పవర్‌ఫుల్ ఎంట్రీ.. 9,000mAh భారీ బ్యాటరీతో Poco X8 Pro Max 5G లాంచ్!

పోకో X8 ప్రో మాక్స్ 5G, మార్వెల్ ఫ్యాన్స్ కోసం స్పెషల్‌గా పోకో X8 ప్రో ఐరన్ మ్యాన్ ఎడిషన్‌ను కూడా రిలీజ్ చేశారు.

పవర్‌ఫుల్ ఎంట్రీ.. 9,000mAh భారీ బ్యాటరీతో Poco X8 Pro Max 5G లాంచ్!

Photo Credit: Gadgets 360

మార్కెట్లోకి Poco X8 Pro సిరీస్..!

ముఖ్యాంశాలు
  • 9,000mAh భారీ బ్యాటరీ
  • Poco X8 Pro Max 5G లాంచ్
  • 12GB+256GB వేరియంట్ రూ. 35,999
ప్రకటన

టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పోకో నామస్మరణే వినిపిస్తోంది. మన ఇండియా మార్కెట్‌లోకి పోకో తన లేటెస్ట్ "X8 ప్రో సిరీస్" ఫోన్లను అఫీషియల్ గా లాంచ్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసేసింది. ఈ సిరీస్ లో పోకో X8 ప్రో 5G తో పాటు అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న పోకో X8 ప్రో మాక్స్ 5G, మార్వెల్ ఫ్యాన్స్ కోసం స్పెషల్‌గా పోకో X8 ప్రో ఐరన్ మ్యాన్ ఎడిషన్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ ఫోన్లు చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, పర్ఫార్మెన్స్ విషయంలో కూడా నెక్స్ట్ లెవల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయని కంపెనీ గట్టిగా చెబుతోంది. ముఖ్యంగా ఈ జనరేషన్ యూత్ కోరుకునే ఫాస్ట్ ఛార్జింగ్, అదిరిపోయే డిస్‌ప్లే,  గేమింగ్ కోసం పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ని ఇందులో జోడించారు. ఈ ఫోన్లు మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ వేదికగా అందుబాటులోకి రానున్నాయి.

ధరల విషయానికి వస్తే, పోకో తన మార్క్ చూపిస్తూ కాంపిటీటివ్ ప్రైసింగ్‌తో మార్కెట్‌లోకి దిగింది. పోకో X8 ప్రో 5G బేస్ వేరియంట్ అంటే 8GB+256GB మోడల్ ధర రూ. 32,999గా నిర్ణయించగా, 12GB+256GB వేరియంట్ రూ. 35,999కి లభిస్తుంది. ఇక ఐరన్ మ్యాన్ ఎడిషన్ కొనాలనుకునే ఫ్యాన్స్ రూ. 37,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు, హై-ఎండ్ మోడల్ అయిన పోకో X8 ప్రో మాక్స్ 5G ధర రూ. 42,999 (12GB+256GB) నుంచి మొదలవుతుంది. దీని టాప్ మోడల్ 512GB స్టోరేజ్‌తో రూ. 46,999కి దొరుకుతుంది. హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, ఎస్‌బిఐ కార్డులపై రూ. 3,000 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది, కాబట్టి లాంచ్ టైమ్‌లో తీసుకుంటే ఇంకా తక్కువకే వచ్చే ఛాన్స్ ఉంది.

డిస్‌ప్లే,  సాఫ్ట్‌వేర్ విషయాల్లో పోకో అస్సలు తగ్గలేదు. ఈ రెండు ఫోన్లు కూడా షియోమీ కి చెందిన లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 బేస్డ్ హైపర్ ఓఎస్ 3పై రన్ అవుతాయి. ప్రో మాక్స్ మోడల్‌లో 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు, ఇది 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్,  120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అంటే ఎండలో చూసినా కూడా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక ప్రో మోడల్‌లో 6.59 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఈ రెండు ఫోన్లకు ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే, ఇవి IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ కలిగి ఉన్నాయి. దీనివల్ల ఫోన్ ధూళి పడినా లేదా నీటిలో మునిగినా కూడా ఏమీ కాకుండా చాలా ధృడంగా ఉంటుంది.

పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, పోకో X8 ప్రో మాక్స్ 5G లో అత్యంత శక్తివంతమైన 3nm ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌ను వాడారు. దీనికి తోడు 12GB LPDDR5x అల్ట్రా ర్యామ్ ఉండటం వల్ల గేమింగ్,  మల్టీ టాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగిపోతుంది. వేడి తగ్గించడానికి ఇందులో 'పోకో 3D ఐస్ లూప్' కూలింగ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక సాధారణ ప్రో మోడల్‌లో 4nm డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ ఇచ్చారు. ఈ ఫోన్లలో స్టోరేజ్ కోసం అడ్వాన్స్‌డ్ UFS 4.1 టెక్నాలజీని వాడటం వల్ల యాప్స్ ఓపెనింగ్ స్పీడ్, డేటా ట్రాన్స్‌ఫర్ మెరుపు వేగంతో జరుగుతుంది. ప్రో మాక్స్ మోడల్ లో భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా అందించారు.

కెమెరా లవర్స్ కోసం కూడా ఈ ఫోన్లలో అదిరిపోయే సెటప్ ఉంది. రెండు ఫోన్లలో వెనుకవైపు పిల్‌-షేప్డ్ మాడ్యూల్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా, దీనికి OIS  సపోర్ట్ కూడా ఉంది. అంటే ఫోటోలు తీసేటప్పుడు ఫోన్ కాస్త కదిలినా క్లారిటీ మిస్ అవ్వదు. దీనికి తోడు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఇచ్చారు. ఇక సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ల ద్వారా మీరు 4K/60 fps క్వాలిటీతో అదిరిపోయే వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. వ్లాగర్స్‌కి, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

బ్యాటరీ విషయానికి వస్తే, ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. పోకో X8 ప్రో మాక్స్ 5G లో ఏకంగా 9,000mAh బ్యాటరీని ఇచ్చారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు మూడు రోజుల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఇక ప్రో మోడల్ లో 6,500mAh బ్యాటరీ ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి, దీనివల్ల అంత పెద్ద బ్యాటరీ కూడా చాలా త్వరగా నిండిపోతుంది. అదనంగా 27W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉండటం విశేషం. పవర్‌ఫుల్ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్ మరియు స్టైలిష్ లుక్ కలిపి ఈ పోకో ఫోన్లు మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Nokia 123 Shield Phone: చేతిలోంచి జారినా, నీళ్లలో మునిగినా నో ప్రాబ్లమ్.. టైప్-సి పోర్ట్‌తో నోకియా కొత్త ఫోన్ వచ్చేసింది!
  2. Xiaomi Power Bank: ఒకేసారి 3 డివైజ్లు ఛార్జ్ చేసుకోవచ్చు.. షావోమి నుంచి 67W పవర్ బ్యాంక్ లాంచ్
  3. OPPO Find X10 Series: ఒప్పో నుంచి సరికొత్త లుక్‌తో ఫైండ్ X10 సిరీస్.. కెమెరా డిజైన్ లీక్!
  4. iQOO Neo 11S: ఛార్జర్ ని మరచిపోయినా నో ప్రాబ్లమ్.. 8000mAh బ్యాటరీతో ఐకూ కొత్త ఫోన్ తెచ్చేస్తోంది!
  5. Samsung AI Galaxy Glasses: కళ్లజోడు పెట్టుకుంటే చాలు.. ప్రపంచాన్నంతా చూసేయొచ్చు.. శామ్‌సంగ్ నుంచి కొత్త స్మార్ట్ గ్లాసెస్!
  6. Samsung Galaxy Z Fold 8: 50MP డ్యూయల్ కెమెరా, లైట్ వెయిట్ టైటానియం బాడీ.. శామ్‌సంగ్ నయా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్!
  7. Samsung Galaxy Watch Ultra 2 Launched: చేతికి ఈ వాచ్ ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనే లేదు.. శామ్‌సంగ్ నుంచి అల్ట్రా వాచ్ 2 లాంచ్!
  8. Garmin Cirqa Smart Band launched: స్క్రీన్ లేని గార్మిన్ సిర్కా స్మార్ట్ బ్యాండ్ లాంచ్.. డిస్‌ప్లే లేకపోవడమే దీని ప్రత్యేకం!
  9. Samsung Galaxy Z Fold 8 Ultra: ఫోన్ తెరిస్తే ట్యాబ్.. మడిచితే ఫోన్.. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో శామ్‌సంగ్ విధ్వంసం!
  10. Samsung Galaxy Card Launched: శామ్‌సంగ్ నుంచి తొలి క్రెడిట్ కార్డ్.. శామ్‌సంగ్ గెలాక్సీ కార్డ్ లాంచ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »