ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ Motoకు చెందిన Moto G55, Moto G35 ఫోన్‌లు యూరోపియన్ మార్కెట్‌లలో విడుదలయ్యాయి. లెనోవా యాజమాన్యంలోని బ్రాండ్ లేటెస్ట్ బడ్జెట్ ఆఫర్‌గా ఇవి మార్కెట్‌లోకి లాంచ్ అయ్యాయి. ఈ Moto G సిరీస్ ఫోన్‌లకు సంబంధించిన ధరలతోపాటు స్పెసిఫికేషన్‌లు కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో Moto G55 MediaTek Dimensity 7025 ఫ్రాసెసర్‌పై పనిచేస్తుండగా.. Moto G35 మాత్రం హుడ్ ఇంట్రనల్‌గా Unisoc T760 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇవి 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ హౌస్, 5000mAh సమార్థ్యం ఉన్న బ్యాటరీతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లు కలిగి ఉన్నాయి.
మనదేశంలో అందుబాటులో లేనప్పటికీ, వీటి ధరలను లాంచ్ అయిన ప్రాంతాలను బట్టీ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Moto G55 ధర యూరోప్‌లో EUR 249 (దాదాపు రూ. 24,000) నుండి ప్రారంభమవుతోంది. ఇది ఫారెస్ట్ గ్రే, స్మోకీ గ్రీన్, ట్విలైట్ పర్పుల్ షేడ్స్‌లో లభిస్తోంది. అలాగే, Moto G35 ధర EUR 199 (దాదాపు రూ. 19,000)గా ఉంది. ఇది లీఫ్ గ్రీన్, జామ రెడ్, మిడ్‌నైట్ బ్లాక్, సేజ్ గ్రీన్ రంగులలో అందుబాటులో ఉంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు కూడా లాటిన్ అమెరికా, ఆసియా-పసిఫిక్ మొబైల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉన్నాయి.
Moto G55 మోడల్ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో+eSIM)తో Android 14తో రన్ అవుతుంది. అలాగే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.49-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంది. అలాగే, ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 7025 ప్రాసెసర్, 8GB RAM, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రూపొందించారు. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో OISతో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెన్సార్‌లు ఉన్నాయి. అలాగే, 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. Moto G55 బ్లూటూత్ 5.3, FM రేడియో, NFC, GPS, A-GPS, LTEPP, GLONASS, గెలీలియో, QZSS, Beidou, Wi-Fi 802.11 a/b/g/n/ac, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. అలాగే, USB టైప్-C పోర్ట్‌ను అందించారు. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండడంతోపాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆన్‌బోర్డ్‌లోని ఇతర సెన్సార్‌లు యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, ఇ-కంపాస్, గైరోస్కోప్, SAR సెన్సార్, సెన్సార్ హబ్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు ఉన్నాయి. ఇది డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీని అందించారు.
చాలా వరకూ Moto G35 కూడా Moto G55 మాదిరిగానే కనిపిస్తుంది. అయితే ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ స్థాయితో 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే, 8GB వరకు RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో Unisoc T760 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. Moto G35 కూడా అదే విధమైన 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. అయితే, ప్రైమరీ సెన్సార్‌కు OIS సపోర్ట్ లేదు. 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో రూపొందించారు. Moto G35 సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది.
ప్రకటన
ప్రకటన