రెండు డిఫరెంట్ కలర్ వేరియంట్స్ లో వస్తున్న iQOO నియో 10

ఈ iQOO నియో 10 మొబైల్ డిఫరెంట్ స్టోరేజ్ ఆప్షన్స్ లో అందుబాటులోకి వచ్చింది. స్టోరేజ్ ఆప్షన్ ప్రకారం ప్రైస్ లో వేరియేషన్స్ ఉన్నాయి. దీనితో పాటు స్పెషల్ అట్రాక్షన్ గా గేమ్స్ ఆడే వారికి 144fps తో గేమింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.

రెండు డిఫరెంట్ కలర్ వేరియంట్స్ లో వస్తున్న iQOO నియో 10

Photo Credit: iQOO

iQOO నియో 10 ఇన్ఫెర్నో రెడ్ మరియు టైటానియం క్రోమ్ షేడ్స్‌లో అందించబడుతుంది

ముఖ్యాంశాలు
  • 7000mAh బ్యాటరీ బ్యాకప్, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీనిలో స్పెషల్ హైల
  • 50 మెగా పిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరా యూనిట్ , 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్
  • 4K వీడియో రికార్డింగ్ తో 32 మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా
ప్రకటన

ప్రముఖ చైనా మొబైల్ బ్రాండ్ VIVO సబ్ బ్రాండ్ అయినా iQOO బ్రాండ్ కూడా మంచి ఫాలోవర్స్ ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇండియన్ మొబైల్ మార్కెట్లో క్రెడియస్ట్ మొబైల్ గా కూడా ఉంది. ఈ బ్రాండ్ నుండి వస్తున్న ఫోన్స్ కోసం కస్టమర్లు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. మిడ్ రేంజ్ నుండి హై రేంజ్ వరకు మొబైల్స్ అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా iQOO బ్రాండ్ నుండి వచ్చిన కొత్త మొబైల్ ఫోన్ iQOO నియో 10 మే 28న ఇండియాలో లాంచ్ అయింది. అయితే ఈ ఫోన్ ప్రి బుక్ చేసుకున్న యూజర్స్ కి త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్లో ఉన్న ఫీచర్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్నాయి.ఈ మొబైల్ ఫోన్ 7000mAh బ్యాటరీ బ్యాకప్, 120w వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ మొబైల్ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8S జెన్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఫన్ టచ్ OS 15 ఆపరేటింగ్ సిస్టం ఉండనున్నాయి. బిల్డ్ క్వాలిటీ చూస్తే మొబైల్ మొత్తం ప్లాస్టిక్ బాడీతో ఉంటుంది. IP65 రేటింగ్ తో డస్ట్ & వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ఓవర్ హీట్ అవ్వకుండా 7000mm స్క్వేర్ వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా స్పెషల్ గా ఇన్బిల్ట్ చేశారు. ప్రత్యేకించి గేమ్స్ ఆడే వారికి 144fps తో గేమింగ్ సపోర్ట్ కూడా ఈ మొబైల్లో లభిస్తుంది.

iQOO నియో 10 ఫీచర్స్:

iQOO నియో 10 డిస్ప్లే క్వాలిటీ చూస్తే 6.78 ఇంచ్ 1.5k AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 5500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్, 4320Hz PWM దిమ్మింగ్ రేట్ తో వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే దీనిలో 50 మెగాపిక్సల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా, 32 మెగాపిక్సల్ సెల్ఫీ షూటర్ కెమెరా ఉన్నాయి. ఈ రెండు కెమెరాస్ కూడా 60fps తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి. వీటికి అదనంగా 5G, 4G నెట్వర్క్ సపోర్ట్, వైఫై 7, బ్లూటూత్ 5.4, GPS, NFC, OTG, USB టైప్ C కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.

స్టోరేజ్ & ప్రైస్:

ఈ iQOO నియో 10 డిఫరెంట్ స్టోరేజ్ ఆప్షన్స్ లో అవైలబుల్గా ఉంది. స్టోరేజ్ ఆప్షన్స్ కి తగ్గట్టుగా ప్రైజ్ లో వేరియేషన్ ఉంది. 8GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999గా ఉంది. 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.40,999గా ఉంది. ఇక ఈ మొబైల్ ఇంఫెర్నో రెడ్, టైటానియం క్రోమ్ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి జూన్ 2 మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్ లేదా iQOO ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ ఫ్రీ ఆర్డర్ చేసుకునే కస్టమర్స్ రూ.1899 విలువ అయిన iQOO TWS 1e ఇయర్ ఫోన్స్ ఫ్రీగా పొందవచ్చు. ఇదే కాకుండా సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ ద్వారా రూ.2000 డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే మొబైల్ ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా రూ.4000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇన్ని ఫీచర్స్ తో వస్తున్న ఈ మొబైల్ IQOO అభిమానులకు కచ్చితంగా నచ్చుతుంది.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ ఫోన్‌లో ప్రత్యేకించి ప్రో విజువల్ ఇంజిన్ ఉంటుంది, దీని ద్వారా పలు ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి
  2. ఈ ఫోన్‌ 4400mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 30 నిమిషాల్లో 50% ఛార్జ్
  3. ChatGPT said: ఆఫర్లు బ్యాంక్, కూపన్ డిస్కౌంట్లు, నో కాస్ట్ EMIతో ఎఫెక్టివ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి
  4. ఈ ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లతో లభ్యమవుతూ నో కాస్ట్ EMI ఫైనాన్స్ ఎంపికలు అందుబాటులో
  5. జూలై 14న ఇండియ‌న్ మార్కెట్‌లోకి Vivo X Fold 5, Vivo X200 FE
  6. స‌రికొత్త బ్యాట‌రీ అప్‌గ్రేడ్‌తో మార్కెట్‌లోకి iPhone 17 Pro Max
  7. ఇది మిడ్ రేంజ్‌ సెగ్మెంట్లో గట్టి పోటీగా జూలై 12 నుంచి అమెజాన్‌లో లభ్యం
  8. ప్రైమ్ డే 2025: ఎకో, ఫైర్ టీవీ, కిండిల్‌లపై గరిష్ఠంగా 50% డిస్కౌంట్
  9. నథింగ్ హెడ్‌ఫోన్ 1లో 1040mAh బ్యాటరీ ఉంది, 120 నిమిషాల్లో Type-C ద్వారా ఛార్జ్ అవుతుంది
  10. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా రూపొందించిన నథింగ్ OS 3.5 పై రన్ అవుతుంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »