iPhone 17 ధర అమెరికాలో 256GB స్టోరేజ్ వేరియంట్‌కి $799 (భారత రూపాయల్లో సుమారు రూ.
Photo Credit: Apple
ఐఫోన్ 17 ఐదు రంగులలో లభిస్తుంది
కుపర్టినోలోని ఆపిల్ పార్క్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కొత్త తరం iPhone 17 ను ఆవిష్కరించారు. ఈ ఏడాది బేస్ మోడల్‌గా వచ్చిన iPhone 17, గత ఏడాది వచ్చిన A18 చిప్‌సెట్‌కు కంటిన్యూషన్ అయిన కొత్త A19 చిప్‌సెట్‌తో వస్తోంది. ఐఓఎస్ 26 ఆపరేటింగ్ సిస్టమ్‌ను బాక్స్ నుంచి నేరుగా అందించే ఈ ఫోన్, మెరుగైన కెమెరాలు, వేగవంతమైన పనితీరు, అలాగే అనేక ఉపయోగకరమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముందున్న మోడల్‌లాగే, ఇందులో కూడా Apple Intelligence అనే ఆపిల్ ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సూట్‌కు సపోర్ట్ ఉంటుంది.
iPhone 17 ధర అమెరికాలో 256GB స్టోరేజ్ వేరియంట్‌కి $799 (భారత రూపాయల్లో సుమారు రూ.70,400) నుంచి ప్రారంభమవుతోంది. అదనంగా 512GB స్టోరేజ్ మోడల్ కూడా అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్‌లో మాత్రం iPhone 17 ధరను రూ.82,900గా నిర్ణయించారు.
ఈసారి కొత్త అప్‌గ్రేడ్‌గా, iPhone 17 ప్రో మోడల్స్‌తో పాటు నాన్-ప్రో మోడల్ కూడా 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ అందిస్తోంది. స్క్రీన్ గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. Ceramic Shield 2 ప్రొటెక్షన్, ఆల్వేస్-ఆన్ డిస్ప్లే, అలాగే IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
iPhone 17 లో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో ప్రధానంగా 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరా (f/1.6 అపర్చర్, సెన్సార్-షిఫ్ట్ OIS) ఉంటుంది. ఇది 2X టెలిఫోటో కెమెరాలా కూడా పనిచేస్తుంది (52mm ఫోకల్ లెంగ్త్). దీని తోడుగా 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ కెమెరా (f/2.2 అపర్చర్, మాక్రో సపోర్ట్) ఇవ్వబడింది. ఫ్రంట్‌లో కొత్త సెంటర్ స్టేజ్ సెల్ఫీ కెమెరాను అందించారు.
కొత్త A19 చిప్‌సెట్తో వచ్చిన ఈ ఫోన్‌లో 16-కోర్ న్యూరల్ ఇంజిన్ అమర్చారు. దీని వల్ల మరింత పవర్ ఎఫిషియెన్సీ, మెమరీ బ్యాండ్‌విడ్త్ పెరుగుదల, మరియు పనితీరు 40% వరకు వేగంగా ఉంటుందని ఆపిల్ చెబుతోంది. బేస్ స్టోరేజ్‌ను కూడా ఈసారి 256GB నుంచి ప్రారంభించారు. AI ఆధారిత ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ప్రో మోడల్స్ మాదిరిగానే ఇక్కడ కూడా ఉంటాయి.
బ్యాటరీ విషయానికి వస్తే, iPhone 17 గత మోడల్ అయిన iPhone 16 కంటే 8 గంటల అదనపు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. అదనంగా, కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది – కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 8 గంటల ఉపయోగం సాధ్యమని చెబుతున్నారు. అలాగే కేవలం కొన్ని నిమిషాల్లోనే 50% ఛార్జ్ అవుతుంది. కొత్తగా లాంచ్ అయిన ఈ ఫోన్ కోసం యాపిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రకటన
ప్రకటన