భారీ బ్యాటరీతో Poco X8 Pro Max 5G లాంచ్!
  5. వన్‌ప్లస్ యూజర్లకు అలర్ట్: మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మారబోతున్నాయి.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి!
  6. ఐరన్ మ్యాన్ ఈజ్ హియర్! Poco X8 Pro స్పెషల్ ఎడిషన్ రేట్ ఎంతో తెలుసా?
  7. కేవలం రూ. 27,000లకే 9,020mAh బ్యాటరీ ఫోన్? iQOO Z11 లాంచ్ వివరాలు లీక్!
  8. మీ తల ఊపితే చాలు.. సిరి రియాక్ట్ అవుతుంది! యాపిల్ కొత్త హెడ్‌ఫోన్స్‌లో క్రేజీ ఫీచర్లు!
  9. ఇన్‌స్టాగ్రామ్ ప్రైవసీలో పెను మార్పు! మే 8 నుంచి ఎన్‌క్రిప్టెడ్ చాట్స్ నిలిపివేత.. మీ డేటా భద్రం చేసుకోండిలా..!
  10. చాట్‌జీపీటీ స్మార్ట్ టిప్స్.. డిలీట్, ఆర్కైవ్ ఫీచర్లను వాడటం ఎలా..?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »