6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తోన్న OnePlus 13 హ్యాండ్‌సెట్
OnePlus తన OnePlus 13 మోడల్ గత ఏడాది డిసెంబర్లో చైనాలో లాంచ్ చేసిన OnePlus 12కి కొనసాగింపుగా తీసుకువస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు గత కొన్ని వారాలుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆప్పటికే దీని ప్రాసిసర్, డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ కెపాసిటీ వంటి వివరాలతో సహా ఫోన్ యొక్క స్పెషిఫికేసన్స్ గతంలోనే లీక్ చేయబడ్డాయి. తాజాగా లాంచ్ టైమ్‌లైన్, ధర పరిధి, స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో మార్పులు వంటివి బయటకు వచ్చాయి. టిప్‌స్టర్ బ్యాటరీ, ఛార్జింగ్, కెమెరా లాంటి కొన్ని కీలకమైన వివరాలను వెల్లడించింది.