Google వినియోగదారులకు కొత్త ఫీచర్‌లను అందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా కంపెనీ తరచుగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK) అందుబాటులో ఉంచుతోంది
Photo Credit: Google
Android 16 is expected to arrive in the form of a major SDK release followed by a minor update
Google వెల్లడించిన వివరాల ప్రకారం.. Android 16 వెర్షన్ వచ్చే ఏడాది అంటే 2025 మొదిటి ఆరు నెలల్లో విడుదల కానుంది. అక్టోబర్‌లో రిలీజ్ అయిన పిక్సెల్ ఫోన్‌ల కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్ మాదిరి కాకుండా Google తాజా అప్‌డేటెడ్ Android వెర్షన్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో పరిచయం చేయనుంది. ఈ సంవత్సరం చివరి నాటికి చిన్న చిన్న మార్పులతో విడుదల ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. దీని ఆదారంగా యాప్ స్టెబిలిటీని మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే, వినియోగదారులకు కొత్త ఫీచర్‌లను అందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా కంపెనీ తరచుగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK) అందుబాటులో ఉంచుతోంది.
ఆండ్రాయిడ్ డెవలపర్‌ల బ్లాగ్‌లోని ఒక పోస్ట్‌లో.. ఇది Q2 2025లో (సాధారణ Q3 లాంచ్ విండోకు బదులుగా) మేజర్ రిలీజ్ ఉంటుందని, దాని తర్వాత నాల్గవ త్రైమాసికంలో మైనర్ రిలీజ్ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉత్పత్తుల విడుదల షెడ్యూల్‌తో మెరుగైన ఫలితాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు Google చెబుతోంది. ఇది Android 16ని అర్హత ఉన్న పరికరాలకు వేగవంతమైన రేటుతో అందించడానికి వీలు కల్పిస్తుంది.
Google చెబుతున్న దాని ప్రకారం.. Q2 2025లో మేజర్ SDK విడుదలలో పనితీరు మార్పులు (Androidలో యాప్‌లు ఎలా పనిచేస్తాయనే దానిపై ప్రభావం చూపుతాయి), APIలు, ఫీచర్‌లు ఉంటాయి. ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్‌తో కంపెనీ మేజర్ SDK విడుదలను మాత్రమే పరిచయం చేసినందున ఈ ఆండ్రాయిడ్ 16 విడుదల చేయబడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Android 16 విడుదలైన తర్వాత Google Q3 2025లో ఇంక్రిమెంటల్ అప్‌డేట్‌లను విడుదల చేస్తుంది. ఆ తర్వాత Q4 2025లో రెండవ మైనర్ Android 16 SDK విడుదల అవుతుంది. ఈ విడుదలలో కొత్త APIలు, ఫీచర్లు ఉంటాయని Google చెబుతోంది. అయితే ఇది కొత్త పనితీరును పరిచయం చేయనప్పటికీ, యాప్‌లపై ప్రభావం చూపుతుంది. డెవలపర్‌లు, ఔత్సాహికులు త్వరలో Android 16ని పరీక్షించవచ్చు. ఎందుకంటే, కంపెనీ మొదటి డెవలపర్ ప్రివ్యూ రాకను బహిర్గతం చేసింది. అయితే, ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఎందుకంటే, కంపెనీ ఆండ్రాయిడ్ 16ని లాంచ్ చేయడానికి సుమారు ఐదు నెలల సమయం ఉంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో గూగుల్ ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వచ్చిన పిక్సెల్ 9 సిరీస్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు రెండు నెలల తర్వాత, అక్టోబర్ 15న Android 15కి అప్‌డేట్‌ను అందుకున్నాయి. ఇదే మాదిరి Android 16లో విడుదల టైమ్‌లైన్ Pixel 10 సిరీస్ 2025లో Google ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్‌ను అందుకుంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరి వినియోగదారుల అంచనాలకు తగ్గట్టు ఉంటుందో లేదో తెలియాలంటే మరి కొంత సమయం చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket