Photo Credit: Vivo
ప్రపంచవ్యాప్తంగా Vivo Y19sను కంపెనీ అక్టోబర్‌లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే, ఆవిష్కరన సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ధరకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పుడు తాజాగా ఈ Vivo స్మార్ట్‌ఫోన్ RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో పాటు ధరను కూడా వెల్లడించింది. ఈ బ్రాండ్ లోకల్ వెబ్‌సైట్‌లలోని ఒక సైట్‌లో ఫోన్ వివరాలు బహిర్గతం అయ్యాయి. ఇది 6.68-అంగుళాల 90Hz HD+ LCD స్క్రీన్, Unisoc T612 ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతోపాటు 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే, బడ్జెట్ స్మార్ట్ ఫోన్ భారత్ లాంచ్ టైంను ఇంకా ధృవీకరించలేదు.
థాయిలాండ్‌లో ప్రస్తుతం ఆ దేశపు ఈ-స్టోర్ ద్వారా కొనుగోలుకు Vivo Y19s స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 4GB + 64GB వేరియంట్ THB 3,999 (దాదాపు రూ. 9,800) నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 4GB + 128GB, 6GB + 128GB వేరియంట్‌ల ధరలు వరుసగా THB 4,399 (దాదాపు రూ. 10,800), THB 4,999 (దాదాపు రూ. 12,300)గా నిర్ణయించారు. గ్లేసియర్ బ్లూ, గ్లోసీ బ్లాక్, పెరల్ సిల్వర్ మూడు రంగులలో Vivo Y19s కొనుగోలుకు అందుబాటులో ఉంది.
Vivo Y19s స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇది 6.68-అంగుళాల HD+ (720 x 1,608 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్, 264ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తోంది. దీనికి 6GB వరకు LPDDR4X RAM, 128GB వరకు eMMC 5.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడిన 12nm ఆక్టా-కోర్ Unisoc T612 ప్రాసెసర్ సపోర్ట్ ఉంది. అలాగే, ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ OS 14తో ఈ ఫోన్ షిప్పింగ్ చేయబడింది.
ఇక కెమెరా విభాగంలో Vivo Y19s 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో f/1.8 ఎపర్చరు, 0.08-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో f/3.0 ఎపర్చరుతో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందించారు. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 5-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగిన ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Vivo Y19s 15W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ ఫోన్ 5-స్టార్ SGS డ్రాప్ రెసిస్టెన్స్, MIL-STD 810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్‌లతో పాటు డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP64-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, USB టైప్-C పోర్ట్‌ను అందించారు. హ్యాండ్‌సెట్ 165.75 x 76.10 x 8.10mm పరిమాణంతో 198గ్రాముల బరువుతో వస్తుంది. మరి మన దేశంలో ఎప్పుడు లభిస్తుందనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
ప్రకటన
ప్రకటన