Photo Credit: 91Mobiles
ఈ నవంబర్ 19న ROG Phone 9 సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో లాంచ్ కానున్నట్లు Asus ఇటీవల ప్రకటించింది. ఇటీవల జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ సందర్భంగా ఈ తైవానీస్ సంస్థ ROG Phone 9ని ప్రదర్శించింది. ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్‌లను కంపెనీ వెల్లడించనున్నట్లు తెలిపింది. దీని ముందున్న మోడల్ మాదిరిగానే ROG Phone 9 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. ఇది 5,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
Asus ROG Phone 9 ఫీచర్స్, స్పెసిఫికేషన్‌లను నవంబర్ 19న విడుదల చేయడానికి ముందే 91మొబైల్స్ ద్వారా బయటకు వచ్చాయి. తాజాగా షేర్ చేసిన ఇమేజ్‌లలో ఈ హ్యాండ్‌సెట్ నలుపు, తెలుపు రంగులలో కనిపిస్తున్నాయి. దీనిని ఫాంటమ్ బ్లాక్, స్ట్రోమ్ వైట్‌గా పిలుస్తారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లేపై హోల్-పంచ్ కటౌట్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. వెనుకవైపున కెమెరా ఫ్లాష్ క్రింద రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ టెక్స్ట్‌తో ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో కనిపిస్తుంది.
గతంలో విడుదలైన మోడల్ మాదిరిగానే Asus ROG Phone 9 కూడా 6.78-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) Samsung ఫ్లెక్సిబుల్ LTPO AMOLED స్క్రీన్‌తో గరిష్టంగా 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్ ఉంటుంది. ప్యానెల్ 2,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR10 సపోర్ట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్‌ను అందించగలుగుతుంది. ఇది 16GB LPDDR5X RAM, 512GB UFS 4.0 స్టోరేజ్ సామర్థ్యంతో రూపొందించినట్లు భావిస్తున్నారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ హుడ్ కింద ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారించబడింది.
Asus ROG Phone 9 ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ Sony Lytia 700 ప్రధాన కెమెరా 1/1.56-అంగుళాల సెన్సార్, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 5-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. Asus ROG ఫోన్ 8 కూడా ఇదే విధమైన కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 15-ఆధారిత ROG UI, గేమ్ జెనీతో రన్ అవుతుంది. ఇందులో AirTriggers, Macro, బైపాస్ ఛార్జింగ్, స్కౌట్ మోడ్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.
ఇది AI కాల్ ట్రాన్స్‌లేటర్, AI ట్రాన్‌స్క్రిప్ట్, AI వాల్‌పేపర్‌తోపాటు X Sense X క్యాప్చర్ AI గ్రాబెర్ వంటి అనేక AI గేమింగ్ ఫీచర్‌లను ఆఫర్ చేస్తుంది. 65W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 3.5mm జాక్, Asus నాయిస్ కంట్రోల్ సాంకేతికతతో మూడు మైక్రోఫోన్‌లను అందించనున్నట్లు భావిస్తున్నారు. కనెక్టివిటీకోసం బ్లూటూత్ 5.3, Wi-Fi 7, NFC, NavIC, GPS, 5Gని కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 163.8x76.8x8.9mm పరిమాణంతో 227 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన