Photo Credit: Tecno
దేశీయ మార్కెట్‌లోకి Tecno Pop 9 5G స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఈ సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను అందించారు. ఇది NFC సపోర్ట్‌తో రూపొందించబడింది. ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ప్రస్తుతం ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. అలాగే, అక్టోబర్ ప్రారంభంలో కొనుగోలు చేసుకునేందుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో మన దేశంలో లాంచ్ అయిన ఆవిష్కరించబడిన Tecno Pop8కి ఈ హ్యాండ్‌సెట్ కొనసాగింపుగా వస్తోంది. మరెందుకు ఆలస్యం.. అందరికీ అందుబాటు ధరలో వస్తోన్న ఈ Tecno Pop 9 5G బడ్జెట్ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్స్‌తోపాటు పూర్తి వివరాలు చూసేద్దామా!
భారతదేశంలో Tecno Pop 9 5G 4GB + 64GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 9,499కాగా, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ ద్వారా ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. అక్టోబర్ 7న మొదటిసారి సేల్‌కు వస్తుంది. కొనుగోలుదారులు రూ. 499ల టోకెన్ అమౌంట్‌తో హ్యాండ్‌సెట్‌ను ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది. చేసుకోవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నిబంధనల ప్రకారం.. కొనుగోలు సమయంలో అమెజాన్ పే బ్యాలెన్స్‌గా తిరిగి క్రెడిట్ చేయబడుతుంది. ఈ Tecno Pop 9 5G అరోరా క్లౌడ్, అజూర్ స్కై, మిడ్‌నైట్ షాడో మూడు రంగులలో అందించబడుతుందని కంపెనీ తెలిపింది.
Tecno Pop 9 5G స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-సిమ్ (నానో+నానో), 120Hz రిఫ్రెష్ రేట్‌తో LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు 4GB RAM, 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో అందించబడుతుంది. ఇక దీని కెమెరా విషయానికి వస్తే.. Tecno Pop 9 5G 48-మెగాపిక్సెల్ Sony IMX582 వెనుక కెమెరా సెన్సార్‌తో పాటు LED ఫ్లాష్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఇది 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. దీంతో పిక్చర్ క్వాలిటీ ఎంతో మెరుగుపడుతుంది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్‌లో డాల్బీ అట్మోస్‌తో కూడిన డ్యూయల్ స్పీకర్‌లను కూడా అందిస్తున్నారు.
ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ 18W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో Tecno Pop 9 5G 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో రూపొందించారు. ఈ ఫోన్ ఇన్‌ఫ్రారెడ్ (IR) ట్రాన్స్‌మిటర్‌తోపాటు దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. NFC సపోర్ట్‌తో సెగ్మెంట్‌లో ఇది మొదటి 5G ఫోన్‌గా పేర్కొన్నారు. ఈ హ్యాండ్‌సెట్ పరిమాణం 165 x 77 x 8 mm కాగా, 189 గ్రాముల బరువు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఇతర కంపెనీల బడ్జెట్ ఫోన్‌లకు మంచి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన