Photo Credit: Lava
Lava స్మార్ట్‌ఫోన్ కంపెనీ తాజాగా తన మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Lava Agni 3ని దేశీయ మార్కెట్‌లోకి గ్రాండ్‌గా విడుదల చేసింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌తో వస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 1.74-అంగుళాల AMOLED టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో పాటు కొన్ని సరికొత్త ఫీచర్లకు యాక్సెస్‌ను ఇస్తోంది. Lava Agni 3.. MediaTek Dimensity 7300X ప్రాసెసర్‌తోపాటు 8GB RAM, Android 14పై రన్ అవుతూ.. 66W వద్ద ఛార్జ్ చేయగల 5,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఇక మన దేశంలో ఈ Lava Agni 3 ప్రారంభ ధర ఛార్జింగ్ అడాప్టర్ లేకుండా 8GB RAM, 128GB స్టోరేజ్‌తో ఉన్న బేస్ మోడల్ ధర రూ. 20,999గా ఉంది. అదే కాన్ఫిగరేషన్ ఛార్జర్‌తో పాటు ఉన్న వేరియంట్ ధర రూ. రూ. 22,999. 256GB స్టోరేజ్ వేరియంట్‌ను (ఛార్జర్‌తో సహా) కూడా విక్రయిస్తోంది. దీని ధర రూ. 24,999గా వెల్లడించింది. దేశీయ మార్కెట్‌లో అక్టోబర్ 9న 12 గంటలకు (అర్ధరాత్రి) Amazon ద్వారా విక్రయించబడుతుంది. ఇది హీథర్ గ్లాస్, ప్రిస్టీన్ గ్లాస్ కలర్ ఆప్షన్‌లలో రానుంది.
Lava Agni 3 డ్యూయల్-సిమ్ (నానో+నానో)తో వస్తుంది. అలాగే, నాలుగు సంవత్సరాల పాటు మూడు OS వెర్షన్ అప్‌గ్రేడ్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.78-అంగుళాల 1.5K (1,200x2,652 పిక్సెల్‌లు) AMOLED స్క్రీన్‌తో 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. దీని వెనుక ప్యానెల్‌లో 1.74-అంగుళాల AMOLED టచ్ స్క్రీన్ అందించారు. ఇది కాల్‌లను స్వీకరించడంతోపాటు మెసేజ్‌లకు త్వరగా ప్రతిస్పందించడం, మ్యూజిక్ కంట్రోల్, టైమర్ సెట్టింగ్ లేదా అలర్ట్ సెల్ఫీలు తీసుకోవడం వంటి యాక్టివిటీస్‌కు ఉపయోగించవచ్చు.
Lava Agni 3 'యాక్షన్' బటన్ అమర్చడంతో రింగర్, సైలెంట్ మోడ్‌లకు మారడానికి, ఫ్లాష్‌లైట్ ఫీచర్‌ను ఆన్ చేయడానికి లేదా కెమెరా కోసం షట్టర్ బటన్‌గా పని చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ, 112-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, ఎలక్ట్రానిక్ ఇమేజ్‌తో 3x ఆప్టికల్ జూమ్‌తో 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను వినియోగించుకోవచ్చు. దీని ముందు భాగంలో EISతో కూడిన 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అందించారు.
దీని ఎక్స్‌టర్నల్ మెమరీని ఉపయోగించి 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌ని పొందొచ్చు. 5G, 4G LTE, Wi-Fi-6E, బ్లూటూత్ 5.4, GPS, NavIC, USB టైప్-సి పోర్ట్ వంటి డాల్బీ అట్మోస్ కనెక్టివిటీ ఆప్షన్స్‌లతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను అందించారు. ఇందులో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ఈ-కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటివి ఉన్నాయి. అలాగే, దీని 5,000mAh బ్యాటరీ 19 నిమిషాల్లో 50 శాతానికి ఛార్జ్‌ని అందిస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
ప్రకటన
ప్రకటన