Photo Credit: Vivo
Vivo V50 7.39mm సన్నని ప్రొఫైల్‌ను కలిగి ఉంది
భారత్‌లో Vivo V50 లాంఛ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని అందించారు. ఇది 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో పాటు రెండు 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, స్ప్లాష్ నియంత్రణకు IP68+IP69 రేటింగ్‌లను, 7.39mm సన్నని ప్రొఫైల్‌ను కలిగి ఉందని వెల్లడైంది. అంతేకాదు, ఈ విభాగంలో అత్యంత సన్నని స్మార్ట్ ఫోన్‌గా ప్రచారం జరుగుతోంది. ఫోన్‌లో సర్కిల్ టు సెర్చ్, ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్ వంటి అనేక AI ఫీచర్లు ఉన్నాయి.
మన దేశంలో Vivo V50 ఫోన్ ధర 8GB + 128GB ఆప్షన్ రూ. 34,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 8GB + 256GB, 12GB + 512GB వేరియంట్ ధరలు వరుసగా రూ. 36,999, రూ. 40,999గా ఉన్నాయి. ఫిబ్రవరి 25 నుండి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఇండియా ఈ-స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. హ్యాండ్‌సెట్ ప్రీ-బుకింగ్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. మొబైల్ కొనుగోలుతో పాటు, వినియోగదారులు Vivo TWS 3eని రూ. 1,899కి బదులు రూ. 1,499 తగ్గింపు ధరకు పొందవచ్చు. రోజ్ రెడ్, స్టార్రి బ్లూ, టైటానియం గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ 6.77-అంగుళాల ఫుల్-HD+ (1,080 x 2,392 పిక్సెల్స్) క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్, 4,500 నిట్స్ పీక్ లోకల్ బ్రైట్‌నెస్, 387ppi పిక్సెల్ డెన్సిటీతో కలిగి ఉంది. 12GB వరకు LPDDR4X RAM, 512GB వరకు UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడింది. ఇది Android 15-ఆధారిత FuntouchOS 15తో రన్ అవుతుంది.
Vivo V50లో f/1.88 అపర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, వెనుకవైపు f/2.0 అపర్చర్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు కెమెరా f/2.0 అపర్చర్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. Vivo ఆరా లైట్ ఫీచర్ ఉంది. ఎరేస్ 2.0, లైట్ పోర్ట్రెయిట్ 2.0 వంటి AI-బ్యాక్డ్ ఫోటో ఎడిటింగ్ ఫీచర్‌లతో వస్తుంది.
ఈ ఫోన్‌లో 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh భారీ బ్యాటరీని అందించారు. సెక్యూరిటీ కోసం హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్స్‌లో డ్యూయల్ 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, OTG, USB 3.2 టైప్-C పోర్ట్ ఉన్నాయి. టైటానియం గ్రే వెర్షన్ 163.29x76.72x7.39mm పరిమాణంతో 189g బరువు కలిగి ఉంటుంది. అలాగే, రోజ్ రెడ్, స్టార్రి నైట్ ఎడిషన్‌లు వరుసగా 199g బరువుతో 7.57mm, 7.67mm సన్నని ప్రొఫైల్‌లను కలిగి ఉంటాయి.
ప్రకటన
ప్రకటన