నథింగ్ ఫోన్ 3a సిరీస్ 2024 యొక్క ఫోన్ 2aకి సక్సెసర్ అని చెప్పబడింది
ప్రపంచవ్యాప్తంగా మార్చి 4న Nothing Phone 3a సిరీస్ లాంచ్ కానుంది. దీని అరంగేట్రానికి ముందు, ఈ బ్రిటిష్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారు (OEM) లైనప్‌లోని ప్రో మోడల్ కీలక కెమెరా స్పెసిఫికేషన్‌లను నిర్ధారించింది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను అందిస్తున్నారు. అలాగే, స్పెసిఫికేషన్‌లతోపాటు కెమెరా యూనిట్ లేఅవుట్ కూడా టీజ్ చేయబడింది. సాంప్రదాయ డిజైన్‌లతో పోలిస్తే ఈ కెమెరాలు అసాధారణ రీతిలో అమర్చబడినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Nothing Phone 3a సిరీస్‌కు సంబంధించిన కీలక అంశాలను చూద్దాం!
కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన కొత్త వీడియోలో.. రాబోయే Nothing Phone 3a కెమెరా సామర్థ్యాలను మార్కెట్‌లోని హెవీవెయిట్‌లలో ఒకటైన iPhone 16 Pro Maxతో పోల్చింది. మునుపటి ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50-మెగాపిక్సెల్ షేక్ ఫ్రీ కెమెరా, OISతో 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ సోనీ సెన్సార్, సోనీ సెన్సార్‌తో 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-యాంగిల్ షూటర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. పైన పేర్కొన్న స్పెసిఫికేషన్స్‌ను కంపెనీ నిర్థారించినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే, Phone 3a సిరీస్‌లోని ప్రైమరీ కెమెరా ఏ పోల్చదగిన సెన్సార్ కంటే అతిపెద్ద ఫుల్ విల్ కెపాసిటీ కలిగి ఉందని వెల్లడించ లేదు. ఈ Phone 3a సిరీస్‌లోని 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా 3x ఆప్టికల్ జూమ్, 6x లాస్‌లెస్ జూమ్, 60x వరకు అల్ట్రా జూమ్‌ను అందిస్తుందని వీడియో ద్వారా స్పష్టమవుతుంది. అలాగే, ఈ కెమెరా ఫీచర్స్ ఇతర మోడల్స్‌తో పోల్చి చూసినప్పుడు Phone 3a సిరీస్ మెరుగైన పనితీరును ప్రదర్శిస్తున్న విషయం అర్థమైపోతుంది.
పైన పేర్కొన్న సెన్సార్ వినియోగదారులు 6x వరకు మాగ్నిఫికేషన్‌తో మాక్రో జూమ్ షాట్‌లను తీసేందుకు వీలు కల్పిస్తుంది. అలాంటి మీడియాను కాప్చ్యూర్ చేసేందుకు అవుట్ మాక్రో లెన్స్‌లను ఉపయోగించాల్సిన అవసరాన్ని లేకుండా చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫీచర్ రాబోయే సిరీస్‌కు మరింత బలాన్ని చేకూర్చుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇతర మోడల్స్‌తో పోల్చి చూసినప్పుడు ఇది వినియోగదారులను మరింత ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నాయి.
Phone 3a సిరీస్‌లోని మరో కెమెరా ఫీచర్ 4K వీడియో స్టెబిలైజేషన్. కంపెనీ చెబుతున్న దానిని బట్టీ.. ఇది వీడియో స్థిరత్వాన్ని 200 శాతానికి పైగా పెంచుతుంది. ఫోన్ 4K/30fps వరకు షూట్ చేయడానికి అవకాశం కల్పిస్తుందని స్పష్టం చేసింది. ఈ మార్పులు వర్తింపజేయాలా వద్దా అని నిర్ణయించడానికి ఫుటేజ్‌ను సొంతంగా అనాలసిస్ చేసే అడాప్టివ్ స్టెబిలైజేషన్ కూడా ఇందులో అందించారు. మరి, రాబోయే సిరీస్‌కు ఈ స్పెసిఫికేషన్స్ ఎంత వరకూ లాభాన్ని చేకూర్చుతాయో తెలియాంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన