Photo Credit: One Plus
OnePlus 13 చైనాలో ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంబించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్‌లో సహా ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో ఈ కంపెనీ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌ను తీసుకురానున్నట్లు స్పష్టమైంది. లీకైన అనౌన్స్‌మెంట్ బ్యానర్‌ను ఓ టిప్‌స్టర్ షేర్ చేసారు. ఇది ఫోన్ గ్లోబల్ లాంచ్ తేదీని వెల్లడిస్తోంది. చైనాలో ఇప్పటికే లాంచ్ చేసిన మాదిరిగానే ఈ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ వేరియంట్ కూడా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. OnePlus Ace 5 ఫోన్ రీబ్యాడ్జ్ వెర్షన్‌గా చెప్పబడుతున్న OnePlus 13R కూడా ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌తో పాటు రానున్నట్లు అంచనా వేస్తున్నారు.
అనౌన్స్‌మెంట్ బ్యానర్‌ను
ఈ OnePlus 13 సిరీస్ జనవరి 7, 2025న కంపెనీ వింటర్ లాంచ్ ఈవెంట్‌లో రాత్రి 9 గంటలకు భారత్‌తోపాటు ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో విడుదల చేయనుంది. ఈ మేరకు టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ (@yabhishekd) Xలో అనౌన్స్‌మెంట్ బ్యానర్‌ను ఓ పోస్ట్‌లో షేర్ చేశారు. ఈ ఫ్లాగ్‌షిప్ OnePlus 13తో పాటు ఇదే లైనప్‌లో OnePlus 13R కూడా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. అమెజాన్, వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా OnePlus 13 భారత్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనున్నట్లు గతంలోనే కంపెనీ స్పష్టం చేసింది. ఇది ఆర్కిటిక్ డాన్, బ్లాక్ ఎక్లిప్స్, మిడ్‌నైట్ ఓషన్ కలర్ ఆప్షన్‌లలో లభించనుంది.
చైనాలో ఇప్పటికే విడుదలైన OnePlus 13 చైనీస్ వెర్షన్‌లో 6.82-అంగుళాల Quad-HD+ LTPO AMOLED స్క్రీన్‌ను అందించారు. అలాగే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, గరిష్ట బ్రైట్‌నెస్ 4,500 నిట్‌లు, డాల్బీ విజన్ సపోర్ట్ కలిగి ఉన్నాయి. ఇది 24GB వరకు LPDDR5X RAMతోపాటు UFS 4.0తో 1TB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీని కలిగి ఉంటుంది. Snapdragon 8 Elite ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. ఇది Android 15-ఆధారిత ColorOS 15తో రన్ చేయబడుతోంది.
OnePlus 13 చైనా వేరియంట్ కెమెరా విషయానికి వస్తే.. 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందించారు. అలాగే, ముందు కెమెరాలో 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. ఇది 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
తాజాగా, చైనాలో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో OnePlus Ace 5 స్మార్ట్ ఫోన్ విడుదల కానున్నట్లు స్పష్టమైంది. ఇది OnePlus Ace 5 Pro వేరియంట్‌తో పాటు ప్రీ-రిజర్వేషన్ కోసం అందుబాటులో ఉంది. అయితే, డిసెంబర్ 26న దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు. కంపెనీ నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
ప్రకటన
ప్రకటన