Oppo Reno 15c రెండు RAM-స్టోరేజ్ వేరియంట్లలో, Snapdragon 7 Gen 4 చిప్‌తో వచ్చే అవకాశం ఉంది
Photo Credit: Oppo
Reno 15C స్పెక్స్ లీక్, డిసెంబర్లో రెనో 15 ఈవెంట్‌లో లాంచ్ అవుతుంది
చైనా బ్రాండెడ్ కంపెనీ ఒప్పో నుంచి డిసెంబర్లో కొత్త మోడల్ మార్కెట్లోకి రాబోతోంది. ఒప్పో నుంచి రెనో 15C అనే న్యూ మోడల్ లాంఛ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు మొదట్లో దాని రెనో 15 లైనప్ను ఆవిష్కరిస్తూ హ్యాండ్సెట్ లాంఛ్ను తెలియజేసింది. ఆ సమయంలో కంపెనీ స్మార్ట్ఫోన్ డిజైన్ను మాత్రమే చూపించింది. దానీ ఫీచర్స్ను మాత్రం బయటకు రివీల్ చేయలేదు. ఇప్పుడు రాబోయే ఈ హ్యాండ్సెట్ చైనాలోని సర్టిఫికేషన్ వెబ్సైట్లో లిస్ట్ చేశారు. దీంతో ఈ మోడల్ లాంఛ్ తేదీ, ఇతర సాంకేతిక వివరాలను వెల్లడించినట్టు అయింది. ఇది మూడు రంగులలో, రెండు RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభ్యం కానుందని తెలుస్తోంది.
త్వరలో రానున్న ఒప్పో రెనో 15C చైనా టెలికాం వెబ్సైట్లో మోడల్ నంబర్ PMD110తో కనిపించిందని గిజ్మోచినా నివేదిక పేర్కొంది. ఈ జాబితా హ్యాండ్సెట్ గురించి వివిధ వివరాలను వెల్లడించింది. దాని లాంచ్ తేదీ, కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, కలర్వేస్, RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్లతో సహా ఎన్నో ఫీచర్స్ను బయటకు రివీల్ చేశారు.
ఒప్పో రెనో 15C డిసెంబర్ 19న చైనాలో అమ్మకానికి వస్తుందని తెలుస్తోంది. కానీ ఈ విషయంలో కంపెనీ నుండి ఎటువంటి సమాచారం లేదు. ఇది 1.5K (1,256x2,760 పిక్సెల్స్) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్తో 6.59-అంగుళాల డిస్ప్లేతో రానుందని తెలుస్తోంది.
ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో అమర్చబడి ఉండవచ్చని టాక్. ఇందులో 50-మెగాపిక్సెల్ షూటర్, 50-మెగాపిక్సెల్ సెకండరీ, 8-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయని సమాచారం. ఈ హ్యాండ్సెట్ సెల్ఫీలు, వీడియో కాల్ల కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను కూడా పొందవచ్చని తెలుస్తోంది. ఒప్పో రెనో 15C అరోరా బ్లూ, అకాడమీ బ్లూ, స్టార్లైట్ బో రంగులతో యూజర్లను ఆకట్టుకోనున్నట్టుగా తెలుస్తోంది.
అంతేకాకుండా, ఈ స్మార్ట్ఫోన్ను టెక్ సంస్థ 12GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లాంచ్ చేయవచ్చని సమాచారం. అదనంగా ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 చిప్సెట్తో లిస్ట్ చేయబడిందని ప్రచురణ పేర్కొంది.
ఇటీవల ఒక టిప్స్టర్ ఒప్పో రెనో 15C కీ ఫీచర్స్ని రివీల్ చేశాడు. ఇవి చైనా టెలికాం లిస్టింగ్లో గుర్తించబడిన ఫీచర్స్కి దగ్గరగా ఉన్నాయి. దాని లాంచ్ను టీజ్ చేస్తున్నప్పుడు, స్మార్ట్ఫోన్ తయారీదారు ఫోన్ రెనో 15 సిరీస్లో “ఎంట్రీ-లెవల్”, మరింత సరసమైన ఎంపికగా ఉంచబడుతుందని చెప్పారు.
డిజైన్ పరంగా ఒప్పో రెనో 15C మూడు లెన్స్లను కలిగి ఉన్న చదరపు వెనుక కెమెరా మాడ్యూల్ను కలిగి ఉన్నట్లు చూపించారు. కేంద్రీకృత ఒప్పో బ్రాండింగ్ ప్యానెల్ వెనుక దిగువన ఉంచబడినట్లు చూపబడింది. ఇందులో USB టైప్-సి పోర్ట్, స్పీకర్ గ్రిల్, ఫోన్ దిగువన సిమ్ కార్డ్ ట్రే, మెటల్ ఫ్రేమ్ కూడా ఉంటాయి. లీక్ అయిన లాంచ్ తేదీకి రెండు వారాల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉన్నందున, ఫోన్ గురించి మరిన్ని వివరాలను రాబోయే రోజుల్లో బ్రాండ్ నిర్ధారించే అవకాశం ఉంది
ప్రకటన
ప్రకటన
Neutrino Detectors May Unlock the Search for Light Dark Matter, Physicists Say
Uranus and Neptune May Be Rocky Worlds Not Ice Giants, New Research Shows
Steal OTT Release Date: When and Where to Watch Sophie Turner Starrer Movie Online?
Murder Report (2025): A Dark Korean Crime Thriller Now Streaming on Prime Video