Photo Credit: Honor
తాజాగా చైనాలో హానర్ మ్యాజిక్ 7 RSR Porsche Design ఫోన్‌ను లాంచ్ చేశారు. కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కీలకమైన స్పెసిఫికేషన్స్‌ను వెల్లడించింది. నిజానికి, కంపెనీ లాంచ్‌కు ముందే ఓ టిప్‌స్టర్ ద్వారా ఈ మోడల్‌కు చెందిన కెమెరా స్పెసిఫికేషన్స్ బహిర్గతం అయ్యాయి. అంతేకాదు, గతంలో బయటకు వచ్చిన లీక్‌ల ఆధారంగా ఫోన్ డిస్‌ప్లే, బిల్డ్, బ్యాటరీ వివరాలు సైతం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఈ సరికొత్త హ్యాండ్‌సెట్ Honor Porsche Design Magic 6 RSRను విజయవంతం చేస్తుంది. అలాగే, ఇది మన దేశంలో అక్టోబర్‌లో పరిచయమైన Magic 7 సిరీస్‌లో ఈ మోడల్‌ను చేర్చాలని కంపెనీ భావిస్తున్నట్లు స్పష్టమైంది.
ఈ హానర్ మ్యాజిక్ 7 RSR Porsche Design స్మార్ట్ ఫోన్ 1/1.3-అంగుళాల 50-మెగాపిక్సెల్ OV50K ప్రైమరీ సెన్సార్‌తో f/1.4-f2.0 ఫిజికల్ వేరియబుల్ ఎపర్చర్‌ని పొందుతుందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెయిబో పోస్ట్ ప్రకారం వెల్లడైంది. దీనితో పాటు 122-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ, 25 మిమీ మాక్రో మోడ్ కెపాసిటీలతో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్‌ను కూడా ఈ ఫోన్‌కు అందించారు.
హానర్ మ్యాజిక్ 7 RSR Porsche Design హ్యాండ్‌సెట్‌లో పెరిస్కోప్ లెన్స్‌తో కూడిన 1/1.4-అంగుళాల 200-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ కూడా ఉంది. ఇది OIS, 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్, f/1.88 ఎపర్చరు,1G+5P ఫ్లోటింగ్ పెరిస్కోప్ స్ట్రక్చర్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, ఈ ఫోన్‌లో డ్యూయల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మోటార్, ALC కోటింగ్, 1200-పాయింట్ dTOF ఫోకస్ మాడ్యూల్, ఫ్లికర్ సెన్సార్‌ను కలిగి ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
హానర్ మ్యాజిక్ 7 Porsche Design స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ మొదటి పెరిస్కోప్ టెలిఫోటో అల్ట్రా-లార్జ్ ఎపర్చరు. అంతేకాదు, ఇండస్టీ మొదటి డ్యూయల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోకస్ మోటర్‌తో కూడా వస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. తాజాగా, ఈ ఫోన్ చైనాలో డిసెంబర్ 23న స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదల అయ్యింది. గ్లోబల్ లాంచ్‌కు సంబంధించి గానీ, దీని రంగులు, ధర వివరాలు ప్రస్తుతం అంచనాలుగానే ఉన్నప్పటికీ స్పష్టత రాలేదు.
ఈ సరికొత్త మోడల్ ఫోన్ క్వాడ్-కర్వ్డ్ డిజైన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల 1.5K LTPO డిస్‌ప్లేతో అందుబాటులోకి వస్తోంది. ఈ విషయం ఇప్పటికే లీక్ అయింది. అలాగే, హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో పాటు ToF 3D డెప్త్ కెమెరాను కలిగి ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు, ఇది ఆండ్రాయిడ్ 15-ఆధారిత MagicOS 9తో రన్ చేయబడుతుంది. 100W వైర్డు, 80W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇవ్వొచ్చు. దీని మార్కెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రావొచ్ని అంచనా వేస్తున్నారు.
ప్రకటన
ప్రకటన