IMC ఈవెంట్‌లో కంపెనీ Redmi A4 5G ఫోన్‌ను రూ.10 వేలు కంటే తక్కువ ధర వద్ద విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే
Photo Credit: Redmi
Redmi A4 5G (pictured) was unveiled at the India Mobile Congress (IMC) 2024
మన దేశంలో ఈ అక్టోబర్ 16న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2024లో Redmi A4 5G స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇది స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్‌తో కూడిన మొదటి ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా పరిచయం చేయబడింది. ఈ హ్యాండ్‌సెట్ డిజైన్, ప్రాసెసర్ వివరాలను పక్కన పెడితే, కంపెనీ ఇంకెలాంటి విషయాలను వెల్లడించలేదు. ఫోన్ ధరకూ రూ.10 వేల లోపు ఉంటుందని తెలిపింది. తాజా నివేదిక ఆధారంగా.. మన దేశంలో రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరతోపాటు దాని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. మరెందుకు ఆలస్యం.. ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను చూసేద్దామా?!
తాజా Smartprix నివేదిక ప్రకారం.. మన భారత్‌లో Redmi A4 5G హ్యాండ్‌సెట్ 4GB + 128GB వేరియంట్ ధర రూ8,499గా ఉంది. ఈ ధర బ్యాంక్, లాంచ్ ఆఫర్‌లతో పాటు ఇతర డిస్కౌంట్‌లతో ఉంటుంది. అంటే, దీని అర్థం మొబైల్ అసలు ధర దీనికంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అలాగే, IMC ఈవెంట్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను రూ.10 వేలు కంటే తక్కువ ధర వద్ద విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతోనే మార్కెట్‌లో Redmi A4 5G హ్యాండసెట్ ఫీచర్స్‌తోపాటు ధరపై పలు అంచనాలు వ్యక్తమవుతూ వచ్చాయి.
ఈ సరికొత్త Redmi A4 5G స్మార్ట్ ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్‌తో వస్తున్నట్లు స్పష్టమైంది. అలాగే, పైన వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీనిని 18W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 5,000mAh బ్యాటరీతో రూపొందించారని భావిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో కంపెనీ ఇస్తోన్న ఫీచర్స్ కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి.
ఇక కెమెరా విషయానికి వస్తే.. Redmi A4 5G 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్‌తో f/1.8 ఎపర్చరు, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. ఇది హైపర్‌ఓఎస్ 1.0 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుందని భావిస్తున్నారు. భద్రత కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ USB టైప్-సి పోర్ట్‌తో రావచ్చు.
ప్రధానంగా, Redmi A3 4G భారతదేశంలో బేస్ 3GB + 64GB వేరియంట్ ధర 7,299గా ఉంది. అలాగే, ఇది MediaTek Helio G36 ప్రాసెసర్, 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో రూపొందించారు. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.71-అంగుళాల HD+ స్క్రీన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 8-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా,5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
ప్రకటన
ప్రకటన
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket