Photo Credit: Realme
రాబోతోన్న కొన్ని వారల్లోనే Realme 14X భారత మొబైల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టవచ్చని భావిస్తున్నారు. అయితే, కంపెనీ ఇంకా దీనికి సంబంధించి అధికారికంగా ధృవీకరించలేదు. కానీ, ఇప్పటికే ఈ మోడల్ వివరాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కొత్తగా వచ్చిన నివేదిక ఆధారంగా.. Realme 14X స్మార్ట్ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌తో పాటు RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లను పరిశీలించవచ్చు. ఇది హ్యాండ్‌సెట్ బ్యాటరీ సామర్థ్యంతోపాటు రంగు ఎంపికల పరంగా వినియోగదారులను ఆకర్షించేలా ప్రణాళికలు వేస్తున్నారు. Realme 14X మోడల్ Realme 14 ప్రో, Realme 14 ప్రో+ మోడళ్ల జాబితాలో చేరి, 2025 జనవరిలో ఇండియాలోని మొబైల్ మార్కెట్‌లో లాంచ్ కానున్నట్లు అంచనా వేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. Realme 14Xకు సంబంధించిన పలు కీలక విషయాలను చూసేద్దామా?!
తాజాగా 91మొబైల్స్ నివేదిక ప్రకారం.. Realme 14X హ్యాండ్‌సెట్ డిసెంబర్ ప్రారంభంలో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ క్రిస్టల్ బ్లాక్, గోల్డెన్ గ్లో, జ్యువెల్ రెడ్ కలర్‌వేస్‌లో వస్తుందని నివేదికలో చెప్పబడింది. అలాగే, ఇది 6GB + 128GB, 8GB + 128GB, 8GB + 256GB RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులోకి రానుంది. Realme 14X స్మార్ట్ ఫోన్ 6,000mAh భారీ బ్యాటరీతోపాటు ఆకర్షణీయమైన కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుందని వెల్లడించింది. అంతేకాదు, ఈ హ్యాండ్‌సెట్ గురించిన మరిన్ని వివరాలు అతి తర్వరలోనే ఆన్‌లైన్‌లో వెల్లడికానున్నట్లు పేర్కొంది.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో మన దేశీయ మార్కెట్‌లో విజయవంతంగా లాంచ్ అయిన Realme 12x 5Gకు కొనసాగింపుగా Realme 14X స్మార్ట్ ఫోన్‌ని కంపెనీ అందించనున్నట్లు భావిస్తున్నారు. అయితే, కంపెనీ 13x మోడల్‌ను మాత్రం ఇప్పటికీ పరిచయం చేయలేదు. అలాగే, ఇండియా మొబైల్ మార్కెట్‌లో 4GB + 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 11,999గా ఉంది. హ్యాండ్‌సెట్ సెంటర్-అలైజ్‌డ్ వెనుక కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మైక్రో షూటర్‌తో వస్తుంది.
గతంలో విడుదలైన ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్, MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ 8GB వరకు LPDDR4x RAM, 128GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రూపొందించబడింది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Realme యూఐ 5.0తో ఇది పనిచేస్తోంది. అంతేకాదు, 3.5mm ఆడియో జాక్, 5జీ, జీపీఎస్, వైఫై, బ్లూటూత్ 5.3, టైప్-సి పోర్టులను అందించారు. ఇది IP54 రేటింగ్‌తో అందుబాటులోకి వస్తుంది. అలాగే, RMX990 మోడల్ నంబర్‌తో కూడిన Realme 14 Pro Lite మోడల్ రాబోయే Realme 14 సిరీస్‌లో చేరవచ్చని గతంలోనే ప్రచారం జరిగింది. ఇది 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GBలలో నాలుగు RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందించబడుతుందని వెల్లడైంది.
ప్రకటన
ప్రకటన