వీడియోలు, ఫోటోల కోసం మరింత స్పేస్.. గూగుల్ AI ప్రో ప్లాన్ ఇప్పుడు మరింత పవర్‌ఫుల్!

గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను వాడుతున్న వారికి ఇకపై స్టోరేజ్ టెన్షన్ ఉండదని స్పష్టం చేస్తూ ఒక క్రేజీ అప్‌డేట్‌ను అనౌన్స్ చేసింది.

వీడియోలు, ఫోటోల కోసం మరింత స్పేస్.. గూగుల్ AI ప్రో ప్లాన్ ఇప్పుడు మరింత పవర్‌ఫుల్!

Photo Credit: Google

గూగుల్ AI ప్రో ప్లాన్ ఇప్పుడు మరింత పవర్‌ఫుల్

ముఖ్యాంశాలు
  • గూగుల్ AI ప్రో ప్లాన్ ఇప్పుడు మరింత పవర్‌ఫుల్
  • గూగుల్ నుంచి కొత్త అప్‌డేట్
  • AI ప్రో ప్లాన్‌లో భారీ మార్పులు
ప్రకటన

గూగుల్ తన యూజర్లకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను వాడుతున్న వారికి ఇకపై స్టోరేజ్ టెన్షన్ ఉండదని స్పష్టం చేస్తూ ఒక క్రేజీ అప్‌డేట్‌ను అనౌన్స్ చేసింది. ఇప్పటివరకు ఈ ప్లాన్‌లో లభిస్తున్న క్లౌడ్ స్టోరేజ్‌ను భారీగా పెంచుతూ గూగుల్ నిర్ణయం తీసుకుంది. టెక్నాలజీ ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, ముఖ్యంగా ఏఐ కంటెంట్ క్రియేట్ చేసే వారికి స్టోరేజ్ అనేది పెద్ద సమస్యగా మారుతోంది. ఈ విషయాన్ని గమనించిన గూగుల్, ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండానే తన సబ్‌స్క్రైబర్‌లకు మరింత వెసులుబాటును కల్పించింది. ఈ అప్‌డేట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు రోల్ అవుట్ అవుతోంది, ఇది గూగుల్ ఎకోసిస్టమ్‌లో ఏఐ టూల్స్ వాడుకునే వారికి ఒక గొప్ప వరమని చెప్పాలి.

ముఖ్యంగా స్టోరేజ్ విషయానికి వస్తే, గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ యూజర్లకు గతంలో కేవలం 2TB క్లౌడ్ స్టోరేజ్ మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ తాజా ప్రకటన ప్రకారం, దీనిని ఏకంగా 5TB కి పెంచేశారు. గూగుల్ వన్ హెడ్ షిమ్రిత్ బెన్-యైర్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ అదనపు స్పేస్‌ను మీరు గూగుల్ డ్రైవ్, జిమెయిల్ మరియు గూగుల్ ఫొటోస్ వంటి అన్ని సర్వీసుల్లోనూ వాడుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్లలో నిత్యం హై-క్వాలిటీ వీడియోలు, వేలకొద్దీ ఫొటోలు తీసుకునే నేటి జనరేషన్ యూజర్లకు ఈ 5TB స్టోరేజ్ అనేది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. డాక్యుమెంట్లు మరియు ఇతర భారీ ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి ఇకపై వేరే ఆప్షన్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.

ఈ ప్లాన్ ధర విషయానికి వస్తే, గూగుల్ తన యూజర్ల జేబుకు చిల్లు పడకుండా జాగ్రత్త పడింది. స్టోరేజ్ సామర్థ్యాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా పెంచినప్పటికీ, నెలవారీ లేదా వార్షిక రుసుముల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇండియాలో ప్రస్తుతం గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ ధర నెలకు 1,950 రూపాయలుగా ఉంది, అదే ఏడాదికి అయితే 19,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే పాత ధరకే కొత్త ఫీచర్లు మరియు భారీ స్టోరేజ్ లభిస్తుందన్నమాట. ఏఐ ద్వారా క్రియేట్ చేసే హై-రిజల్యూషన్ ఇమేజ్లు, వీడియోలు మరియు పెద్ద సైజులో ఉండే ఫైల్స్ స్టోర్ చేసుకోవడానికి ఈ అప్‌డేట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. టెక్ లవర్స్‌కు ఇది నిజంగా ఒక వాల్యూ ఫర్ మనీ డీల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

google ai pro g360 Google

కేవలం పైడ్ సబ్‌స్క్రైబర్లు మాత్రమే కాకుండా, గూగుల్ స్టూడెంట్ ఆఫర్ ద్వారా ఈ ప్లాన్ పొందిన వారు మరియు జియో కాంప్లిమెంటరీ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్ వాడుతున్న వారికి కూడా ఈ 5TB స్టోరేజ్ బెనిఫిట్ వర్తిస్తుంది. గూగుల్ డ్రైవ్ మరియు ఫొటోస్ యాప్స్‌లో ఈ మార్పులు ఇప్పటికే చాలా మందికి కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు ఇంకా అప్‌డేట్ అవ్వకపోతే, త్వరలోనే మీ అకౌంట్‌లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. స్టూడెంట్స్ కి ఇది మరింత ప్లస్ అవుతుంది, ఎందుకంటే వారి ప్రాజెక్ట్స్ మరియు ఏఐ లెర్నింగ్ మెటీరియల్స్ దాచుకోవడానికి కావాల్సినంత స్పేస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తన యూజర్ బేస్‌ను పెంచుకోవడానికి ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకురావడం విశేషం.

ఈ ప్లాన్ కేవలం స్టోరేజ్‌కే పరిమితం కాదు, ఇందులో మరిన్ని అదిరిపోయే ఏఐ ఫీచర్లు ఉన్నాయి. జెమిని, డీప్ రీసెర్చ్ వంటి అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్స్‌ను యూజర్లు యాక్సెస్ చేయవచ్చు. ముఖ్యంగా వీడియో క్రియేటర్స్ కోసం వియో వీడియో జనరేషన్ మోడల్ ,విస్క్‌లో వియో 2 ద్వారా ఇమేజ్ టు వీడియో క్రియేషన్ లిమిట్స్‌ను కూడా పెంచారు. అంతేకాకుండా, వర్టెక్స్ ఏఐలో వియో 3 ఫాస్ట్ వంటి అత్యాధునిక టూల్స్‌ను పరిమితంగా వాడుకునే అవకాశం కల్పిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్లకు,  టెక్ గీక్స్‌కు కావాల్సిన పవర్‌ఫుల్ టూల్స్ అన్నీ ఒకే ప్లాన్‌లో ఉండటం వల్ల పని మరింత సులభం అవుతుంది. క్రియేటివిటీకి స్టోరేజ్ అడ్డు రాకూడదనేది గూగుల్ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా నెలకు 1,000 ఏఐ క్రెడిట్స్ ఇస్తున్నారు, వీటితో టెక్స్ట్, ఇమేజ్, వీడియో జనరేషన్ క్వెరీలను ఫ్లో, విస్క్ ప్లాట్‌ఫారమ్‌లలో పూర్తి చేయవచ్చు. నోట్‌బుక్ ఎల్‌ఎమ్ వంటి యాప్స్‌లో ఆడియో ఓవర్‌వ్యూలు మరియు నోట్‌బుక్స్ క్రియేట్ చేయడానికి ఐదు రెట్లు ఎక్కువ లిమిట్స్ ఇస్తున్నారు. దీనితో పాటు గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్ వంటి నిత్యం వాడే యాప్స్‌లో కూడా జెమిని ఏఐని వాడుకోవచ్చు. మొత్తానికి 2TB నుండి 5TB కి పెరిగిన స్టోరేజ్, మెరుగైన ఏఐ ఫీచర్లతో గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ ఇప్పుడు మార్కెట్లో అత్యంత పవర్‌ఫుల్ సబ్‌స్క్రిప్షన్‌గా మారింది. ట్రెండీగా ఆలోచించే నేటి యూజర్లకు కావాల్సిన స్పీడ్, స్పేస్ రెండింటినీ గూగుల్ అందిస్తోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. రేపు ఉదయం 10 గంటలకు ఏం జరగబోతోంది? అమెజాన్ ప్రైమ్‌లో ఉత్కంఠభరితమైన థ్రిల్లర్!
  2. ప్లేస్టేషన్ ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నెల ఉచిత గేమ్స్ లైనప్ వచ్చేసింది!
  3. మూడు తరాల మహిళల పోరాటం.. ఇసాబెల్ అలెండే నవలా రూపం ఇప్పుడు సిరీస్‌గా..!
  4. 200MP కెమెరా.. 7,000mAh బ్యాటరీ.. వీవో V70 FE వచ్చేసింది.. ఫీచర్లు అరాచకం!
  5. సెల్ఫీ మిర్రర్, 7,000mAh బ్యాటరీ.. రియల్ మీ 16 5G వచ్చేసింది.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
  6. రెడ్‌మీ నుంచి సరికొత్త 5G ఫోన్.. భారీ డిస్కౌంట్‌తో Redmi Note 15 SE 5G లాంచ్.. ధర ఎంతంటే?
  7. వీడియోలు, ఫోటోల కోసం మరింత స్పేస్.. గూగుల్ AI ప్రో ప్లాన్ ఇప్పుడు మరింత పవర్‌ఫుల్!
  8. ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. పాత ఫోన్ల కోసం అత్యవసర అప్‌డేట్ విడుదల చేసిన ఆపిల్!
  9. గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫస్ట్ లుక్ వచ్చేసింది.. కొత్త కెమెరా డిజైన్.. అల్ట్రా స్లిమ్ బెజెల్స్‌తో అదిరిపోయే లుక్..!
  10. మెయిల్స్ అన్నీ దానంతట అదే సెట్ చేస్తుంది! గూగుల్ నుంచి మ్యాజికల్ 'AI Inbox' ఫీచర్ లాంచ్..!
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »