Photo Credit: iQOO
iQOO Z10X (చిత్రంలో) అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
మన దేశంలో బేస్ iQOO Z10 వేరియంట్‌తో పాటు iQOO Z10X లాంఛ్ కానుంది. iQOO Z9X 5G కొనసాగింపుగా వస్తోన్న దీని డిజైన్, ప్రాసెసర్, బ్యాటరీ సామర్థ్యం వంటి కొన్ని ముఖ్యమైన ఫీచర్స్‌ను కంపెనీ వెల్లడించింది. టీజర్‌లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో నీలిరంగు రంగులో హ్యాండ్‌సెట్‌ను చూడొచ్చు. గతంలో, iQOO Z10X బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది. ఇది త్వరలోనే ఇండియాలో లాంఛ్ అవుతుందని సూచిస్తోంది. అలాగే, బేస్ iQOO Z10 మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్, 7,300mAh బ్యాటరీతో రానుంది. ఈ మోడల్స్‌కు సంబంధించి అమెజాన్ లైవ్ మైక్రోసైట్ వెల్లడించిన కీలక విషయాలను చూద్దాం!ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా,ఏప్రిల్ 11న భారత్‌లో iQOO Z10X మోడల్ బేస్ iQOO Z10తో పాటు లాంఛ్ కానున్నట్లు అమెజాన్ లైవ్ మైక్రోసైట్ స్పష్టం చేసింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా దేశంలో ఫోన్ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనున్నట్లు ఈ మైక్రోసైట్ ధృవీకరించింది. మైక్రోసైట్ iQOO Z10Xని నీలిరంగు రంగులో చూపిస్తోంది. అలాగే, ప్యానెల్ ఎగువ ఎడమ వైపున ఉన్న దీర్ఘచతురస్రాకార వెనుక కెమెరా మాడ్యూల్ రెండు కెమెరా సెన్సార్‌లు, రింగ్ లైట్, LED ఫ్లాష్ యూనిట్‌ను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ దిగువ అంచున స్పీకర్ గ్రిల్, USB టైప్-C పోర్ట్, సిమ్ స్లాట్, మైక్ వంటివి ఉన్నాయి. అలాగే, మైక్రోసైట్ iQOO Z10X మోడల్ 4nm MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుందని ధృవీకరిస్తోంది. దీనికి AnTuTu స్కోరు 7,28,000 కంటే ఎక్కువ ఉందని చెబుతున్నారు. ఇది ఈ విభాగంలో అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌ను ఉన్నట్లు కూడా ప్రచారంలో ఉంది.
మైక్రోసైట్‌లోని ఫుట్‌నోట్ ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్ ధర మన దేశంలో రూ. 15,000 కంటే తక్కువగా ఉండొచ్చని సూచిస్తోంది. అలాగే, ఫోన్ 8GB + 256GB RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీనిని లాంఛ్ చేసినప్పుడు మరిన్ని వేరియంట్‌లలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. iQOO Z10X మోడల్ 6,500mAh బ్యాటరీతో వస్తున్నట్లు స్పష్టమైంది. అయితే, రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించి మరెలాంటి వివరాలు వెల్లడి కాలేదు. లాంఛ్‌కు ముందు రోజుల్లో దీని గురించిన మరిన్ని విషయాలు బహిర్గతం కావొచ్చు.
అలాగే, iQOO Z10 హ్యాండ్‌సెట్ ధర మన దేశంలో రూ. 22,000 కంటే తక్కువగా ఉంటుందని టీజ్ చేయబడింది. ఇది స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్, 90W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌తో 7,300mAh బ్యాటరీ, 5,000nits పీక్ బ్రైట్‌నెస్ లెవల్‌తో క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో రానుంది. అంతే కాదు, ఇది గ్లేసియర్ సిల్వర్, స్టెల్లార్ బ్లాక్ షేడ్స్‌లో లభించనుంది. ఇది 7.89mm సన్నని ప్రొఫైల్‌తో అందుబాటులోకి వస్తుంది.
ప్రకటన
ప్రకటన