Photo Credit: Google
ఈ ఏడాది ఆగస్టులో దేశీయ మార్కెట్‌లోని Google Pixel 9, Pixel 9 Pro XL, Pixel 9 Pro ఫోల్డ్‌తో Google Pixel 9 Pro లాంచ్ అయింది. అయితే, ప్రో వేరియంట్ ఆ సమయంలో మన దేశంలో అందుబాటులోకి రాలేదు. తాజాగా ఈ వారం భారతదేశంలో ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ ధరతోపాటు రంగులను కూడా వెల్లడించింది. Pixel 9 Pro టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌సెట్‌తో పాటు టెన్సర్ G4 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ 14తో రన్ అవుతుంది. మరెందుకు ఆలస్యం.. Google Pixel 9 Proకు సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దామా?!
భారతదేశంలో Google Pixel 9 Pro ధర 16GB + 256GB వేరియంట్ రూ.1,09,999గా కంపెనీ గతంలోనే వెల్లడించింది. తాజాగా ఇప్పుడు దేశంలో అక్టోబర్ 17 మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమయ్యే ప్రీ-ఆర్డర్‌లకు ఫోన్ అందుబాటులో ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ బ్యానర్ ద్వారా స్పష్టమైంది. అలాగే, ఇది Pixel 9 Pro XL వేరియంట్ మాదిరిగానే హాజెల్, Porcelain, Rose Quartz, అబ్సిడియన్ రంగులలో లభించనుంది.
Google Pixel 9 Pro హ్యాండ్‌సెట్ 6.3-అంగుళాల 1.5K (1,280 x 2,856 పిక్సెల్‌లు) SuperActua (LTPO) OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 3,000 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. అలాగే, టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌సెట్‌తో పాటు టెన్సర్ G4 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే.. Google Pixel 9 Pro 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 48-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, 5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన మరో 48-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం కెమెరా నుండి 42-మెగాపిక్సెల్‌ని ఉపయోగిస్తుంది. ఇది అదనపు ఆకర్షణగా చెప్పొచ్చు.
Google Pixel 9 Pro స్మార్ట్‌ఫోన్ 4,700mAh బ్యాటరీ సామర్థ్యం, 45W వైర్డుతో పాటు Qi వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో దీనిని రూపొందించారు. ఇది దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, Google Cast, GPS, డ్యూయల్ బ్యాండ్ GNSS, BeiDou, GLONASS, గెలీలియో, QZSS, NavIC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. మరి గతంలో అందుబాటులోకి వచ్చిన Google Pixel 9, Pixel 9 Pro XL, Pixel 9 Pro ఫోల్డ్ మోడల్స్ మాదిరిగానే ఈ సరికొత్త హ్యాండ్‌సెట్‌కు కూడా మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తుందని కంపెనీ ఆశిస్తోంది.
ప్రకటన
ప్రకటన