Photo Credit: OnePlus
గత ఏడాది మార్చిలో చైనాలో విడుదల చేసిన OnePlus Ace 3Vకి కొనసాగింపుగా OnePlus Ace 5V అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇంకా మోనికర్‌ను అధికారికంగా ధృవీకరించనప్పటికీ ఈ హ్యాండ్‌సెట్ గురించిన పలు ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఒక టిప్‌స్టర్ ద్వారా ఈ తరహాలో ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్‌లు బహిర్గతం అయ్యాయి. ముఖ్యంగా, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో OnePlus Ace 5 Pro, OnePlus Ace 5 ఫోన్‌లు గత నెలలో చైనాలో విడుదల చేసిన అంశంపై చర్చ నడుస్తోంది.
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Weibo పోస్ట్ ప్రకారం OnePlus Ace 5V మోడల్‌లో MediaTek డైమెన్సిటీ 9350 ప్రాసెసర్‌ను అందించవచ్చు. అలాగే, MediaTek ప్రాసెసర్‌ను డైమెన్సిటీ 9300++ అని పిలిచే అవకాశం ఉంది అని టిప్‌స్టర్ అభిప్రాయపడ్డారు. ఇది ఇప్పటికే ఉన్న MediaTek డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌పై అప్‌గ్రేడ్‌లతోపాటు పెరిగిన శక్తి సామర్థ్యంతో వస్తుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, MediaTek డైమెన్సిటీ 9350 లేదా డైమెన్సిటీ 9300++ ప్రాసెసర్ క్వాల్‌కామ్ తాజాగా స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ ప్రాసెసర్‌తో నేరుగా పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.
ఈ లీక్‌ల ఆదారంగా.. OnePlus Ace 5V ఏకరీతి, స్లిమ్ బెజెల్స్‌తో 1.5K ఫ్లాట్ డిస్‌ప్లేతో రానున్నట్లు వెల్లడైంది. అలాగే, ఇది 7000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీతో వస్తుందని అంచనా. ఈ అంచనా నిజమైతే, స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్, ఫుల్-HD+ రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్న OnePlus Ace 3V హ్యాండ్‌సెట్‌కు అందించిన 5500mAh బ్యాటరీపై ఈ మోడల్ పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్ అయినట్లే భావించవచ్చు. అలాగే, OnePlus Ace 5V గురించిన మరిన్ని వివరాలు రాబోయే మరికొన్ని వారాల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నట్లు అభిప్రాయపడుతున్నారు.
OnePlus Ace 3V ఫోన్ Android 14-ఆధారిత ColorOS 14తో వచ్చింది. దీని 12GB + 256GB వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ. 23,000)గా ఉంది. దీని కెమెరా విషయానికి వస్తే.. 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తోపాటు 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను అందించారు. అంతేకాదు, ఇది 100W వైర్డు SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇవ్వడంతోపాటు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.
మరీ ముఖ్యంగా, OnePlus Ace 3Vలో కొన్ని మార్పులతో ఇండియాతోపాటు గ్లోబల్ మార్కెట్లలో OnePlus Nord 4 పేరుతో పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా OnePlus నుంచి చైనాలో రాబోతున్న Ace 5Vను ఇతర గ్లోబల్ మార్కెట్‌లలో OnePlus Nord 5గా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాంటే మాత్రం, కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.
ప్రకటన
ప్రకటన