Photo Credit: Itel
Itel S25 Ultra 4G మోడల్ స్పెసిఫికేషన్స్, ధరతోపాటు డిజైన్‌కు సంబధించిన ఇమేజ్‌లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. దీంతో త్వరలోనే ఇది అధికారికంగా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లీక్ అయిన ప్రమోషనల్ మెటీరియల్స్‌లో ఫోన్ మూడు కలర్ ఆప్షన్‌లలో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అలాగే, Itel S25 Ultra 4G వెనుకవైపు ట్రిపుల్ కెమెరా యూనిట్, డిస్‌ప్లేపై హోల్ పంచ్ కటౌట్‌తో కనిపిస్తుంది. ఇది హుడ్ కింద Unisoc T620 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇది గరిష్టంగా 8GB RAMతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ.. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరెందుకు ఆలస్యం.. ఈ సరికొత్త Itel S25 Ultra 4G స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కీలకమైన విషయాలను చూసేద్దామా?!
Tipster Paras Guglani (@passionategeekz) Itel S25 Ultra స్పెసిఫికేషన్‌లు, డిజైన్‌ను తెలిపేలా రెండర్‌లను పోస్ట్ చేసారు. భారతదేశంలో ఈ 4 G హ్యాండ్‌సెట్ ధర రూ.15,000 లోపు ఉంటుందని టిప్‌స్టర్ పేర్కొన్నారు. లేదా ఇతర మార్కెట్లలో దాదాపు $160 (దాదాపు రూ. 13,500) వరకూ ఉండొచ్చని అంచనా. రెండర్‌లు Itel S25 అల్ట్రాను నలుపు, నీలం, టైటానియం రంగులలో హోల్ పంచ్ డిస్‌ప్లే డిజైన్‌తో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. అయితే, హ్యాండ్‌సెట్ ఎగువున ట్రిపుల్ వెనుక కెమెరా యూనిట్‌ను అమర్చబడినట్లు కనిపిస్తోంది. అలాగే, సెన్సార్‌ల అమరిక Samsung Galaxy S24 Ultra స్మార్ట్ ఫోన్ కెమెరా సెటప్ మాదిరిగానే ఉంటుంది.
ఆన్‌లైన్‌లో లీక్ అయిన వివరాల ప్రకారం.. Itel S25 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,400nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 8GB RAM, 256GB స్టోరేజ్‌తో పాటు Unisoc T620 ప్రాసెసర్‌లో రన్ అవుతుందని తెలుస్తోంది. అలాగే, ఆన్‌బోర్డ్ RAM ఉపయోగించని స్టోరేజ్‌ని ఉపయోగించి 16GB వరకు పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ ఫీచర్ కొనుగోలుదారులకు అదనపు ఆకర్షణగా నిలిచే అవకాశం లేకపోలేదు.
ఇక Itel S25 Ultra ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. ఇది వెనుకవైపు ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. దీనిని 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాతో రూపొందించారు. అంతేకాదు, సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ మోడల్ 6.9mm మందం, 163 గ్రాముల బరువు ఉంటుందని అంచనా వేయవచ్చు. Itel S25 Ultra మోడల్ ఫోటోలుగా ఆన్‌లైన్‌లో కనువిందు చేస్తోన్న ఇవి IP64-రేటెడ్ బిల్డ్, 60 నెలల ఫ్లూయెన్సీ సర్టిఫికేట్‌తో కూడా రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ మోడల్‌కు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాంటే మాత్రం.. కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సిందే!
ప్రకటన
ప్రకటన