లీకైన వివరాల ప్రకారం, లావా అగ్ని 4 లో 6.67 అంగుళాల స్క్రీన్, 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండనుంది. పనితీరులో శక్తివంతమైన MediaTek Dimensity 8350 చిప్‌సెట్ తో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో UFS 4.0 స్టోరేజ్ మరియు LPDDR5X RAM ఉండడం వల్ల స్పీడ్ పరంగా మంచి అనుభవం ఇస్తుందని చెప్పబడింది.
Photo Credit: Lava Mobiles
లావా అగ్ని 3 కి వారసుడిగా లావా అగ్ని 4 రాబోతోంది.
భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava తన కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ Lava Agni 4 ను నవంబర్ 20న భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. లావా అగ్ని 3 కు కంటిన్యూషన్ గా రాబోతున్న ఈ ఫోన్‌లో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉండనున్నాయని సమాచారం. లీకైన వివరాల ప్రకారం, లావా అగ్ని 4 లో 6.67 అంగుళాల స్క్రీన్, 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండనుంది. పనితీరులో శక్తివంతమైన MediaTek Dimensity 8350 చిప్‌సెట్ తో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో UFS 4.0 స్టోరేజ్ మరియు LPDDR5X RAM ఉండడం వల్ల స్పీడ్ పరంగా మంచి అనుభవం ఇస్తుందని చెప్పబడింది.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల విషయానికి వస్తే, లావా కంపెనీ మూడు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లు మరియు నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందించనున్నట్లు తెలుస్తోంది. కెమెరా విభాగంలో, ఫోన్‌లో 50MP OIS ప్రైమరీ లెన్స్ మరియు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్‌లోని ప్రధాన ఆకర్షణ కస్టమైజ్ చేయగల యాక్షన్ కీ...ఇది యూజర్ కోరుకున్న ఏ ఫంక్షన్‌కైనా షార్ట్‌కట్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇది లావా బ్రాండ్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన ప్రత్యేక ఫీచర్‌గా నిలుస్తుంది. అదనంగా, డ్యూయల్ స్పీకర్లు, X-యాక్సిస్ హాప్టిక్స్, అలాగే IP64 రేటింగ్ తో నీటి మరియు దుమ్ము నిరోధకత లభిస్తుంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో USB 3.2, ఇన్‌ఫ్రారెడ్ (IR), Wi-Fi 6E సపోర్ట్‌లు ఉంటాయి. బ్యాటరీ విషయానికి వస్తే, 5,000mAh బ్యాటరీ తో పాటు 66W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం అందిస్తారని సమాచారం.
భారత మార్కెట్‌లో లావా అగ్ని 4 ధర రూ. 30,000 లోపుగా ఉండే అవకాశం ఉంది. లావా మరోసారి “Zero Bloatware” అనుభవాన్ని అందించనున్నదే కాకుండా, వినియోగదారుల కోసం Free Home Replacement Service ను కూడా కొనసాగించనున్నట్లు సమాచారం. మొత్తానికి, దేశీయ బ్రాండ్ లావా తన అగ్ని సిరీస్ ద్వారా మళ్లీ మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో బలమైన పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
ప్రకటన
ప్రకటన