Photo Credit: Oppo
Oppo A5 Pro 5G కి IP69 దుమ్ము మరియు నీటి నిరోధక రేటింగ్ ఉంటుంది
భారత్‌లో ఏప్రిల్ 24న Oppo A5 Pro 5G ఫోన్ లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అయితే, విడుదలకు ముందే దీని అంచనా ధర ఆన్‌లైన్‌లో బహిర్గతమైంది. ఈ రాబోయే హ్యాండ్‌సెట్‌కు చెందిన కీలకమైన స్పెసిఫికేషన్‌లు కూడా కంపెనీ వెల్లడించింది. ఎంపిక చేసిన మార్కెట్‌లలో ఈ ఏడాది మొదట్లో వచ్చిన Oppo A5 Pro 5G గ్లోబల్ వెర్షన్ మాదిరిగానే మన దేశంలోని వేరియంట్ కనిపిస్తోంది. అయితే, ఈ వేరియంట్ డిజైన్, స్పెసిఫికేషన్స్‌లు గత సంవత్సరం డిసెంబర్‌లో లాంఛ్ అయిన చైనీస్ కౌంటర్‌పార్ట్‌కు భిన్నంగా ఉంటాయి.మన దేశంలో ధరలు ఇలా,తాజాగా, మన దేశంలో రాబోయే Oppo A5 Pro 5G స్మార్ట్ ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 17999 నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు 91Mobiles నివేదికను పరిశీలిస్తే తెలుస్తోంది. 8GB + 256GB వేరియంట్ ఇదే మోడల్ అయితే రూ. 19999 ధర ఉంటుందని వెల్లడైంది. Oppo A5 Pro 5G ఫోన్ ఇండియన్ వెర్షన్ డస్ట్ వాటర్- రెసిస్టెంట్ రేటింగ్ IP69 గా ఉంది. అలాగే, డ్యామేజ్-ప్రూవ్, డ్రాప్-రెసిస్టెంట్ 360-డిగ్రీ ఆర్మర్ బాడీని కలిగి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఫోన్‌కు 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5800mAh బ్యాటరీని అందించారు.
ఇందులో హ్యాండ్‌సెట్ గ్లోబల్ వెర్షన్ Oppo A5 Pro 5G హ్యాండ్‌సెట్ మీడియాటెక్ Dimensity 6300 ప్రాసెసర్‌తో మార్కెట్‌కు పరిచయం అయ్యింది. అలాగే, 12GB వరకూ LPDDR4X RAM, 256GB వరకూ యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజీతో జత చేయబడి ఉంటుంది. అంతే కాదు, ఇది ఆండ్రాయిడ్ 15 బేస్డ్‌గా ColorOS 15.0 తో పని చేస్తోంది.
ఈ హ్యాండ్‌సెట్ కెమెరా విషయానికి వస్తే.. గ్లోబల్ వేరియంట్ మోడల్ Oppo A5 Pro 5G ఫోన్ 50- మెగాపిక్సెల్ ప్రైమరీ వెనుక సెన్సార్, OISతో కూడిన 2- మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ప్రత్యేకంగా 8- మెగాపిక్సెల్ సెన్సార్‌ను అమర్చారు. ఇది 6.67- అంగుళాల HD+ (720x1, 604 పిక్సెల్స్) LCD స్క్రీన్‌ను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్‌తో 120 Hz రఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవల్ ఉంటుంది.
అయితే, ప్రస్తుతం వస్తోన్న స్మార్ట్ ఫోన్ చైనాలోని Oppo A5 Pro 5G కంటే భిన్నంగా ఉంటుందని స్పష్టమైపోతుంది. చైనా మోడల్‌కు ముందు భాగంలో 16- మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. అలాగే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తోపాటు 6.7- అంగుళాల 120 Hz ఫుల్- HD+ AMOLED డిస్‌ప్లేతో రూపొందించారు. దీనికి 80W వరకూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందించారు.
ప్రకటన
ప్రకటన