Samsung Galaxy S25, Galaxy S25+, Galaxy S25 అల్ట్రా డిజైన్‌తోపాటు స్పెసిఫికేషన్‌లు లాంచ్‌కు ముందే లీక్‌

Galaxy S25 అల్ట్రా curved cornersతోపాటు మంచి గుర్తింపు పొందిన డిజైన్ ట్వీక్‌లను కలిగి ఉన్నట్లు క‌నిపిస్తోంది. ఈ మూడు మోడ‌ళ్ల‌కు సంబంధించిన ప‌లు కీల‌క స్పెసిఫికేష‌న్స్ బ‌హిర్గ‌త‌మ‌య్యాయి

Samsung Galaxy S25, Galaxy S25+, Galaxy S25 అల్ట్రా డిజైన్‌తోపాటు స్పెసిఫికేషన్‌లు లాంచ్‌కు ముందే లీక్‌

Photo Credit: Samsung

Samsung Galaxy S25 సిరీస్ గెలాక్సీ S24 లైనప్‌కు వారసుడు

ముఖ్యాంశాలు
  • Galaxy S25 ఫోన్‌ curved edges కలిగి ఉండవచ్చని రెండర్‌లు సూచిస్తున్నాయి
  • అన్ని Galaxy S25 మోడల్‌లు Android 15-ఆధారిత One UI 7లో ర‌న్ అవుతాయ‌ని అంచ
  • జనవరి 22న జరిగే Galaxy అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లోఈ డివైజ్‌ల‌ను కంపెనీ లాంచ్ చ
ప్రకటన

ఈ జనవరి 22న Samsung తన నెక్ట్స్ జ‌న‌రేష‌న్ Galaxy S డివైజ్‌ను Galaxy S25 సిరీస్‌గా ప‌రిచ‌యం చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. తాజాగా, ఓ టిప్‌స్టర్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ల రెండర్‌లు లీక్ అయ్యాయి. తాజా మోడళ్లల‌లో వచ్చే కొన్ని డిజైన్ మార్పులు ఇందులో గ‌మ‌నించవ‌చ్చు. Galaxy S25 అల్ట్రా curved cornersతోపాటు మంచి గుర్తింపు పొందిన డిజైన్ ట్వీక్‌లను కలిగి ఉన్నట్లు క‌నిపిస్తోంది. Samsung నుంచి రాబోయే ఈ లైనప్‌లోని మూడు మోడ‌ళ్ల‌కు సంబంధించిన ప‌లు కీల‌క స్పెసిఫికేష‌న్స్ బ‌హిర్గ‌త‌మ‌య్యాయి.

ఒకేలాంటి కెమెరా రింగ్‌లతో

ప్ర‌ముఖ‌ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ సబ్‌స్టాక్ ద్వారా మొదటి అధికారిక Galaxy S25 సిరీస్ రెండర్‌లను లీక్ చేశారు. ఈ ఇమేజ్‌లలో గెలాక్సీ S25+ వాటి గ‌త మోడ‌ల్స్‌ను పోలి ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. అలాగే, ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల వెనుక భాగంలో ఒకేలాంటి కెమెరా రింగ్‌లతో కూడిన‌ కెమెరా యూనిట్ ఉంది. ముందు భాగంలో కెమెరా కోసం ఒకేలాంటి హోల్-పంచ్ కటౌట్ క‌నిపిస్తోంది.

12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా

ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ నివేదిక ప్రకారం.. Galaxy S25 సిరీస్ Qualcomm న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్ ద్వారా 12GB RAMతో స్టాండర్డ్‌గా అందించబడుతుందని అంచ‌నా వేస్తున్నారు. అన్ని మోడళ్లు డ్యూయల్-సిమ్ (e-SIM), Wi-Fi 7, బ్లూటూత్ 5.3, 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచ‌ర్స్‌తో రానున్న‌ట్లు నివేదించబడింది. ఇవి అక్టోబర్‌లో వెల్ల‌డించిన‌ Android 15-ఆధారిత One UI 7లో ర‌న్ అవుతాయ‌ని సూచించ‌బ‌డింది.

బేస్ Galaxy S25 ఫోన్‌

ఇది 6.2-అంగుళాల (2,340×1,080 పిక్సెల్స్) డైనమిక్ AMOLED 2X స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది 128GB, 256GB, 512GB మూడు స్టోరేజ్ ఆప్షన్‌లలో అందించవ‌చ్చు. ఈ హ్యాండ్‌సెట్ 25W వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 4000mAh బ్యాటరీతో రానున్న‌ట్లు నివేదించ‌బడింది. 146.9×70.5×7.2mm ప‌రిమాణంలో 162గ్రాముల‌ బరువు ఉంటుంది.

Galaxy S25+ హ్యాండ్‌సెట్‌

ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల (3,120×1,440 పిక్సెల్స్) డైనమిక్ AMOLED 2X స్క్రీన్‌తో రానుంది. 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్‌ల‌లో మాత్రమే అందించనున్న‌ట్లు అంచ‌నా. ఇది 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4900mAh బ్యాట‌రీని క‌లిగి ఉంటుంది. Galaxy S25, Galaxy S25+ రెండూ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో రావ‌చ్చు. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించ‌నున్నారు.

మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో

Galaxy S25 Ultra 6.9-అంగుళాల (3,120×1,440 పిక్సెల్స్) డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో వ‌స్తోంది. 256GB, 512GB, 1TB మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో రావొచ్చు. ప్లస్ మోడల్ మాదిరిగానే 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ (వైర్డ్)తో 5000mAh బ్యాటరీని క‌లిగి ఉండ‌వ‌చ్చు. దీనికి క్వాడ్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను అందించ‌నున్నారు. 162.8×77.6×8.2mm ప‌రిమాణంతో 218గ్రాముల‌ బరువు ఉంటుంది.

ces_story_below_text

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026లో బ్రాండెడ్ వస్తువులపై నో-కాస్ట్ EMI ఆప్షన్, భారీ డిస్కౌంట్లు
  2. అమెజాన్‌‌లో రిపబ్లిక్ డే 2026 సేల్లో మంచి డిస్కౌంట్లు, డబుల్ రిఫ్రిజిరేటర్లపై రూ. 23 వేల వరకు ఆదా
  3. ఈ పరిస్థితుల్లోనూ vivo మరియు OPPO మాత్రమే డబుల్ డిజిట్ వార్షిక వృద్ధిని సాధించగలిగాయి.
  4. ఇందులో 108MP మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంది
  5. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16 నుంచి ప్రారంభమై ఇప్పుడు ఐదో రోజులోకి ప్రవేశించింది.
  6. ఈ ఇప్పుడు, రూ. 10,000 లోపు అద్భుత డీల్‌లలో ఉన్న బెస్ట్ ప్రింటర్స్ లిస్ట్‌ను చూద్దాం.
  7. Magic UI 10.0 ఆధారంగా Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
  8. ఈ ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
  9. వాషింగ్ మెషీన్స్ మీద వేలకు వేల తగ్గింపు.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లోని ఆఫర్స్ ఇవే
  10. ఏసీలపై వేలల్లో తగ్గింపు.. వేసవిలో తాపం తగ్గించుకోవాలనుకునే వారికి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ గ్రేట్ ఆఫర్స్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »