Photo Credit: Honor
తాజాగా మలేషియాలో Honor X9c Smart ఫోన్‌ను ఆవిష్కరించారు. ఈ ఫోన్ 8GB RAMతో అటాచ్ చేసిన MediaTek DImensity 7025 Ultra ప్రాసెసర్‌తో శక్తిని గ్రహిస్తుంది. అలాగే, 108-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీని అందించారు. ఈ హ్యాండ్‌సెట్ అల్ట్రా-బౌన్స్ యాంటీ-డ్రాప్ టెక్నాలజీ, స్క్రాచ్ రెసిస్టెన్స్‌తో వస్తోంది. ఇది మ్యాజిక్ క్యాప్సూల్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. నోటిఫికేషన్ బార్ iPhoneలోని Apple డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను పోలి ఉంటుంది. అలాగే, Honor X9cను నవంబర్‌లో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో పరిచయం చేసిన విషయం తెలిసిందే.
ఈ Honor X9c Smart ఫోన్ 6.8-అంగుళాల ఫుల్-HD+ (2,412 x 1,080 పిక్సెల్‌లు) డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే, 120Hz రిఫ్రెష్ రేట్, 850nits పీక్ బ్రైట్‌నెస్, డైనమిక్, DC ఫ్లికర్-ఫ్రీ డిమ్మింగ్‌ను కలిగి ఉంటుంది. మీడియాడెక్ Dimensity 7025 ఆల్ట్రా ప్రాసెసర్‌తోపాటు 8GB RAM, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత MagicOS 8.0 స్కిన్‌తో ఈ స్మార్ట్ ఫోన్ రన్ అవుతోంది. ఇప్పటికే దీని డిజైన్‌పై మార్కెట్ వర్గాలలో మంచి ఆసక్తి కనబరిచిన విషయంలో గతంలోనే వెల్లడైంది. తాజా ప్రకటనతో దీనిపై మరిన్ని అంచనాలు పెరినట్లు భావిస్తున్నారు.
Honor X9c Smart ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. f/1.75 ఎపర్చరు, 3x లాస్‌లెస్ జూమ్‌తో 108-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా సెన్సార్‌ను అందించారు. అలాగే, ఈ ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కూడా ఉంటుంది. ఇది AI-బ్యాక్డ్ ఇమేజింగ్, ఎడిటింగ్ టూల్స్‌తో వస్తుంది. Honor X9c Smart 35W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ ఎంపికలను చూస్తే.. డ్యూయల్ 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, OTG, NFC, GPS, USB టైప్-C పోర్టులు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ స్క్రాచ్-రెసిస్టెంట్ బిల్డ్‌తో వస్తుందని స్పష్టమైంది. ఇది ఈ మోడల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, 165.98 x 75.8 x 7.88mm పరిమాణంలో 193 గ్రాముల బరువు ఉంటుంది. ముఖ్యంగా, గతంలో విడుదల అయిన Honor X9c దుమ్ముతోపాటు 360-డిగ్రీల నీటి నియంత్రణ కోసం IP65M-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. కానీ, Honor X9c Smart ఫోన్‌ను వాటర్ రెసిస్టెంట్‌గా అధికారికంగా ధృవీకరించలేదు.
ఈ Smart ఫోన్ ధరకు సంబంధించిన వివరాలను ఇంకా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. Honor మలేషియా వెబ్‌సైట్‌లో మాత్రం 8GB + 256GB కాన్ఫిగరేషన్‌లో లిస్ట్‌వుట్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మూన్‌లైట్ వైట్, ఓషన్ సియాన్ కలర్‌వేస్‌లో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సిందే.
ప్రకటన
ప్రకటన