త్వరలోనే Itel A50 స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేయవచ్చని తెలుస్తోంది. అయితే, Itel కంపెనీ దీని లాంచింగ్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, విడుదలకు ముందే, మోడల్ ధర, స్పెసిఫికేషన్‌లు వెబ్‌లో లీక్ అయ్యాయి. దాని ప్రకారం Itel A50 బడ్జెట్ ఫోన్‌గా మార్కెట్‌లోకి రాబోతుందని స్పష్టమైంది. Unisoc T603 SoC, 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరాతోపాటు 5,000mAh బ్యాటరీ సామర్థ్యం స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ ఇప్పటికే ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంది. అంతేకాదు, Itel A50 మోడల్ ఇప్పటికే దేశీయ మార్కెట్‌లో విడుదలైన Itel A70కి కొనసాగింపుగా వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ Itel A50 మోడల్‌కు
సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం..
అలాగే, 91మొబైల్స్ నివేదిక ప్రకారం.. Itel A50 మోడల్ ఫోన్‌ను భారత్ మొబైల్ మార్కెట్‌లో వచ్చేవారమే లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీంతోపాటు హ్యాండ్‌సెట్ ధర రూ. 7000 లోపు ఉంటుందని నివేదికలో వెల్లడించింది. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో విడుదలైన Itel A70 ఫోన్‌తో పోలిస్తే.. 4GB + 64GB సామర్థ్యంతో వచ్చిన మోడల్ ప్రారంభ ధర రూ. 6,299గా ఉంది. అలాగే, కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన హెచ్‌డీఆర్ రెయిర్ కెమెరాను ఫిక్స్ చేశారు. దీంతోపాటు సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు అనుగుణంగా ఉండేందుకు 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను రూపొందించారు. అలాగే, ఈ ఫోన్‌కు ఫేస్ అన్‌లాక్‌తో పాటు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా కలిగి ఉండి, ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. 4GB + 128GB మరియు 4GB + 256GB వేరియంట్‌ల ధరలు వరుసగా రూ. 6.799, రూ. 7,299గా నిర్ణయించారు.
వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్..
Itel A50 స్మార్ట్ ఫోన్ మన దేశంలో పలు రంగులతోపాటు వివిధ స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులోకి రానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. Itel A50 ఫోన్ 6.56-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే, కొనుగోలుదారుల ఆకర్షించేందుకు కంపెనీ కొత్త ఆఫర్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఫోన్‌కు బ్రాండ్ వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను అందించనున్నారు. ఇది ఫోన్ కొనుగోలు చేసిన 100 రోజులలోపు చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, Itel A50 దాని స్పెసిఫికేషన్‌ల జాబితాను కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఇది సియాన్ బ్లూ, లైమ్ గ్రీన్, మిస్టీ బ్లాక్, షిమ్మర్ గోల్డ్ రంగులలో అందుబాటులో ఉంది.
6.6-అంగుళాల డిస్‌ప్లేను..
ఇక Itel A50 మోడల్ ఇంటర్నల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 720x1,612 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే, 4GB RAMతో 128GB RAM జత చేయబడిన ఆక్టా-కోర్ Unisoc T603 ప్రాసెసర్‌పై నడుస్తుంది. ఇక్కడ స్టోరేజీని మరింత పెంచుకునేందుకు వీలుగా మెమరీ కార్డ్ స్లాట్‌ను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే, 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో 4G కనెక్టివిటీతో రూపొందించబడింది. ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తోంది. ఇది 163.9x75.7x8.7mm పరిమాణంతో ఉండి, భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరి ఇన్నీ ఫీచర్స్‌తో తక్కువ ధరకే అతి త్వరలో రాబోతోన్న ఈ మోడల్ ఇతర కంపెనీల బడ్జెట్ ఫోన్‌లకు ఎలాంటి పోటీని ఇస్తుందో వేచి చూడాలి.