Oneplus Ace 5

Oneplus Ace 5 - ख़बरें

  • OnePlus Ace 3Vకి కొన‌సాగింపుగా OnePlus Ace 5V రాబోతుందా.. కీల‌క స్పెసిఫికేష‌న్స్‌ లీక్..
    గ‌త ఏడాది మార్చిలో చైనాలో విడుద‌ల చేసిన‌ OnePlus Ace 3Vకి కొన‌సాగింపుగా OnePlus Ace 5V అందుబాటులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. కంపెనీ ఇంకా మోనికర్‌ను అధికారికంగా ధృవీక‌రించ‌న‌ప్ప‌టికీ ఈ హ్యాండ్‌సెట్ గురించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. ఒక టిప్‌స్టర్ ద్వారా ఈ త‌ర‌హాలో ఫోన్‌కు సంబంధించిన‌ కీలక స్పెసిఫికేషన్‌లు బ‌హిర్గ‌తం అయ్యాయి. ముఖ్యంగా, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో OnePlus Ace 5 Pro, OnePlus Ace 5 ఫోన్‌లు గత నెలలో చైనాలో విడుద‌ల చేసిన అంశంపై చ‌ర్చ న‌డుస్తోంది
  • చైనా మార్కెట్‌లోకి OnePlus Ace 5 Pro, OnePlus Ace 5లు వ‌చ్చేశాయి.. ధ‌ర ఎంతంటే
    చైనాలో OnePlus Ace 5 Pro, OnePlus Ace 5 హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అయ్యాయి. ఈ కొత్త OnePlus Ace సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు గరిష్టంగా 16GB RAM, 1TB వరకు స్టోరేజీతో వ‌స్తున్నాయి. ఇవి 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. అలాగే, ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ ప్రాసెస‌ర్‌ ద్వారా శక్తిని గ్ర‌హిస్తుండ‌గా, Ace 5 మోడ‌ల్ మాత్రం స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెస‌ర్‌తో వ‌స్తోంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఈ రెండూ చైనాలో కొనుగోలు చేసేందుకు ఇప్ప‌టికే అందుబాటులోకి వ‌చ్చాయి
  • అధికారిక ప్రకటనకు ముందే OnePlus 13, OnePlus 13R గ్లోబల్ లాంచ్ తేదీ లీక్.. ఎప్పుడంటే
    OnePlus 13 చైనాలో ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో ప్రారంబించిన విష‌యం తెలిసిందే. తాజాగా భార‌త్‌లో స‌హా ఎంపిక చేసిన గ్లోబ‌ల్ మార్కెట్‌ల‌లో ఈ కంపెనీ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌ను తీసుకురానున్న‌ట్లు స్ప‌ష్టమైంది. లీకైన అనౌన్స్‌మెంట్‌ బ్యానర్‌ను ఓ టిప్‌స్టర్ షేర్ చేసారు. ఇది ఫోన్ గ్లోబల్ లాంచ్ తేదీని వెల్ల‌డిస్తోంది. చైనాలో ఇప్ప‌టికే లాంచ్ చేసిన మాదిరిగానే ఈ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ వేరియంట్ కూడా ఉంటుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. OnePlus Ace 5 ఫోన్‌ రీబ్యాడ్జ్ వెర్షన్‌గా చెప్ప‌బ‌డుతున్న‌ OnePlus 13R కూడా ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌తో పాటు రానున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.
  • OnePlus Ace 5 లాంచ్ టైమ్‌లైన్ ఇదే.. 6.78-అంగుళాల డిస్‌ప్లేతోపాటు మ‌రెన్నో ఫీచ‌ర్స్‌..
    గ‌త కొంత‌కాలంగా OnePlus Ace 5, OnePlus Ace 5 Pro హ్యాండ్‌సెట్‌ల గురించిన ప‌లు రూమ‌ర్లు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లుకొడుతున్నాయి. కానీ, ఈ లైన‌ప్‌పై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌కాలేదు. అయితే, తాజాగా vanilla మోడల్ చైనాలో వచ్చే నెల లాంచ్‌ అవుతుందనే వార్త వైర‌ల్‌గా మారింది. OnePlus Ace 5 స్మార్ట్ ఫోన్‌ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేను క‌లిగి ఉంటుంద‌నే లీక్ బ‌హిర్గ‌త‌మైంది. ఇది Snapdragon 8 Gen 3 ప్రాసెస‌ర్‌ చిప్‌సెట్‌లో ర‌న్ అవుతంద‌ని చెబుతున్నారు. అలాగే, చైనా వెలుపలి మార్కెట్‌లోకి OnePlus 13R మోనికర్‌తో OnePlus Ace 5 స్మార్ట్ ఫోన్ వస్తుందని భావిస్తున్నారు.

Oneplus Ace 5 - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »