13MP కెమెరా, మెరుగైన ప్రాసెసింగ్, స్లైడింగ్ జూమ్ బటన్ వేగంగా ఫోటోలు తీయడంలో సహాయపడుతుంది
Photo Credit: Itel
Android 14 Go, AI అసిస్టెంట్, డైనమిక్ బార్ ఫీచర్లు యూజర్ అనుభవం మెరుగుపరుస్తాయి.
Itel కంపెనీ భారత మార్కెట్లో తన కొత్త A90 లిమిటెడ్ ఎడిషన్ (128GB వెరియంట్) ను విడుదల చేసింది. ఈ మోడల్, సిరీస్కు ప్రత్యేకమైన మాక్స్ డిజైన్ను అలాగే కొనసాగిస్తూ, స్ట్రాంగ్ నెస్ను తీసుకుని రూపొందించబడింది. ఫోన్కు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, IP54 రేటింగ్, అలాగే ఇటెల్ ప్రత్యేకమైన 3P ప్రొటెక్షన్ లభించింది. ఇవన్నీ కలిసి దుమ్ము, నీరు, అలాగే చిన్నపాటి ప్రమాదాల్లో కూడా ఫోన్ సురక్షితంగా ఉండేలా సహాయపడతాయి.పనితీరులోకి వస్తే, ఇందులో 2.2GHz UNISOC T7100 ఆక్సా-కోర్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. రోజువారీ పనులు, యాప్లు, మల్టీటాస్కింగ్ వంటి వాటిని సాఫీగా నిర్వహించేలా ఈ చిప్సెట్ పని చేస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే, 6.6 ఇంచుల HD+ IPS స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. ఇవి యూజర్లకు స్మూత్ అనుభవాన్ని అందిస్తాయి. అలాగే డైనమిక్ బార్, ఆల్వేస్-ఆన్ డిస్ప్లే వంటి ఫీచర్లు బ్యాటరీ స్థాయి, నోటిఫికేషన్లు, కాల్స్ వంటి సమాచారాన్ని ప్రస్తుత పనులను అంతరాయం చేయకుండా చూపిస్తాయి.
కెమెరా విభాగంలో 13MP రియర్ కెమెరా, మెరుగైన ఇమేజ్ ప్రాసెసింగ్తో వస్తుంది. ముఖ్యంగా, ఓన్-హ్యాండ్ జూమింగ్ కోసం ఏర్పాటు చేసిన స్లైడింగ్ జూమ్ బటన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. త్వరగా ఫొటోలు తీయడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. ఫ్రంట్లో ఉన్న 8MP కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం సరైన పనితీరును ఇస్తుంది.
ఫోన్లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GB మొత్తం RAM (4GB ఫిజికల్ + 8GB వర్చువల్ RAM) లభిస్తాయి. అదనంగా మైక్రోSD కార్డు ద్వారా స్టోరేజ్ను 2TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5, GPS/GLONASS/Beidou వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఆడియో సెగ్మెంట్లో DTS సౌండ్, 3.5mm ఆడియో జాక్, అలాగే సైడ్-మౌంటెడ్ ఫింగర్ప్రింట్ స్కానర్, ఫేస్ అన్లాక్ వంటి సెక్యూరిటీ ఆప్షన్లు కూడా ఫోన్ను మరింత ప్రత్యేకంగా మార్చుతున్నాయి. బ్యాటరీ పరంగా, 5000mAh సామర్థ్యంతో పాటు 10W చార్జర్ బాక్స్లోనే వస్తుంది. 15W ఫాస్ట్ చార్జింగ్కు కూడా సపోర్ట్ ఉంది.
ఫోన్ Android 14 Go Edition పై నడుస్తుంది. ఇటెల్ అందిస్తున్న AI వాయిస్ అసిస్టెంట్, డైనమిక్ బార్ నావిగేషన్ వంటి ఫీచర్లు యూజర్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. USB టైప్-C పోర్ట్, G-సెన్సార్ వంటి ఆధునిక సెన్సర్లు కూడా ఇందులోనే ఉన్నాయి.
ధర & అందుబాటు:
itel A90 Limited Edition (128GB) ను కంపెనీ రూ. 7,299 ధరకు అందుబాటులోకి తెచ్చింది. ఇది స్పేస్ టైటానియం, స్టార్లైట్ బ్లాక్, అరోరా బ్లూ అనే మూడు ఆకర్షణీయ రంగుల్లో భారతదేశ వ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. ప్రత్యేకంగా, కొనుగోలు చేసిన తర్వాత 100 రోజులలోపుగా ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ సదుపాయం కూడా కంపెనీ అందిస్తోంది.
ఈ అన్ని ఫీచర్లను పరిశీలిస్తే, ఈ ధర రేంజ్లో దృఢత, పనితీరు, డిస్ప్లే అనుభవం, స్టోరేజ్ ఇలా ఆల్ రౌండ్ ప్యాకేజ్ను కోరుకునే వినియోగదారులకు itel A90 Limited Edition మంచి ఎంపికగా నిలుస్తుంది
ప్రకటన
ప్రకటన