చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Infinix కంపెనీ Infinix Note 40X మోడల్‌ను వచ్చే ఆగస్టు నెలలో మన దేశంలో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇటీవల మార్కెట్‌లో విడుదలైన నోట్ 40 సిరీస్ ఫోన్‌ల మాదిరిగానే రాబోయే ఈ Infinix Note 40X కూడా 108 మెగా పిక్సెల్ ఆల్ట్రాతో కూడిన మెయిన్ సెన్సర్ కెమెరాతో ట్రిపుల్ రేర్ కెమెరాతోపాటు 2 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, లైట్ సెన్సర్‌తో కూడిన మూడో కెమెరాతో రూపొందించారు. ఇది మూడు రంగులలో మార్కెట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. మరెందుకు ఆలస్యం.. ఆగస్టులో లాంచ్ కాబోతోన్న Infinix Note 40X మోడల్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా?!
సిల్వర్ కలర్‌లో మెరుస్తూ
Infinix Note 40X భారతదేశంలో ఆగస్ట్ 5న విడుదల కానుంది. ఇది లైమ్ గ్రీన్, పామ్ బ్లూ, స్టార్‌లిట్ బ్లాక్ ఇలా మూడు రంగుల ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. అయితే, Infinix Note 40X లాంచ్ ఈవెంట్ సమయంతోపాటు ఈ మోడల్ ధరకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే, Infinix కంపెనీ అధికారికంగా షేర్ చేసిన ఫోటోల ఆధారంగా నోట్ 40X వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించినట్లు స్పష్టమవుతోంది. అలాగే, అవి LED ఫ్లాష్‌తో పాటు దీర్ఘచతురస్రాకార ఆకారపు కెమెరా మాడ్యూల్ సిల్వర్ కలర్‌లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. 15+ కెమెరా మోడ్స్‌తో
Infinix Note 40X 5G ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. అలాగే, ఇది AI సపోర్ట్ చేస్తూ 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందిస్తున్నారు. ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్‌తోపాటు 15+ కెమెరా మోడ్స్‌తో కూడిన అధనపు ఫీచర్స్ కూడా ఉంటున్నాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా విత్ పంచ్ హోల్ కటౌట్‌తో ఈ మోడల్ ఆకట్టుకుంటోంది. DTS - ఆడియో డ్యుయల్ స్పీకర్లు, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, ఎన్ఎఫ్‌సీ, సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ స్కానర్ లాంటి ఆధునిక ఫీచర్స్ జోడించబడ్డాయి. అలాగే, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ర్యామ్ స్టోరేజీని అందిస్తున్నారు. 18 వాట్ల చార్జింగ్ సపోర్టింగ్‌తో 5,000mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఎక్స్ఓఎస్ 14 ఓఎస్ వర్షన్ ఆధారంగా పని చేస్తోంది. డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అప్‌గ్రేడ్స్‌తో లాంచ్ కానుంది..
గత మే నెలలో విడుదలైన ఈ Infinix Note 40 5G ఫోన్‌ను మీడియాటెక్ డైమెన్సిటీ 7020 డైమెన్సిటీ ప్రాసెసర్‌తో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. Infinix Note 40 5G ఫోన్ 8జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 నుంచి విడుదల అయింది. అలాగే, Infinix Note 40X ఫోన్ పలు అప్‌గ్రేడ్స్‌తో లాంచ్ కానుంది. మార్కెట్ అంచనాల ప్రకారం.. ఈ ఫోన్ ధర దాదాపు రూ.10 వేల లోపు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. నిజంగా, ఈ ధరకు Infinix Note 40X మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తే మాత్రం.. ఇటీవల విడుదలైన ఇతర కంపెనీల బడ్జెట్ ఫోన్‌లకు మంచి పోటీ ఇవ్వనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా బడ్జెట్ మోడల్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఆగస్టు 5వ తేదీ వరకూ వేచి ఉండండి మరి!