Photo Credit: Motorola
Motorola Razr+ పారిస్ హిల్టన్ ఎడిషన్ పారిస్ పింక్ షేడ్ మరియు వేగన్ లెదర్ ముగింపులో వస్తుంది
అమెరికాలో Motorola Razr+ Paris Hilton ఎడిషన్ మంగళవారం అమెరికాలో లాంఛ్ అయింది. ఇది పారిస్ పింక్ షేడ్, వీగన్ లెదర్ ఫినిషింగ్‌తో పాటు వీగన్ లెదర్ కేసుతో సహా కస్టమ్ యాక్సెసరీలతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ కస్టమైజ్డ్ రింగ్‌టోన్‌లు, అలెర్ట్‌లు, వాల్‌పేపర్‌లతో రూపొందించబడి ఉంటుంది. అలాగే, ఈ మోడల్ US వెలుపల ఎంపిక చేసిన మార్కెట్లలో, భారతదేశంలో మోటరోలా రేజర్+ 50 అల్ట్రా వలె ప్రవేశపెట్టబడిన ప్రామాణికంగా మోటరోలా రేజర్+ (2024) మాదిరిగానే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్, 4-అంగుళాల కవర్ డిస్‌ప్లే, 4,000mAh బ్యాటరీతో రూపొందించబడింది.
Motorola Razr+ Paris Hilton ఎడిషన్ ఒకే ఒక కాన్ఫిగరేషన్ 12GB RAM, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ దర $1,199.99 (సుమారు రూ. 1.04,300)గా నిర్ణయించబడింది. ఇది ఫిబ్రవరి 13 నుండి USలో పరిమిత సంఖ్యలో ప్రత్యేకంగా Motorola.comలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ మోడల్ ఫోన్ పారిస్ పింక్ రంగులో వెనుక ప్యానెల్‌పై పారిస్ హిల్టన్ ఆటోగ్రాఫ్, మధ్యలో దట్స్ హాట్ అనే పదం ఆకర్షణీయంగా చెక్కబడి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమైజ్డ్ ప్యాకేజింగ్‌లో వస్తుంది. పారిస్-ఇన్స్‌స్పైర్డ్ రింగ్‌టోన్‌లు, అలెర్ట్‌లు, వాల్‌పేపర్‌లతో రూపొందించబడింది. మోటరోలా రేజర్+ పారిస్ హిల్టన్ ఎడిషన్ పింక్ ఐకాన్ కలర్ ఆప్షన్‌లో వీగన్ లెదర్ కేస్, పింక్ స్పార్కిల్, పింక్ వీగన్ లెదర్ స్ట్రాప్ ఆప్షన్‌లతో సహా ప్రత్యేకమైన వస్తువులతో వస్తుంది. దీని డిజైన్‌తోపాటు ఇందులో అందించే థింగ్స్ కారణంగా కొనుగోలు దారుల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
దీని స్పెసిఫికేషన్లు స్టాండర్డ్ రేజర్+ లాగానే ఉంటాయి. 6.9-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,640 పిక్సెల్స్) LTPO pOLED మెయిన్ స్క్రీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్‌తో 4-అంగుళాల (1,080x1,272 పిక్సెల్స్) LTPO pOLED కవర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌తోపాటు 12GB వరకు LPDDR5X RAM, 256GB UFS 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడింది. Motorola Razr+ Paris Hilton ఎడిషన్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత హలో UIతో వస్తుండడంతో ఈ మోడల్‌పై అంచనాలు పెరిగాయి.
Motorola Razr+ Paris Hilton ఎడిషన్ ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో పాటు 50-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌తో పాటు వెనుకవైపు 2x ఆప్టికల్ జూమ్‌తో వస్తుంది. అలాగే, దీని ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం.. దీనికి సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించడం ద్వారా ఈ మోడల్ మరింత ఆదరణ పొందే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన