Photo Credit: Honor
హానర్ పవర్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది
చైనాలో Honor Power ను కంపెనీ లాంఛ్ చేసింది. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ 66W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 8,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. అలాగే, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ అమర్చిన 12GB RAM తోపాటు గరిష్టంగా 512GB స్టోరేజీని అందించారు. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. నెట్‌వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో మంచి కమ్యూనికేషన్‌ను అందించేందుకు ఈ Honor Power కంపెనీ సెల్ఫ్-డెవలప్‌మెంట్ C1+ కమ్యూనికేషన్ చిప్‌తో వస్తోంది. ఫోన్ టాప్ మెమరీ వేరియంట్ బీడౌ టూ-వే శాటిలైట్ టెక్ట్స్ మెసేజింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.కలర్ ఆప్షన్‌లు,Honor Power ఫోన్ ధర చైనాలో 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర CNY 1,999 (సుమారు రూ. 23,000)గా ఉంది. ఇది డెజర్ట్ గోల్డ్, ఫాంటమ్ నైట్ బ్లాక్, స్నో వైట్ కలర్ ఆప్షన్‌లలో ప్రస్తుతం చైనాలో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. డ్యూయల్-సిమ్ (నానో)తో ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ OS 9.0 పై రన్ అవుతోంది. అలాగే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్‌తో 6.78-అంగుళాల 1.5K (1,224x2,700 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను అందించారు. ఒయాసిస్ ఐ ప్రొటక్షన్ గేమింగ్ స్క్రీన్ 3840Hz PWM డిమ్మింగ్, 4,000nits వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్‌లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16-మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ ఆప్షన్‌లలో బ్లూటూత్ 5.3, GPS, బీడౌ, గ్లోనాస్, గెలీలియో, NFC, OTG, Wi-Fi, USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు.
Honor Power ఫోన్ 360-డిగ్రీల వాటర్ ప్రూఫ్ బిల్డ్ కలిగి ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ఫోన్‌ను నీటిలో ముంచినా, నీటిలో నానబెట్టినా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇది వర్షంలో కూడా టచ్ ఇన్‌పుట్‌కు ప్రతిస్పందించేలా AI రెయిన్ టచ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. మొబైల్ నెట్‌వర్క్ సరిగాలేని వాతావరణ పరిస్థితులు, ప్రదేశాలలో మెరుగైన కమ్యూనికేషన్‌న్ అందించేలా హానర్ సెల్ఫ్-డెవలపడ్ C1+ కమ్యూనికేషన్ చిప్‌ను అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 8,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇందులోని బ్యాటరీ ఆరేళ్ల మన్నికతో ఒక్క ఛార్జ్‌తో 25 గంటల వరకు వీడియో చూసేందుకు అవకాశం ఉటుందని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, కేవలం రెండు శాతం బ్యాటరీతో 16.5 గంటల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుందని చెబుతోంది. ఈ ఫోన్ 163x76.7x7.98mm పరిమాణంతో దాదాపు 209 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన