Photo Credit: Motorola
మోటరోలా రేజర్ 60 అల్ట్రా కవర్ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ రక్షణను కలిగి ఉంది
ఈ ఏడాది ఏప్రిల్‌లో Motorola Razr 60 తోపాటు 60 ఆల్ట్రా కూడా గ్లోబల్ మార్కెట్‌లో విడుదలైన విషయం తెలిసింది. తాజాగా, క్లామ్‌షెల్ ఫోల్డబుల్ క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షీప్ Motorola Razr 60 Ultra 4,700mAh బ్యాటరీతో ఇండియాలో విడుదలైంది. దీనికి, 4 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 7 అంగుళాల ఫోల్డబుల్ ఇన్నర్ స్క్రీన్‌ను అందించారు. అలాగే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 16జీబీ ర్యామ్‌తో దీనిని రూపొందించారు. ఈ మొబైల్‌కు రెండు 50 మెగాపిక్సెల్ సెన్సార్‌లు, 50 మెగాపిక్సెల్ ఇన్నర్ సెల్ఫీ కెమెరాను కూడా అందించారు.
కొత్త Motorola Razr 60 Ultra ధరను మన దేశంలో రూ. 99,999గా కంపెనీ నిర్ణయించింది. కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ అకౌంట్‌లనుంచి ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.89,999లకు అంటే, రూ. 10,000 తక్షణ తగ్గింపు లభిస్తుందని వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ మౌంటైన్ ట్రైల్, స్కారాబ్, రియో రెడ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అలాగే, మన దేశంలో కొనుగోలుకు రిలయన్స్ డిజిటల్, అమెజాన్‌తోపాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలుకు మే 21 మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉండనుంది.
Razr 60 Ultra 7 అంగుళాల 1.5K ఫోల్డబుల్ మెయిన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 165 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ వరకూ పీక్ బ్రైట్ నెస్ లెవెల్, హెచ్‌డీఆర్10+ డాల్బీ విజన్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. 1272x1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 4 అంగుళాల pOLED LTPO కవర్ స్క్రీన్ మరోవైపు ఉంది. ఇది 3000 నిట్స్ వరకూ పీక్ బ్రైట్‌నెస్ లెవెన్‌ను కలిగి ఉంటుంది. 165 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తూ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ ప్రొటక్షన్‌తో వస్తుంది.
ఈ కొత్త మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో యూఐతో వస్తోంది. ఇది మూడు మేజర్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని కంపెనీ స్పష్టం చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో 16జీబీ వరకూ LPDDR5X ర్యామ్, 512జీబీ యూఎఫ్ఎస్ 4.1 ఆన్‌బోర్డ్ స్టోరేజీతో అటాచ్ చేయబడి ఉంటుంది. మోటో ఏఐ 2.0 సూట్ ఫీచర్స్‌తోపాటు మోటో ఏఐ కీతో వస్తోంది.
కనెక్టివిటీ ఆప్షన్‌లను చూస్తే, Razr 60 Ultra 5జీ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, Wi-Fi తోపాటు యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఈ మోబైల్ దుమ్ము, నీటి నియంత్రణకు ఐపీ48 రేటింగ్‌తో వస్తోంది. 68 W వైర్డ్ టర్బోపవర్, 30 W వైర్‌లెస్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రూపొందించారు. ఓపెన్ చేసినప్పుడు 73.99x171.48x7.19 ఎం ఎం పరిమాణంతో 199 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన