ఈ సిరీస్లోని అన్ని మోడళ్లు MediaTek Dimensity చిప్సెట్లపైనే నడుస్తాయని, వాటిలో మూడు రియర్ కెమెరాలు ఉంటాయని గత రిపోర్టులు సూచిస్తున్నాయి
Photo Credit: Oppo
రెండు ఫోన్లలో 1.5K ఫ్లాట్ డిస్ప్లేలు ఉంటాయి
OPPO త్వరలోనే భారత్లో తన కొత్త Reno 15 సిరీస్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం, ఈ సిరీస్లో Reno 15, Reno 15 Pro, అలాగే Reno 15 Mini అనే మూడు మోడళ్లు ఉండనున్నాయి. అధికారికంగా ధరలు, స్పెసిఫికేషన్లు వెల్లడించకపోయినా, లీక్ల ద్వారా కొంత సమాచారం బయటపడింది.ఈ సిరీస్లోని అన్ని మోడళ్లు MediaTek Dimensity చిప్సెట్లపైనే నడుస్తాయని, వాటిలో మూడు రియర్ కెమెరాలు ఉంటాయని గత రిపోర్టులు సూచిస్తున్నాయి. ఇందులో అత్యంత ఖరీదైన మోడల్గా భావిస్తున్న Reno 15 Pro, 6.78 అంగుళాల డిస్ప్లేతో రానుందని, ఇది గత Reno 14 Pro కి కంటిన్యూషన్ గా ఉండలున్నట్లు తెలుస్తోంది. ఇతర రెండు మోడళ్ల విషయానికి వస్తే, Reno 15 లో 6.59 అంగుళాల డిస్ప్లే, Reno 15 Mini లో 6.32 అంగుళాల స్క్రీన్ ఉండవచ్చని సమాచారం.
91మొబైల్స్ మరియు టిప్స్టర్ సుధాంశు అంబోరే కలిసి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మూడు మోడళ్లు డిసెంబర్ నెలలో భారత మార్కెట్కు రానున్నాయి. ముందుగా ఊహించినట్టుగా “Reno 15 Pro Max” అనే పేరును ఉపయోగించే బదులు, ఇప్పుడు “Reno 15 Pro” పేరుతోనే విడుదల చేయడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. స్టాండర్డ్ మోడల్ను కాంపాక్ట్ సైజ్ ఫోన్గా తీసుకొస్తారని చెబుతున్నారు.
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, Reno 15 Pro మరియు Reno 15 Mini మోడళ్లలో 1.5K రిజల్యూషన్ ఉన్న ఫ్లాట్ డిస్ప్లేలు ఉండొచ్చు. మొత్తం సిరీస్కు మెటల్ ఫ్రేమ్ ఉండే అవకాశం ఉంది. అలాగే, IP68 + IP69 రేటింగ్లు వచ్చే అవకాశముంది... అంటే ఫోన్ నీరు, దుమ్ము నుంచి ఫుల్ ప్రొటెక్షన్ లభిస్తుంది.
ప్రాసెసర్ సెగ్మెంట్లో Dimensity 8450 SoC వాడతారని భావిస్తున్నారు. అయితే పాత లీక్ల ప్రకారం, Reno 15 Proకి Dimensity 9400 చిప్, 6,500mAh బ్యాటరీ, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చు. ఇవి ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.
కెమెరా విభాగంలో ఈ సిరీస్ భారీ అప్గ్రేడ్తో రానుందని సమాచారం. Reno 15 Pro మరియు Reno 15 Mini రెండింటిలోనూ 200MP Samsung ISOCELL HP5 ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉండొచ్చు. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది.
సమగ్రంగా చూస్తే, కెమెరా, చిప్సెట్, డిజైన్, బ్యాటరీ పరంగా Reno 15 సిరీస్ ఒక ఫ్లాగ్షిప్ లెవల్ అనుభవం ఇచ్చేలా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే అసలు స్పెసిఫికేషన్లు, భారత్లో ధర, ఆఫర్లు ఇవన్నీ అధికారిక లాంచ్ ఈవెంట్లోనే తెలుస్తాయి.
ప్రకటన
ప్రకటన