లీకైన సమాచారం ఆధారంగా లావా అగ్ని 4లో హారిజాంటల్ డ్యూయల్ 50 మెగాపిక్సల్ రియర్ కెమెరా సెటప్ కనిపించే అవకాశముంది. ఈ రెండు కెమెరాలు ఒక పిల్ ఆకారపు కెమెరా ఐలాండ్లో ఉంటాయి.
Photo Credit: Lava
లావా అగ్ని 4 లావా అగ్ని 3 (చిత్రంలో) తర్వాత విజయవంతం కానుందని అంచనా
భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా తన నూతన ఫ్లాగ్‌షిప్ డివైస్ అయిన అగ్ని 4 అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలిపింది. గత సంవత్సరం అక్టోబరులో వచ్చిన అగ్ని 3కి ఇది కొనసాగింపు మోడల్‌గా వస్తోంది. అయితే, కంపెనీ నుండి అధికారిక ప్రకటనకు ముందే దీని డిజైన్, స్పెసిఫికేషన్లు మరియు ధర లాంటివి ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వాటిని కంప్లీట్ గా ఎనాలసిస్ చేద్దాం. లీకైన సమాచారం ప్రకారం, లావా అగ్ని 4ను సుమారు రూ. 25,000 ధర పరిధిలో మార్కెట్లోకి తీసుకురావాలనే ఆలోచనలో కంపెనీకి ఉన్నట్టు తెలుస్తోంది. అగ్ని 3లో ఉన్న 8GB + 128GB వేరియంట్‌ను లావా రూ. 20,999కు లాంచ్ చేసింది. అదే వేరియంట్ ఛార్జర్‌తో కలిపి రూ. 22,999, 256GB వేరియంట్‌ను రూ. 24,999కి అందించింది. ఈ నేపథ్యాన్ని బట్టి చూస్తే, అగ్ని 4 ధర రూ. 25,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కంపెనీ నుంచి అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
లీక్‌ల ప్రకారం లావా అగ్ని 4 డిజైన్‌లో కొన్ని కీలక మార్పులు కనిపించనున్నాయి. వెనుక భాగంలో 50MP + 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను పిల్ షేప్ ఐలాండ్‌లో అమర్చే అవకాశం ఉంది. LED ఫ్లాష్ కూడా మధ్యలో ఏర్పాటు చేస్తారు. ఇది చూస్తే, అగ్ని 3లోని ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పోలిస్తే కొంత తక్కువగానే కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా, అగ్ని 3లో ప్రత్యేకంగా ఉన్న మినీ AMOLED బ్యాక్ డిస్‌ప్లేను ఈసారి తొలగించే అవకాశం ఉందని సమాచారం. అగ్ని 4 డిజైన్ వైట్ కలర్ బ్యాక్ ప్యానల్, మెటల్ ఫ్రేమ్ మరియు ఫ్లాట్ ఎడ్జ్‌లతో రానుంది. కుడి వైపు పవర్ మరియు వాల్యూమ్ బటన్‌లు ఉండే అవకాశముంది.
లావా అగ్ని 4లో 6.78 అంగుళాల Full HD+ స్క్రీన్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ మరియు గేమింగ్ అనుభవం మరింత మెరుగవుతుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో MediaTek Dimensity 8350 చిప్‌సెట్ వాడే అవకాశం ఉంది. బ్యాటరీ విషయంలో, ఈసారి 7,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఇవ్వాలన్న లక్ష్యంతో లావా ముందుకెళ్తోంది. దీని ద్వారా బ్యాటరీ లైఫ్ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎక్కువసేపు ఫోన్ వాడేవారికి, గేమ్స్ ఆడే వారికి ఈ ఫీచర్ వల్ల బెనిఫిట్ అవుతుంది.
అగ్ని 3లో వినియోగదారులను ఆకట్టుకున్న మరో ముఖ్యమైన ఫీచర్ “ఆక్షన్ బటన్”. దీని ద్వారా ఫోన్‌ను సైలెంట్ లేదా రింగర్ మోడ్‌లలో మార్చడం, టార్చ్ ఆన్ చేయడం, కెమెరా బటన్‌గా వాడుకోవడం సాధ్యమయ్యేది. అయితే అగ్ని 4లో ఇది కొనసాగుతుందా? లేక తీసేస్తారా? అన్నది ఇంకా స్పష్టత లేదు.
మొత్తంగా లీక్‌ల ఆధారంగా చూస్తే, లావా అగ్ని 4 పలు విభాగాల్లో మెరుగుదలతో వస్తోంది . ముఖ్యంగా బ్యాటరీ, ప్రాసెసర్, డిజైన్ పరంగా. అయితే, మినీ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి కొన్ని ప్రత్యేకతలు లేకపోవడం వల్ల మిశ్రమ స్పందన రావచ్చు. అయినప్పటికీ, అధికారికంగా కంపెనీ ఏం ప్రకటించబోతోందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch