Honor X60 series నుంచి చైనాలో రెండు స‌రికొత్త‌ మోడ‌ల్స్‌ను లాంచ్ చేసిన కంపెనీ..

ఈ మోడల్స్‌లో Honor X60 మీడియాటెక్ డైమెన్సిటీ 7025-అల్ట్రా ప్రాసెస‌ర్‌తో వ‌స్తుండ‌గా.. Honor X60 Pro వేరియంట్ మాత్రం స్నాప్‌డ్రాగన్ ప్రాసెస‌ర్‌తో అందుబాటులోకి వ‌స్తుంది.

Honor X60 series నుంచి చైనాలో రెండు స‌రికొత్త‌ మోడ‌ల్స్‌ను లాంచ్ చేసిన కంపెనీ..

Photo Credit: Honor

Honor X60 Pro comes with a pill-shaped front camera unit

ముఖ్యాంశాలు
  • ఇప్పుడు Honor X60 సిరీస్ చైనాలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది
  • Honor X60 Pro వేరియంట్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెస‌ర్‌తో వ‌స్తోంది
  • Honor X60 బేస్ మోడ‌ల్‌ 8GB + 128GB కాన్ఫిగరేషన్ ధర CNY 1,199 (దాదాపు రూ.
ప్రకటన

గ‌త ఏడాది జూలైలో లాంచ్ అయిన Honor X50 కొన‌సాగింపుగా Honor X60 series చైనాలో విడుద‌లైంది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఈ లైనప్‌లో Honor X60, X60 Pro పేరుతో రెండు మోడల్‌లను ప‌రిచ‌యం చేసింది. రెండు మోడల్స్ కూడా 108-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాల లాంటి ఫీచ‌ర్స్‌తో అందుబాటులోకి వ‌స్తున్నాయి. మరోవైపు, ఈ మోడల్స్‌లో ఒక‌టి మీడియాటెక్ డైమెన్సిటీ 7025-అల్ట్రా ప్రాసెస‌ర్‌తో వ‌స్తుండ‌గా.. Honor X60 Pro వేరియంట్ మాత్రం స్నాప్‌డ్రాగన్ ప్రాసెస‌ర్‌తో అందుబాటులోకి వ‌స్తుంది.

Honor X60 ధ‌ర‌లు వ‌రుస‌గా..

Honor X60 బేస్ మోడ‌ల్‌ 8GB + 128GB కాన్ఫిగరేషన్ ధర CNY 1,199 (దాదాపు రూ. 14,000) నుండి ప్రారంభమవుతుంది. ఇది ఎలిగెంట్ బ్లాక్, మూన్‌లైట్, సీ లేక్ క్విన్ అనే మూడు రంగులలో లభిస్తుంది. అలాగే, Honor X60 Pro మోడ‌ల్‌ 8GB + 128GB వేరియంట్ ధ‌ర‌ CNY 1,499 (దాదాపు రూ. 18,000) నుండి ప్రారంభమవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ Honor X60 మాదిరి స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. ఇది బూడిద, నలుపు, నారింజ, సీ గ్రీన్ ఇలా నాలుగు రంగులలో అందుబాటులో ఉంది.

సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌..

ఇక Honor X60 120Hz రిఫ్రెష్ రేట్, 2412×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల TFT LCD స్క్రీన్‌తో రూపొందించ‌బ‌డింది. హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 7025-అల్ట్రా ప్రాసెస‌ర్‌తో వ‌స్తుంది. అలాగే, 2.5GHz వద్ద పనిచేసేలా రెండు కార్టెక్స్-A78 కోర్లు, 2.0GHz క్లాక్ స్పీడ్‌తో రెండు కార్టెక్స్-A55 కోర్లతో కూడిన ఆక్టా-కోర్ CPU అమ‌ర్చ‌బ‌డింది. ప్రాసెస‌ర్‌ గరిష్టంగా 12GB RAM, 512GB వరకు ఇన్‌బిల్ట్ సోరేజ్‌తో అటాచ్ చేయ‌బ‌డింది. ఇది 35W ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్‌తో 5,800mAh బ్యాటరీతో రూపొందించ‌బ‌డింది. ఈ మోడల్‌కు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.

టూ-వే శాటిలైట్ కమ్యూనికేషన్..

Honor X60 Pro మోడ‌ల్ 2700×1224 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది 2.2GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌తో Qualcomm స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12GB RAM, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది. Wi-Fi లేదా సెల్యులార్ నెట్‌వర్క్ కవరేజ్ లేని పరిస్థితుల్లో టూ-వే శాటిలైట్ కమ్యూనికేషన్ సామర్థ్యాలను క‌లిగి ఉంటుంది. వేగవంతమైన 66W ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి, 6,000mAh బ్యాటరీ సామ‌ర్థ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్ అందించ‌బడుతోంది.

08-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా..

Honor X60 సిరీస్‌లోని రెండు మోడళ్లలోనూ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అలాగే, భాగంలో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాలను అందించారు. రెండు హ్యాండ్‌సెట్‌లు డ్యూయల్-సిమ్‌తోపాటు 5G నెట్‌వ‌ర్క్‌ Wi-Fi 5కి స‌పోర్ట్ చేస్తాయి. అలాగే, ఇందులో ఒక‌టి బ్లూటూత్ 5.1కి స‌పోర్ట్ చేస్తుండ‌గా, Honor X60 Pro బ్లూటూత్ 5.3కి స‌పోర్ట్ చేస్తుంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఇకపోతే, Two-Step Verification కూడా ఈ మోడ్‌లో ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అవుతుంది.
  2. ఈ ఫోన్‌ ముఖ్య ఆకర్షణగా నిలిచింది దాని 7,000mAh భారీ బ్యాటరీ.
  3. దీనికి అదనంగా ఫ్రీ హోం రీప్లేస్మెంట్ సర్వీస్ కూడా అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.
  4. కళ్లు చెదిరే ధర, స్పెసిఫికేషన్లతో మోటరోలా ఎడ్జ్ 70.. ఈ మోడల్ ప్రత్యేకతలివే
  5. 16జీబీ ర్యామ్‌తో వన్ ప్లస్ ఏస్ 6.. ఇంకా ఇతర ఫీచర్స్ ఇవే
  6. మార్కెట్లోకి రానున్న సామ్ సంగ్ గెలాక్సీ ఏ57.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే
  7. ప్రాసెసర్గా MediaTek Dimensity 6300 చిప్సెట్ను ఈ ఫోన్లో ఉపయోగించారు.
  8. కెమెరా విభాగంలో ఈ సిరీస్ భారీ అప్గ్రేడ్తో రానుందని సమాచారం
  9. అదిరే ఫీచర్స్‌తో పోకో ఎఫ్8 అల్ట్రా, ఎఫ్8 ప్రో.. ఈ విశేషాలు మీకు తెలుసా?
  10. Realme C85 Pro 4G వెర్షన్ కూడా అదే 6.8 అంగుళాల స్క్రీన్తో వస్తుంది.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »