సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ X లో నిపుణ్ మార్యా పంచుకున్న టీజర్ వీడియోలో, iQOO 15 భారత లాంచ్ తేదీని ఊహించమని అభిమానులను కోరారు. ఆ స్పిన్‌వీల్‌లో నెలను ‘11’గా చూపించారు.
Photo Credit: iQOO
iQOO 15 భారతదేశంలో నాలుగు రంగులలో అందుబాటులో ఉండవచ్చు.
చైనా మార్కెట్‌లో ఇప్పటికే ఆవిష్కరించబడిన iQOO 15 ఇప్పుడు భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. కంపెనీ సీఈఓ నిపుణ్ మార్యా ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో ఈ విషయాన్ని సూచించారు. కొత్త స్మార్ట్‌ఫోన్, గతంలో వచ్చిన iQOO 13కు కంటిన్యూషన్గా వస్తోంది. ఈ ఫోన్‌లో అత్యాధునిక Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, ఆకర్షణీయమైన Suspended Deco డిజైన్, అలాగే శక్తివంతమైన 7,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉంటాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ X లో నిపుణ్ మార్యా పంచుకున్న టీజర్ వీడియోలో, iQOO 15 భారత లాంచ్ తేదీని ఊహించమని అభిమానులను కోరారు. ఆ స్పిన్‌వీల్‌లో నెలను ‘11'గా చూపించారు, అంటే ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్‌లో విడుదల కానుంది. వీడియోలో ఒక దశలో నవంబర్ 27 తేదీ వద్ద స్పిన్‌వీల్ ఆగడం గమనించవచ్చు. ఇది అధికారిక లాంచ్ తేదీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తర్వాతి పోస్టులో, నిపుణ్ మార్యా కంపెనీ కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ OriginOS 6 గురించి వివరాలు వెల్లడించారు. ఇది Android 16 ఆధారంగా ఉండి, “Dynamic Glow” అనే కొత్త విజువల్ ఎఫెక్ట్‌లతో మరింత సున్నితమైన, ఆకర్షణీయమైన లుక్‌ను అందిస్తుంది. చైనా వెర్షన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ UI, యాపిల్ లిక్విడ్ గ్లాస్ డిజైన్‌కు దగ్గరగా ఉంటుంది. ఇందులో గుండ్రని యాప్ ఐకాన్‌లు, స్మూత్ యానిమేషన్‌లు, మరియు లేయర్డ్ నోటిఫికేషన్ సిస్టమ్ ఉన్నాయి.
ఇక కొత్త అటామిక్ ఐలాండ్ ఫీచర్, యాపిల్ యొక్క డైనమిక్ ఐలాండ్ స్ఫూర్తితో రూపొందించబడింది. ఇది రియల్ టైమ్ అలర్ట్‌లు, మ్యూజిక్ కంట్రోల్‌లు, స్టాప్‌వాచ్ వంటి ఫంక్షన్‌లను సులభంగా నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది.
చైనాలో విడుదలైన iQOO 15లో 6.85 అంగుళాల Samsung M14 AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 2K (1,440×3,168 పిక్సెల్) రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, మరియు 508ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ప్రాసెసర్‌గా 3nm Snapdragon 8 Elite Gen 5 SoC ఉండగా, గ్రాఫిక్స్ కోసం Adreno 840 GPU వాడారు. ఈ ఫోన్‌లో 16GB LPDDR5X Ultra RAM మరియు గరిష్టంగా 1TB UFS 4.1 స్టోరేజ్ లభిస్తుంది.
కెమెరా విభాగంలో, మూడు లెన్స్‌లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రధాన సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (100x డిజిటల్ జూమ్ సపోర్ట్‌తో), మరియు 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. శక్తివంతమైన 7,000mAh బ్యాటరీతో పాటు, ఈ ఫోన్ 100W వైర్డ్ మరియు 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఫోన్ పరిమాణం 163.65×76.80×8.10mm, బరువు సుమారు 221 గ్రాములు. భారత మార్కెట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెల్లడించనప్పటికీ, నవంబర్ చివరిలోకి ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రకటన
ప్రకటన
Cat Adventure Game Stray is Reportedly Coming to PS Plus Essential in November