Photo Credit: Oppo
ఈ ఏడాది మేలో విడుదలైన Reno 12 సిరీస్‌కు కొనసాగింపుగా Oppo Reno 13 సిరీస్‌ను చైనాలో లాంచ్ చేసింది. Oppo Reno 13, Reno 13 Proతో ఈ సిరీస్‌లో రెండు మోడళ్లను పరిచయం చేయనుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు కూడా చిప్‌సెట్, కెమెరాలు, డిస్‌ప్లే రిజల్యూషన్, ఛార్జింగ్ స్పీడ్‌తో సహా చాలా స్పెసిఫికేషన్‌లను ఒకేలా కలిగి ఉంటాయి. అండర్ ది హుడ్ MediaTek న్యూ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొదటి మోడల్స్‌గా ఈ సిరీస్‌లో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లును చెప్పొచ్చు. మెరుగైన వైర్‌లెస్ కమ్యూనికేషన్ కోసం కంపెనీ X1 చిప్‌ను అందిస్తున్నట్లు యాజమాన్య వెల్లడించింది.
ధర విషయానికి వస్తే.. Oppo Reno 13 బేస్ మోడల్ 12GB+256GB CNY 2,699 (సుమారు రూ. 31,000) వరకూ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మొత్తం ఐదు RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో కొనుగోలు చేసుకోవచ్చు. ఇది మిడ్‌నైట్ బ్లాక్, గెలాక్సీ బ్లూ, బటర్‌ఫ్లై పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. Oppo Reno 13 Pro టాప్-ఎండ్ 16GB+1TB స్టోరేజ్ మోడల్ ధర CNY 4,499 (దాదాపు రూ. 52,000)గా నిర్ణయించారు. అలాగే, ఇది నాలుగు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో మిడ్‌నైట్ బ్లాక్, స్టార్‌లైట్ పింక్, బటర్‌ఫ్లై పర్పుల్ కలర్‌వేస్‌లలో వస్తోంది.
Oppo Reno 13 ఫుల్-HD+ రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల (1256x2760 పిక్సెల్‌లు) AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 460ppi పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది MediaTek డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ద్వారా 3.35GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌తో పని చేస్తుంది. గరిష్టంగా 16GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజీని అటాచ్ చేశారు.
50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ఇక Oppo Reno 13 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీల కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 5,600mAh బ్యాటరీతో 80W (వైర్డ్), 50W (వైర్‌లెస్) ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక Oppo Reno 13 Pro బేస్ మోడల్ అదే రిఫ్రెష్ రేట్, పీక్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల (1272x2800 పిక్సెల్‌లు)తో కొంచెం పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది.
Oppo Reno 13 Pro రెండు కెమెరా లెన్స్‌లను కలిగి ఉండి, 3.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో మూడవ 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను అటాచ్ చేశారు. 5,800mAh బ్యాటరీ సామర్థ్యంతో పని చేస్తుంది. Reno 13 సిరీస్‌లోని రెండు మోడల్స్ కూడా ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్‌ఓఎస్ 15పై రన్ అవుతాయి. పరిమాణం పరంగా 162.73 x 76.55 x 7.55 మిమీలతో 197 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన