Photo Credit: Huawei
ఈ ఏడాది అక్టోబర్‌లో Huawei Nova 13 సిరీస్ చైనాలో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌లు గ్లోబల్ మార్కెట్‌లలోకి అడుగుపెట్టాయి. ఈ లైనప్‌లో Huawei Nova 13, Nova 13 Pro మోడల్స్ ఉన్నాయి. ఈ రెండు మోడళ్లలో Kirin 8000 ప్రాసెసర్, 100W వద్ద ఛార్జ్ చేయగల 5,000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీలను కంపెనీ అందించింది. అలాగే, నవంబర్‌లో చైనాలో లాంచ్ చేసిన Huawei FreeBuds Pro 4ను తాజాగా Nova 13 సిరీస్ హ్యాండ్‌సెట్‌లతోపాటు అన్ని చోట్లా అందుబాటులోకి వచ్చింది. ఈ గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ Huawei Mate X6 బుక్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా పరిచయం చేసింది.
Huawei Nova 13 మోడల్ 12GB + 256GB వేరియంట్ ధర MXN 10,999 (దాదాపు రూ. 46,100)గా నిర్ణయించారు. అలాగే, Nova 13 Pro 12GB + 512 వేరియంట్ ధర MXN 15,999 (సుమారు రూ. 67,100)గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లు నలుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు Huawei FreeBuds Pro 4 ఇయర్‌ఫోన్‌ల ధర MXN 3,199 (దాదాపు రూ. 13,400)కి లభించనున్నాయి. త్వరలోనే ఇవి గ్లోబల్ మార్కెట్‌లలో విక్రయానికి తీసుకురానున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.
ఈ బేస్ Huawei Nova 13 ఫోన్ 6.7-అంగుళాల ఫుల్-HD+ OLED స్క్రీన్‌తో వస్తుంది. అయితే, ప్రో వేరియంట్‌కు 6.76-అంగుళాల OLED క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు. ఈ రెండూ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. Android 14-ఆధారిత HarmonyOS 4.2తో రన్ అవుతాయి. రెండు ఫోన్‌లకు USB టైప్-సి పోర్ట్ ద్వారా 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీలను అందించారు.
ఈ ఫోన్‌లు కూడా 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్‌లను కలిగి ఉన్నాయి. Huawei Nova 13 ఫోన్ 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌తో వస్తుంది. అయితే, ప్రో మోడల్ 3x ఆప్టికల్ జూమ్, 8-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో 12-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో ఒక్కొక్కటి 60-మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలను అందించారు. ప్రో వేరియంట్‌లో అదనంగా 8-మెగాపిక్సెల్ 5x జూమ్ లెన్స్ ఉన్నాయి.
అలాగే, 11mm ఫోర్-మాగ్నెట్ డైనమిక్ డ్రైవర్, మైక్రో-ఫ్లాట్ ట్వీటర్‌లతో Huawei FreeBuds Pro 4 TWS ఇయర్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్‌తోపాటు ANC, స్పేషియల్ ఆడియో ఫీచర్‌లకు సపోర్ట్ చేస్తాయి. ఈ ఇయర్‌ఫోన్‌లు టచ్ కంట్రోల్‌ను కలిగి ఉంటున్నాయి. అలాగే, దుమ్ము,స్ప్లాష్ నియంత్రణ కోసం IP54 రేటింగ్‌తో వస్తున్నాయి. దీని ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఒక్క ఛార్జ్‌పై 22 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్‌ని అందిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.
ప్రకటన
ప్రకటన