Photo Credit: Vivo
వివో V50 లైట్ 5G నలుపు, బంగారం మరియు ఊదా రంగులలో కనిపిస్తుంది.
ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో Vivo V50 Lite 5G ఆవిష్కరించబడింది. ఇది ఈ వారం ప్రారంభంలో కొన్ని ప్రాంతాలలో విడుదలైన Vivo V50 Lite 4G వేరియంట్‌తో అనేక పోలికలను కలిగి ఉంది. మన దేశంలో ఫిబ్రవరిలో standard Vivo V50 లాంఛ్ అయిన తర్వాత Lite వేరియంట్‌లు ఇక్కడ విడుదల అవుతాయో లేదో కంపెనీ ఇంకా నిర్ధారించలేదు. Vivo V50 Lite 5G వెర్షన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 6,500mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తోంది.
కొత్త Vivo V50 Lite 5G మోడల్ 12GB + 512GB RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర EUR 399 (సుమారు రూ. 37,200)గా నిర్ణయించబడింది. అలాగే, ఇది స్పెయిన్‌లోని అధికారిక ఈ-స్టోర్ ద్వారా కొనుగోలు చేసుకునేందుకు అందుబాటులో ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ ఫాంటసీ పర్పుల్, ఫాంటమ్ బ్లాక్, సిల్క్ గ్రీన్, టైటానియం గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. దీని గ్లోబల్ లిస్టింగ్ ప్రకారం దేశం లేదా ప్రాంతాన్ని బట్టి కలర్ ఆప్షన్‌లు మారుతూ ఉంటాయి. అలాగే, Vivo V50 Lite 4G 8GB + 256GB ఆప్షన్ వేరియంట్ ధర టర్కీలో TRY 18,999 (సుమారు రూ. 45,000)గా నిర్ణయించారు. ఇది టైటానియం బ్లాక్, టైటానియం గోల్డ్ షేడ్స్‌లో వస్తోంది.
ఈ Vivo V50 Lite 5G 6.77-అంగుళాల ఫుల్-HD+ (1,080x2392 పిక్సెల్స్) 2.5D pOLED డిస్‌ప్లేతో వస్తోంది. ఇది Android 15-ఆధారిత FuntouchOS 15తో రావడంతోపాటు దీని ఫీచర్స్ 4G వెర్షన్‌ను పోలి ఉంటాయి. Vivo V50 Lite 5G 12GB LPDDR4X RAM, 512GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడిన ఆక్టా-కోర్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో శక్తిని గ్రహిస్తుంది. 4G మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
దీని కెమెరా విషయానికి వస్తే.. Vivo V50 Lite 5G దీని 4G కౌంటర్‌పార్ట్ మాదిరిగానే 50-మెగాపిక్సెల్ IMX882 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. 4G వేరియంట్ 2-మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ సెన్సార్‌తో రూపొందిచబడగా, 5G ఆప్షన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్‌తో వస్తుంది. రెండు వెర్షన్‌లలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
రెండు వేరియంట్‌లూ 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీతో వస్తున్నాయి. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ నానో సిమ్‌లు, 5G, 4G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, NFC, GPS, OTG, బ్లూటూత్ 5.4, USB టైప్-C కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి. ఇది IP65 డస్ట్, స్ప్లాష్-రెసిస్టెంట్ బిల్డ్, MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్రాప్-రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో వస్తోంది. 163.77 x 76.28 x 7.79mm పరిమాణంతో 197 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన