Photo Credit: Apple
ఐఫోన్ 16 సిరీస్‌లోని ఇతర మోడల్‌ల మాదిరిగానే ఐఫోన్ 16 యాక్షన్ బటన్‌ను కలిగి ఉంది
Cupertino కంపెనీ నుండి తాజా ఎంట్రీ-లెవల్ మోడల్‌గా iPhone 16e లాంచ్ అయ్యింది. ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలోని ఈ సరికొత్త మోడల్ 6.1-అంగుళాల OLED స్క్రీన్, A18 చిప్‌ను కలిగి ఉంది. కొత్త ఐఫోన్ 16e 2023లో విడుదలైన ఐఫోన్ 15 ప్రో మాదిరిగానే ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. iPhone 16e ఒకే 48-మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో రూపొందించబడింది. ప్రోగ్రామబుల్ యాక్షన్ బటన్‌ను అందించారు.
మనదేశంలో iPhone 16e మోడల్ 128GB స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ. 59,900 నుండి ప్రారంభమవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 256GB, 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. వీటి ధర వరుసగా రూ. 69,900, రూ. 89,900గా ఉంది. iPhone 16e ఫిబ్రవరి 21 నుండి ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంటుందని, ఫిబ్రవరి 28 నుండి అమ్మకానికి వస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇది నలుపు, తెలుపు రంగులలో లభిస్తుంది.
తాజాగా అందుబాటులోకి రానున్న iPhone 16e ఫోన్ iOS 18 పై పనిచేసే డ్యూయల్ సిమ్ (నానో+eSIM) హ్యాండ్‌సెట్. మెరుగైన మన్నిక కోసం డిస్‌ప్లే ఆపిల్ సిరామిక్ షీల్డ్ మెటీరియల్‌ను ఉపయోగించారు. హ్యాండ్‌సెట్‌లో 3nm A18 చిప్‌ను అందించారు. ఇది మొదటగా సెప్టెంబర్ 2024న ఐఫోన్ 16లో వచ్చింది. అలాగే, 512GB వరకు స్టోరేజ్‌తో అటాచ్ చేయబడింది. నిజానికి, కంపెనీ దాని స్మార్ట్ ఫోన్‌లలో RAM కెపాసిటీని వెల్లడించదు. కానీ, ఇది Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి, 8GB RAMని కలిగి ఉందని అంచనా వేయవచ్చు.
iPhone 16eలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన సింగిల్ 48-మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంది. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం హ్యాండ్‌సెట్ ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరాను అందించారు. మూడవ తరం ఐఫోన్ SEలో టచ్ IDతో హోమ్ బటన్‌కు బదులుగా ఫేస్ IDకి అవసరమైన సెన్సార్‌లను కూడా ఇది కలిగి ఉంది.
కొత్త iPhone 16eలో స్టీరియో స్పీకర్‌లను అందించారు. ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, GPS కనెక్టివిటీని అందిస్తుంది. ఇది ఎంపిక చేసిన ప్రాంతాలలో శాటిలైట్ ఫీచర్ ద్వారా ఆపిల్ అత్యవసర SOSకి సపోర్ట్ కలిగి ఉంది. గతంలో వచ్చిన మోడల్స్ మాదిరి కాకుండా, USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉండి, 18W వైర్డ్ ఛార్జింగ్, 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ల బ్యాటరీ స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు. కానీ ఈ వివరాలు మరికొన్ని రోజుల్లోనే వెలువడే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, నీటి నియంత్రణ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. అలాగే, 146.7mmx71.5mmx7.8mm పరిమాణంతో 167 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన