భారతదేశంలో Moto G67 Power 5G ధర రూ. 15,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌కు వర్తించగా, 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ తరువాత విక్రయానికి రాబోతోంది.
Photo Credit: Motorola
Moto G67 Power 5Gలో 50-మెగాపిక్సెల్ Sony LYTIA 600 ప్రైమరీ రియర్ కెమెరా ఉంది.
మోటరోలా తన G సిరీస్‌లో కొత్తగా Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 7s Gen 2 ప్రాసెసర్, 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 6.7 అంగుళాల Full-HD+ డిస్‌ప్లే వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 50 మెగాపిక్సెల్ Sony LYT-600 ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, ఇంకా అదనంగా “టూ-ఇన్-వన్ ఫ్లికర్” సెన్సార్ ఇవ్వబడింది. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ Android 15 బేస్డ్ Hello UX పై నడుస్తుంది. కంపెనీ ఒక OS అప్‌డేట్‌తో పాటు మూడు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందించనుంది. HDR10+ సపోర్ట్‌తో పాటుకార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, MIL-810H మిలిటరీ గ్రేడ్ డ్రాప్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అదనంగా, 8GB RAM తో వచ్చిన ఈ ఫోన్‌లో RAM Boost 4.0 ద్వారా అదనంగా 24GB వరకు వర్చువల్ RAM పెంచుకునే అవకాశం ఉంది. స్టోరేజ్ విషయంలో గరిష్టంగా 256GB వరకు అందుబాటులో ఉంటుంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో పాటు, Google Gemini AI వాయిస్ అసిస్టెంట్ కూడా ఈ మోడల్‌లో కలిపారు.
భారతదేశంలో Moto G67 Power 5G ధర రూ. 15,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌కు వర్తించగా, 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ తరువాత విక్రయానికి రాబోతోంది. ప్రారంభ ఆఫర్ కింద బేస్ వేరియంట్‌ను రూ. 14,999కు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Flipkart మరియు మోటరోలా అధికారిక వెబ్‌సైట్ ద్వారా నవంబర్ 12 నుంచి అమ్మకానికి రానుంది. Pantone సర్టిఫైడ్ అయిన పారాచూట్ పర్పుల్, బ్లూ క్యూరాకో, సిలాంట్రో వంటి మూడు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. IP64 రేటింగ్ ఉన్న ఈ ఫోన్ డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. వెగన్ లెదర్ ఫినిష్‌తో వెనుక ప్యానెల్‌ను డిజైన్ చేశారు. దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Dolby Atmos మరియు Hi-Res ఆడియో సపోర్ట్ ఉన్నాయి. 5G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, Bluetooth 5.1, GPS, GLONASS, Galileo, QZSS, BeiDou వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించబడాయి. అలాగే ప్రాక్సిమిటీ, యాక్సిలరోమీటర్, అంబియెంట్ లైట్ సెన్సార్, జైరోస్కోప్, SAR సెన్సార్, ఈ-కాంపస్ వంటి సెన్సర్లు కూడా ఉన్నాయి.
ఈ ఫోన్ ముఖ్య ఆకర్షణగా నిలిచింది దాని 7,000mAh భారీ బ్యాటరీ. 30W వైర్‌డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 గంటల పాటు సంగీతం వినగలిగే అవకాశాన్ని, 33 గంటల వీడియో ప్లేబ్యాక్, 28 గంటల వెబ్ బ్రౌజింగ్, 49 గంటల కాలింగ్ బ్యాకప్‌ను ఇస్తుందని మోటరోలా చెబుతోంది. ఫోన్ బరువు 210 గ్రాములు కాగా, పరిమాణం 166.23×76.5×8.6 మిల్లీమీటర్లుగా ఉంది. ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన